CCL 2025 OTT: సీసీఎల్ 2025 తెలుగు వారియర్స్ మ్యాచ్‌ల షెడ్యుల్ ఇదే! ఏ ఓటీటీలో లైవ్‌గా చూడొచ్చంటే?

Best Web Hosting Provider In India 2024

CCL 2025 OTT: సీసీఎల్ 2025 తెలుగు వారియర్స్ మ్యాచ్‌ల షెడ్యుల్ ఇదే! ఏ ఓటీటీలో లైవ్‌గా చూడొచ్చంటే?

Sanjiv Kumar HT Telugu
Feb 03, 2025 12:03 PM IST

CCL 2025 Telugu Warriors Schedule And Live Streaming OTT: సౌత్, నార్త్ హీరోలు క్రికెట్‌ ఆడి ఈ సంవత్సరం కూడా వినోదం పంచనున్నారు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2025 తెలుగు వారియర్స్ ఆడే మ్యాచ్‌ల షెడ్యుల్ వివరాలు వచ్చేశాయి. అలాగే, ఈ సీసీఎల్ 2025 మ్యాచ్‌లను లైవ్‌గా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయో చూద్దాం.

సీసీఎల్ 2025 తెలుగు వారియర్స్ మ్యాచ్‌ల షెడ్యుల్ ఇదే! ఏ ఓటీటీలో లైవ్‌గా చూడొచ్చంటే?
సీసీఎల్ 2025 తెలుగు వారియర్స్ మ్యాచ్‌ల షెడ్యుల్ ఇదే! ఏ ఓటీటీలో లైవ్‌గా చూడొచ్చంటే?

CCL 2025 Telugu Warriors Schedule And Live Streaming OTT Platform: మన అభిమానల హీరోలు సినిమాల్లో ఫైట్స్, సాంగ్స్, డైలాగ్స్ కొడితే థియేటర్లలో విజిల్స్ వేస్తూ, క్లాప్స్ కొడుతూ విపరీతంగా ఎంజాయ్ చేస్తుంటాం. అదే మన స్టార్ హీరోలు బ్యాట్ పట్టుకుని గ్రౌండ్‌లో సిక్సర్ల మోత మోగిస్తే.. ఫోర్లతో బౌండరీలు దాటిస్తే.. బౌలింగ్‌తో వికెట్లు పడగొడితే.. అంతకుమించిన ఆనందం కలుగుతుంది.

yearly horoscope entry point

సీసీఎల్ 2025 తెలుగు వారియర్స్ జెర్సీ లాంచ్

హీరోలు బ్యాట్ పట్టుకునే చెలరేగే టోర్నమెంట్‌కు సమయం ఆసన్నమైంది. ఈ సంవత్సరం కూడా సెలబ్రిటీ క్రికెట్ లీగ్ అలరించనుంది. దీనికి సంబంధించి సీసీఎల్ 2025 తెలుగు వారియర్స్ జెర్సీ లాంచ్ ఈవెంట్ ఆదివారం (ఫిబ్రవరి 2) జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగు వారియర్స్ కెప్టెన్ అఖిల్ అక్కినేని, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్, హీరో సచిన్ జోషి, అశ్విన్ బాబు, ఆది సాయికుమార్, సామ్రాట్, విశ్వ, ఖయ్యూమ్ తదితరులు హాజరు అయ్యారు.

వివిధ చిత్ర పరిశ్రమల నుంచి

ఇక సీసీఎల్ 11వ సీజన్ ఫిబ్రవరి 8న బెంగళూరులో ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 8 నుంచి 23 వరకు సీసీఎల్ 2025 మ్యాచ్‌లు జరగనున్నట్లు సమాచారం. ఈ టోర్నమెంట్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలకు చెందిన టీమ్స్ పోటి పడనున్నాయి. ఈ టీమ్స్ తరఫున వివిధ చిత్ర పరిశ్రమలకు చెందిన హీరోలు, నటులు క్రికెట్ ఆడనున్నారు.

ఇక సీసీఎల్ 2025 సీజన్‌లో తెలుగు వారియర్స్ అడే మ్యాచ్‌లు షెడ్యుల్ చూస్తే..

ఫిబ్రవరి 8, బెంగళూరు: తెలుగు వారియర్స్ వర్సెస్ కర్ణాటక బుల్డోజర్స్

ఫిబ్రవరి 14, హైదరాబాద్ (రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, ఉప్పల్): తెలుగు వారియర్స్ వర్సెస్ భోజ్‌పురి దబ్బాంగ్స్

ఫిబ్రవరి 15, హైదరాబాద్ (రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, ఉప్పల్): తెలుగు వారియర్స్ వర్సెస్ చెన్నై రైనోస్

ఫిబ్రవరి 23, సూరత్: తెలుగు వారియర్స్ వర్సెస్ బెంగాల్ టైగర్స్

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ

ఈ మ్యాచ్‌లన్నింటిని సోనీ స్పోర్ట్స్ టెన్ 3 టీవీ ఛానెల్‌తోపాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో ప్రత్యక్షంగా చూసేయొచ్చు. ఇదిలా ఉంటే, సీసీఎల్ 2025 తెలుగు వారియర్స్ జెర్సీ లాంచ్ వేడుకలో అశ్విన్, రఘు తదితరులు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.

ఐదోసారి కప్ తీసుకొస్తాం

హీరో అశ్విన్ మాట్లాడుతూ.. “విష్ణు అన్న చాలా సక్సెస్‌ఫుల్‌గా సీజన్ రన్ చేస్తున్నారు. మేమంతా చాలా పాషన్‌తో ఆడుతున్నాం. ఐదోసారి కప్ తీసుకొస్తామని మా టీమ్ అందరి తరఫున చెబుతున్నాను. మీ అందరి సపోర్ట్ కావాలి” అని తెలిపాడు. రఘు మాట్లాడుతూ.. “సీసీఎల్‌ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో నిర్వహిస్తున్న విష్ణు గారికి థాంక్ యూ. నాలుగు స్టార్లు కప్పుకొట్టాం. ఈసారి మళ్లీ కప్పు కొడతాం” అని చెప్పారు.

Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024