Best Web Hosting Provider In India 2024
Grammy Awards 2025 Winners: గ్రామీ అవార్డ్స్ 2025 విజేతలు వీళ్లే- భారత సంతతి సింగర్‌కు పురస్కారం- పూర్తి జాబితా ఇదే!
67th Annual Grammy Awards 2025 Winners List: సంగీత ప్రపంచంలో విశేషమైన కృషి చేసినవారికి ఇచ్చే అరుదైన పురస్కారం గ్రామీ అవార్డ్స్. తాజాగా 67వ గ్రామీ అవార్డ్స్ 2025 వేడుక లాస్ ఏంజిల్స్‌లో వైభవంగా జరిగింది. ఇందులో భారత సంతతికి చెందిన అమెరికన్ సింగర్‌కు పురస్కారం లభించగా విజేతల పూర్తి జాబితాను చూద్దాం.
67th Annual Grammy Awards 2025 Winners List: సంగీత ప్రపంచంలో పాటల రచయితలు, గాయనీగాయకులు, మ్యూజిక్ ఆల్బమ్స్, అవి నిర్మించే దర్శకనిర్మాతలు వంటి విశేషమైన కృషి చేసిన వారికి గ్రామీ అవార్డులను అందజేస్తారు. తాజాగా 2025కి సంవత్సరానికి గానూ 67వ వార్షిక గ్రామీ అవార్డ్స్ వేడుక అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో అట్టహాసంగా జరిగింది.
ఇండో-అమెరికన్ సింగర్
ఈ వేడుకల్లో భారత సంతతికి చెందిన అమెరికన్ సింగర్, వ్యాపారవేత్త చంద్రికా టాండన్ (ఇండో-అమెరికన్) అవార్డ్ అందుకున్నారు. చంద్రికా రూపొందించిన ‘త్రివేణి’ ఆల్బమ్ బెస్ట్ న్యూ ఏజ్ యాంబియంట్ ఆర్ చాంట్ ఆల్బమ్‌గా పురస్కారం వరించింది. చంద్రికా టాండన్‌కు ఇది రెండో గ్రామీ అవార్డ్ కావడం విశేషం. ఇక గ్రామీ అవార్డ్స్ 2025 విజేతల పూర్తి జాబితాను లైవ్‌లో అప్డేట్ చేసినట్లు హెచ్‌టీ ఇంగ్లీష్ వెబ్‌సైట్ పేర్కొంది.
గ్రామీ అవార్డ్స్ 2025 విజేతలు ఎవరో ఇక్కడ చూద్దాం:
ఉత్తమ ర్యాప్ ఆల్బమ్: అలిగేటర్ బైట్స్ నెవర్ హీల్ (డోచి)
ఉత్తమ పాప్ వోకల్ ఆల్బమ్: సబ్రినా కార్పెంటర్, షార్ట్ అండ్ స్వీట్
బెస్ట్ కంట్రీ ఆల్బమ్: కౌబాయ్ కార్టర్, బియోన్స్
బెస్ట్ న్యూ ఆర్టిస్ట్: చాపెల్ రోన్
బెస్ట్ లాటిన్ పాప్ ఆల్బమ్: ‘లాస్ ముజెరెస్ యా నో లోరన్’ (షకీరా)
బెస్ట్ పాప్ డ్యూయో/ గ్రూప్ పెర్ఫార్మెన్స్: బ్రూనో మార్స్ అండ్ లేడీ గాగా (డై విత్ ఏ స్మైల్)
రికార్డ్ ఆఫ్ ది ఇయర్: నాట్ లైక్ అస్, కెండ్రిక్ లామర్
సాంగ్ ఆఫ్ ది ఇయర్: కెండ్రిక్ లామర్ రాసిన నాట్ లైక్ అస్
ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్: కౌబాయ్ కార్టర్, బియోన్స్
బెస్ట్ పాప్ సోలో పెర్ఫార్మెన్స్: ఎస్ప్రెస్సో (సబ్రినా కార్పెంటర్)
