Crime news : స్కూల్​ వాష్​రూమ్​లో దారుణం! 8ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేశారా?

Best Web Hosting Provider In India 2024


Crime news : స్కూల్​ వాష్​రూమ్​లో దారుణం! 8ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేశారా?

Sharath Chitturi HT Telugu
Feb 03, 2025 11:53 AM IST

Karnataka crime news : స్కూల్​ బాత్​రూమ్​లో తనపై ఇద్దరు అబ్బాయిలు లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ 8ఏళ్ల బ బాలిక తన తల్లికి చెప్పింది. ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేపట్టారు.

8ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేశారా?
8ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేశారా? (Hindustan Times/representative)

కర్ణాటకలో షాకింగ్​ ఘటన వెలుగులోకి వచ్చింది! స్కూల్​ వాష్​రూమ్​లో తన 8ఏళ్ల కూతురిపై లైంగిక దాడి జరిగిందని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

yearly horoscope entry point

అసలేం జరిగింది..?

కర్ణాటక మాండ్యా జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో జనవరి 31న ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. స్కూల్​ వాష్​రూమ్​లో 8ఏళ్ల బాలికపై ఇద్దరు అబ్బాయిలు లైంగిక దాడికి పాల్పడినట్టు సమాచారం. తొలుత ఈ విషయాన్ని బాలిక ఎవరికి చెప్పలేదు. ఎవరికైనా చెబితే చంపేస్తామని వారు బెదిరించడంతో మౌనంగా ఉండిపోయింది. కానీ ఆదివారం, ఈ విషయాన్ని ఆమె తన తల్లికి చెప్పింది. ఆ మహిళ వెంటనే పోలీసులను ఆశ్రయించింది.

ఈ విషయంపై పోలీసులు మీడియాకు కొన్ని వివరాలను వెల్లడించారు.

“బాలికపై లైంగిక దాడి జరిగిందని ఆమె తల్లి చెబుతోంది. రెండొవ తరగతి చదువుకుంటున్న బాలికను ఇద్దరు అబ్బాయిలు బాత్​రూమ్​లోకి తీసుకెళ్లి, బట్టలు తీసేయాలని బెదిరిచినట్టు ఆ మహిళ పేర్కొంది. అనంతరం వారు ఆమెను, ఆమె ప్రైవేటు భాగాలను కొట్టారని ఆ మహిళ వెల్లడించింది,” అని పోలీసులు తెలిపారు.

ఆ ఇద్దరు అబ్బాయిల్లో ఒకరు బాలిక క్లాస్​మేట్​. మరొ వ్యక్తి వేరే క్లాస్​లో చదువుకుంటున్నాడు.

పోలీసులు బాలిక స్టేట్​మెంట్​ కూడా తీసుకున్నారు. అనంతరం నిందితులపై పోక్సో చట్టం కింద కేసు వేసి దర్యాప్తు చేపట్టారు. నిజానిజాలను ధ్రువీకరించేందుకు దర్యాప్తు జరుగుతోందని మాండ్యా ఎస్​పీ మల్లిఖార్జున్​ బలదండి తెలిపారు.

దర్యాప్తులో భాగంగా పోలీసులు స్కూల్​ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్​లను పరిశీలిస్తున్నారు.

అయితే, బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించామని, కానీ ఆమె ప్రైవేటు భాగాలపై గాయాలేవీ కనిపించలేదని రిపోర్టు చెబుతోందని పోలీసులు అన్నారు. నిందితులుగా ఉన్న అబ్బాయిల స్టేట్​మెంట్​ కూడా తీసుకుంటామని, ఆ తర్వాత తగిన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.

“ప్రస్తుతానికి బాలిక స్టేట్​మెంట్​ ఆధారంగా కేసులో దర్యాప్తు చేస్తున్నాము. ఆమె చెప్పే మాటల్లో కాస్త గందరగోళం ఉంది,” అని పోలీసులు వెల్లడించారు.

మరోవైపు ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర స్పందించారు. కాంగ్రెస్​ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

“రాష్ట్రంలో మైనర్లపై రేప్​, మహిళలపై లైంగిక దాడులు, దోపిడీ ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగ్గాలేవు,” అని బీవై విజయేంద్ర ట్వీట్​ చేశారు. తాజా ఘటనపై దర్యాప్తు చేపట్టి దోషులుగా తేలిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్​ చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link