![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/hindupir_1738563028319_1738563041472.jpeg)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497842_358_newTwitterIcon.png)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497843_996_facebook1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497844_122_wapp1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/hindupir_1738563028319_1738563041472.jpeg)
Hindupur Municipality: హిందూపురం మునిసిపాలిటీ ఛైర్మన్ పీఠం దక్కించుకున్న టీడీపీ, పలు మునిసిపాలిటీల్లో టీడీపీ దూకుడు
Hindupur Municipality: రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపాలిటీల్లో ఖాళీ అయిన స్థానాలను టీడీపీ దక్కించుకుంది. హిందూపురంలో విప్ జారీ చేసినా వైసీపీకి ఓటమి తప్పలేదు. టీడీపీ అభ్యర్థి రమేష్ కుమార్ మునిసిపల్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. నెల్లూరు, ఏలూరులో డిప్యూటీ మేయర్ స్థానాలను టీడీపీ దక్కించుకుంది.
Hindupur Municipality: హిందూపురం మునిసిపాలిటీలో వైసీపీకి ఓటమి తప్పలేదు. వైసీపీ విప్ జారీ చేసినా ఆ పార్టీ కౌన్సిలర్లు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. హిందూపురం మునిసిపల్ ఛైర్మన్‌గా రమేష్ కుమార్ ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురంలోనే ఉండి ఎన్నికకు సారథ్యం వహించారు.
![yearly horoscope entry point](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
వైసీపీ కౌన్సిలర్లు దూరంగా ఉండటంతో ఆ పార్టీ అభ్యర్థికి మెజార్టీ దక్కలేదు. బాలయ్య ఆశీస్సులతో మునిసల్ ఛైర్మన్‌గా ఎన్నికైనట్టు ఛైర్మన్ రమేష్ కుమార్ చెప్పారు. టీడీపీ అభ్యర్థి రమేష్‌కు 23 ఓట్లు దక్కగా వైసీపీ అభ్యర్థి లక్ష్మీకి 14ఓట్లు దక్కాయి. పలువురు వైసీపీ కార్పొరేటర్లు ముందుగానే టీడీపీ గూటికి చేరిపోయారు.
50మంది కార్పొరేటర్లు ఉన్న ఏలూరు కార్పొరేషన్‌లో టీడీపీకి 30మంది సభ్యుల బలం ఉంది. తగినంత బలం లేకపోవడంతో వైసీపీ కార్పొరేటర్లు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. దీంతో డిప్యూటీ మేయర్ ఎన్నిక ముగిసింది. వందనాల దుర్గా భవానీ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు.
నెల్లూరులో 29ఓట్లతో డిప్యూటీ మేయర్‌గా తహసీన్ ఎన్నికయ్యారు. టీడీపీకి అనుకూలంగా 41, వైసీపీకి అనుకూలంగా 12 ఓట్లు వచ్చాయి. దీంతో 29 ఓట్ల మెజార్టీతో తహసీన్‌ను గెలిచినట్టు ప్రకటించారు.
నూజివీడులో 8మంది వైసీపీ కౌన్సిలర్లు ఆ పార్టీని వీడారు. మంత్రి పార్థ సారథి సమక్షంలో టీడీపీలో చేరారు. వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ గూటికి చేరడంతో టీడీపీ బలం అనూహ్యంగా పెరిగింది. దీంతో వైసీపీ కార్పొరేటర్ల సంఖ్య 24 నుంచి 16కు పడిపోయింది. అటు టీడీపీ బలం 18కు పెరిగింది.
టాపిక్