బెస్ట్ డాన్స్/ఎలక్ట్రానిక్ రికార్డింగ్: జస్టిస్ అండ్ టామ్ ఇంపాలా (నెవరెండర్)
బెస్ట్ పాప్ డాన్స్ రికార్డింగ్: వాన్ డచ్ (చార్లీ ఎక్స్‌సీఎక్స్)
బెస్ట్ ర్యాప్ సాంగ్: నాట్ లైక్ అస్ (పాటల రచయిత కెండ్రిక్ లామర్)
బెస్ట్ ర్యాప్ పెర్ఫార్మెన్స్: నాట్ లైక్ అస్ (కెండ్రిక్ లామర్)
బెస్ట్ మెలోడిక్ ర్యాప్ పెర్ఫార్మెన్స్: “3” (ఎరికా బాదు)
బెస్ట్ ఆర్ అండ్ బీ పెర్ఫార్మెన్స్: మేడ్ ఫర్ మీ (లైవ్ ఆన్ బెట్)- ముని లాంగ్
బెస్ట్ ఆర్ అండ్ బీ ఆల్బమ్: 11:11 (డీలక్స్)- క్రిస్ బ్రౌన్
బెస్ట్ ట్రెడిషనల్ ఆర్ అండ్ బీ పెర్ఫార్మెన్స్: దట్స్ యూ-లక్కీ డాయే
బెస్ట్ ఆర్ అండ్ బి సాంగ్: సాటర్న్ (రాబ్ బిసెల్, కార్టర్ లాంగ్, సోలనా రోవ్, జారెడ్ సోలమన్ మరియు స్కాట్ జాంగ్, పాటల రచయితలు (ఎస్‌జడ్ఏ))
ఉత్తమ ప్రోగ్రెసివ్ ఆర్ అండ్ బి ఆల్బమ్: “వై లాడ్?”, ఎన్ఎక్స్వోరీస్ (అండర్సన్. పాక్ అండ్ నాలెడ్జ్)
ఉత్తమ నృత్య ఎలక్ట్రానిక్ ఆల్బమ్: “బ్రాట్” (చార్లీ ఎక్స్‌సీఎక్స్)
బెస్ట్ రాక్ పెర్ఫార్మెన్స్: “నౌ అండ్ దెన్” (ది బీటిల్స్)
బెస్ట్ రాక్ ఆల్బమ్: “హాక్నీ డైమండ్స్” (రోలింగ్ స్టోన్స్)
బెస్ట్ రీమక్స్‌డ్ రికార్డింగ్: “ఎస్ప్రెస్సో (ఎఫ్‌ఎన్ జెడ్ అండ్ మార్క్ రాన్సన్)-రీమిక్స్ (సబ్రినా కార్పెంటర్)
బెస్ట్ అమెరికన్ పెర్ఫార్మెన్స్: “అమెరికన్ డ్రీమింగ్”, సియెర్రా ఫెర్రెల్
బెస్ట్ అమెరికన్ రూట్ సాంగ్ సాంగ్: “అమెరికన్ డ్రీమింగ్,”, సియెర్రా ఫెర్రెల్ అండ్ మెలోడీ వాకర్, పాటల రచయితలు
ఉత్తమ అమెరికానా ఆల్బమ్: “ట్రయల్ ఆఫ్ ఫ్లవర్స్”, సియెర్రా ఫెర్రెల్
ఉత్తమ బ్లూగ్రాస్ ఆల్బమ్: “లైవ్ వాల్యూమ్ 1.”, బిల్లీ స్ట్రింగ్స్
ఉత్తమ జానపద ఆల్బమ్: “వుడ్ ల్యాండ్”, గిలియన్ వెల్చ్ అండ్ డేవిడ్ రాలింగ్స్
ఉత్తమ ప్రాంతీయ రూట్స్ మ్యూజిక్ ఆల్బమ్: “కుయిని”, కలానీ పె’ఎ
ఉత్తమ గాస్పెల్ పెర్ఫార్మెన్స్/సాంగ్: “వన్ హాలెలూజా,”, తాషా కాబ్స్ లియోనార్డ్, ఎరికా క్యాంప్ బెల్ అండ్ ఇజ్రాయిల్ హౌటన్
ఉత్తమ కాంటెంపరరీ క్రిస్టియన్ సంగీత ప్రదర్శన/పాట: “దట్స్ మై కింగ్”, సిఈ వినాన్స్, టేలర్ అగన్, కెల్లీ గాంబుల్, లాయిడ్ నిక్స్ అండ్ జెస్ రస్, పాటల రచయితలు
ఉత్తమ గాస్పెల్ ఆల్బమ్: “మోర్ దాన్ దిస్”, సెసె వినాన్స్
ఉత్తమ సమకాలీన క్రిస్టియన్ మ్యూజిక్ ఆర్టిస్ట్: “హార్ట్ ఆఫ్ ఎ హ్యూమన్”, డిఓఈ
