Best Web Hosting Provider In India 2024
Collections: సీనియర్ హీరోల్లో వెంకటేశ్ ఒక్కరికే ఈ ఘనత.. భారీ మైల్‍స్టోన్ దాటేసిన సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్లు
Sankranthiki Vasthunam Collections: సంక్రాంతికి వస్తున్నాం చిత్రం తాజాగా ఓ భారీ మైల్‍స్టోన్ దాటేసింది. సీనియర్ హీరోల్లో వెంకటేశ్ ఓ రికార్డు నెలకొల్పారు. ఈ మూవీ ఇంకా జోరుగా వసూళ్లను రాబడుతోంది.
విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బాక్సాఫీస్‍ను షేక్ చేసేసింది. మోస్తరు అంచనాలతో వచ్చిన ఈ మూవీ ఊహలకు మించి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం మొదటి నుంచి కళ్లు చెదిరే వసూళ్లతో ఆశ్చర్యపరుస్తోంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న రిలీజైన ఈ మూవీ బంపర్ బ్లాక్‍బస్టర్ సాధించింది. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా భారీ మైల్‍స్టోన్ దాటింది. దీంతో వెంకటేశ్ ఓ రికార్డు సృష్టించారు.
రూ.300కోట్ల క్లబ్‍లోకి..
సంక్రాంతికి వస్తున్నాం చిత్రం రూ.300కోట్ల క్లబ్‍లోకి అడుగుపెట్టేసింది. ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.303కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించిందని మూవీ టీమ్ వెల్లడించింది. నేడు (ఫిబ్రవరి 3) ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. రీజనల్ చిత్రాల్లో ఆల్‍టైమ్ ఇండస్ట్రీ హిట్ అని పేర్కొంది.
20 రోజుల్లోగానే రూ.303 కోట్ల సాధించి అదరగొట్టేసింది సంక్రాంతికి వస్తున్నాం చిత్రం. ఈ మూవీ రూ.50కోట్లలోపు బడ్జెట్‍తోనే రూపొందిందని అంచనా. ఈ సినిమా అందరి అంచనాలను తలకిందులు చూస్తూ భారీ వసూళ్లను కొల్లగొట్టేసింది.
సీనియర్ హీరోల్లో వెంకటేశ్ పస్ట్ టైమ్
టాలీవుడ్‍లో ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, నట సింహం బాలకృష్ణ, కింగ్ నాగార్జున, వెంకటేశ్.. సీనియర్ హీరోలుగా ఉన్నారు. వీరిలో వెంకటేశ్ రికార్డు సృష్టించారు. సీనియర్ హీరోల్లో తొలిసారి రూ.300కోట్ల కలెక్షన్ల మార్క్ దాటిన ఘనత దక్కించుకున్నారు. రీజనల్ చిత్రాల్లో ఆల్‍టైమ్ హిట్ కొట్టి సత్తాచాటారు.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా డిస్ట్రిబ్యూటర్ల ప్రెస్‍మీట్ కూడా ఇటీవలే జరిగింది. ఈ చిత్రంతో భారీ లాభాలను గడించామని చెప్పారు. ఈ సినిమా నిర్మాతలు దిల్‍రాజు, శిరీష్‍కు కూడా ఈ మీట్‍లో పాల్గొన్నారు. చాలా కాలం తర్వాత ఈ రేంజ్ ప్రాఫిట్స్ వచ్చాయని కొందరు డిస్ట్రిబ్యూటర్లు వెల్లడించారు. చాలా ఏరియాల్లో సుమారు మూడు రెట్ల పాటు ఈ చిత్రానికి లాభాలు వచ్చాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ఉంది. ఆ స్థాయిలో ఈ చిత్రం బ్లాక్‍బస్టర్ కొట్టింది.
సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో వెంకటేశ్ సరసన ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. భార్య, మాజీ ప్రేయసి మధ్య సతమతం అయ్యే పాత్రలో అదరగొట్టారు వెంకీ. కామెడీ టైమింగ్‍తో మరోసారి మెప్పించారు. ఈ చిత్రాన్ని పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అనిల్ రావిపూడి తెరకెక్కించారు. సంక్రాంతికి సరిగ్గా సూటయ్యే కంటెంట్‍తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ మూవీకి సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నట్టు అనిల్ తెలిపారు.
సంక్రాంతికి వస్తున్నాం మూవీకి పాటలు చాలా ప్లస్ అయ్యాయి. ఈ చిత్రంలోని గోదారిగట్టు సాంగ్ చాలా పాపులర్ అయింది. మిగిలిన పాటలు కూడా ఆకట్టుకున్నాయి. మూవీ సక్సెస్‍లో సాంగ్స్ ఓ కీలకపాత్ర పోషించాయి. ఈ చిత్రానికి భీమ్స్ సెసిరోలియో మ్యూజిక్ అందించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజు, శిరీష్ ప్రొడ్యూజ్ చేశారు. ఈ మూవీ సక్సెస్ ఈవెంట్ కూడా భారీస్థాయిలో జరిగింది.
సంబంధిత కథనం