Kannappa Prabhas: కన్నప్ప నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ వచ్చేసింది.. రెబల్ స్టార్ పాత్ర ఏదంటే..

Best Web Hosting Provider In India 2024

Kannappa Prabhas: కన్నప్ప నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ వచ్చేసింది.. రెబల్ స్టార్ పాత్ర ఏదంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 03, 2025 11:40 AM IST

Prabhas first look from Kannappa: కన్నప్ప సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ వచ్చేసింది. నుదుటన నామాలతో సాధువులా ఈ లుక్ ఉంది. క్యారెక్టర్ ఏదో కూడా రివీల్ అయింది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

Kannappa Prabhas: కన్నప్ప నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ వచ్చేసింది.. రెబల్ స్టార్ పాత్ర ఏదంటే..
Kannappa Prabhas: కన్నప్ప నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ వచ్చేసింది.. రెబల్ స్టార్ పాత్ర ఏదంటే..

మంచు విష్ణు ప్రధాన పాత్ర పోషిస్తున్న కన్నప్ప చిత్రంలో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కనిపించనున్నారు. ఈ మైథలాజికల్ చిత్రంలో ఓ కీలకపాత్ర చేస్తున్నారు. ప్రభాస్ ఉండటంతో ఈ సినిమాపై ఆసక్తి మరింత విపరీతంగా ఉంది. ఈ చిత్రంలో ఆయన క్యారెక్టర్ ఏదోననే క్యూరియాసిటీ మొదటి నుంచి నెలకొంది. ఆ ఉత్కంఠ నేడు (ఫిబ్రవరి 3) వీడింది. కన్నప్ప మూవీ నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ వచ్చేసింది. పాత్ర ఏదో కూడా తెలిసిపోయింది.

yearly horoscope entry point

ప్రభాస్ లుక్ ఇలా..

కన్నప్ప చిత్రం నుంచి వచ్చిన ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంట్రెస్టింగ్‍గా ఉంది. మెడలో రుద్రాక్ష మాలలు, చేతిలో కర్ర, నుదుటన మూడు నామాలు, తిలకంతో ఓ సాధువులా ప్రభాస్ లుక్ ఉంది. ఈ పోస్టర్ మరింత ఆసక్తిని పెంచేసింది.

రుద్ర పాత్రలో..

కన్నప్ప చిత్రంలో రుద్ర పాత్రను ప్రభాస్ పోషిస్తున్నారు. ఈ విషయాన్ని ఫస్ట్ లుక్ పోస్టర్లో మూవీ టీమ్ వెల్లడించింది. “ప్రళయకాల రుద్రుడు!, త్రికాల మార్గదర్శకుడు, శివాజ్ఞ పరిపాలకుడు” అని రుద్ర క్యారెక్టర్ గురించి ఈ పోస్టర్‌పై ఉంది. అంటే మహాశివుడి అంశగా, ఆయన ఆదేశాలను పాటించేలా ఈ పాత్ర ఉంటుందని అర్థమవుతోంది. కన్నప్పకు సంరక్షకుడిగా రుద్ర ఉంటాడని తెలుస్తోంది. ఈ చిత్రంలో శివుడి పాత్రలో అక్షయ్ కుమార్ నటిస్తున్నారు.

కన్నప్ప సినిమాలో ముందుగా శివుడి పాత్రను ప్రభాస్‍కే ఆఫర్ చేశారట మంచు విష్ణు. అయితే, ఆయన వేరే క్యారెక్టర్ చేస్తానని చెప్పారని విష్ణు గతంలో చెప్పారు. దీంతో ప్రభాస్‍ది ఓ క్యారెక్టర్ అయి ఉంటుందని చాలా రోజులుగా సస్పెన్స్ సాగింది. కొన్ని రూమర్లు కూడా వచ్చాయి. అయితే, కన్నప్పలో రుద్రగా ప్రభాస్ కనిపించనున్నారని ఇప్పుడు ఫస్ట్ లుక్‍తో క్లారిటీ వచ్చేసింది.

Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024