బెస్ట్ రూట్స్ గాస్పెల్ ఆల్బమ్: “చర్చ్”, కోరి హెన్రీ
బెస్ట్ కంట్రీ సోలో పెర్ఫార్మెన్స్: “ఇట్ టేక్ ఎ ఉమెన్”, క్రిస్ స్టేపుల్టన్
బెస్ట్ కంట్రీ డ్యూయో/గ్రూప్ పెర్ఫార్మెన్స్: మిలీ సైరస్
బెస్ట్ కంట్రీ సాంగ్: “ది ఆర్కిటెక్ట్”, షేన్ మెక్ అనాలి, కేసీ మస్గ్రేవ్స్ మరియు జోష్ ఓస్బోర్న్, పాటల రచయితలు (కేసీ మస్గ్రేవ్స్)
బెస్ట్ మ్యూజిక్ వీడియో: “అమెరికన్ సింఫనీ”
బెస్ట్ అమెరికన్ రూట్స్ పెర్ఫార్మెన్స్: “లైట్ హౌస్”, సియెర్రా ఫెర్రెల్
బెస్ట్ ట్రెడిషనల్ బ్లూస్ ఆల్బమ్: “స్వింగిన్” లైవ్ ఎట్ ది చర్చ్ ఇన్ తుల్సా”, ది తాజ్ మహల్ సెక్స్టెట్
బెస్ట్ కాంటెంపరరీ బ్లూస్ ఆల్బమ్: “మైలేజ్”, రుతీ ఫాస్టర్
బెస్ట్ మ్యూసికా ఆల్బమ్: “లాస్ లెట్రాస్ యా నో ఇంపోర్టెన్”, రెసిడెన్
బెస్ట్ లాటిన్ రాక్ లేదా ఆల్టర్నేటివ్ ఆల్బమ్: “క్వియెన్ ట్రే లాస్ కార్నెటాస్?, రవయానా
బెస్ట్ ముసికా మెక్సికా ఆల్బమ్ (తేజానోతో సహా): “బోకా చుకా, సంపుటి 1,” కారిన్ లియోన్
ఉత్తమ ట్రాపికల్ లాటిన్ ఆల్బమ్: “అల్మా, కొరాజోన్ వై సల్సా (లైవ్ ఎట్ గ్రాన్ టీట్రో నాసియోనల్)”, టోనీ సక్కార్, మిమీ సక్కార్
బెస్ట్ రెగ్గే ఆల్బమ్: “మార్లీ: వన్ లవ్ – మ్యూజిక్ ఇన్స్పైర్డ్ ది ఫిల్మ్ (డెలక్స్)”
ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్: “బెంబా కలరా”, షీలా ఇ. గ్లోరియా ఎస్టెఫాన్ అండ్ మిమీ సుక్కార్
ఉత్తమ ఆఫ్రికన్ మస్సిక్ పెర్ఫార్మెన్స్: “లవ్ మీ జెజె”, టెమ్స్
ఉత్తమ జాజ్ వోకల్ ఆల్బమ్: “ఎ హ్యాపీ హాలిడే”, సమరా జాయ్
పాటల రచయిత ఆఫ్ ది ఇయర్, నాన్ క్లాసికల్: అమీ అలెన్
ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఇయర్, నాన్ క్లాసికల్: డేనియల్ నిగ్రో
ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఇయర్, క్లాసికల్: ఎలైన్ మార్టోన్
బెస్ట్ స్కోర్ సౌండ్ ట్రాక్ ఫర్ విజువల్ మీడియా: హాన్స్ జిమ్మర్, “డ్యూన్: పార్ట్ 2”
బెస్ట్ కామెడీ ఆల్బమ్: “డ్రీమర్,” డేవ్ చాపెల్
67వ వార్షిక గ్రామీ అవార్డ్స్ 2025
వీరందరికి ఆయా విభాగాలలో 67వ వార్షిక గ్రామీ అవార్డ్స్ 2025 అవార్డులు వరించాయి. వీరిలో ఇండో అమెరికన్ సింగర్ చంద్రికా టాండన్‌కు పురస్కారం రావడంపై భారతీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత కథనం