House Maid: మీ ఇంట్లో పని మనిషికి ఈ ఐదు విషయాలు తెలియనివ్వకండి! తెలిస్తే ఎప్పటికైనా ప్రమాదమే!

Best Web Hosting Provider In India 2024

House Maid: మీ ఇంట్లో పని మనిషికి ఈ ఐదు విషయాలు తెలియనివ్వకండి! తెలిస్తే ఎప్పటికైనా ప్రమాదమే!

Ramya Sri Marka HT Telugu
Feb 03, 2025 02:00 PM IST

House Maid: ఈ రోజుల్లో ఇంట్లో అందరూ చదువులకూ ఉద్యోగాలకూ వెళ్లే వాళ్లే. కనుకు ప్రతి ఇంట్లో పని మనిషి అవసరం తప్పక ఉంటుంది. అయితే మీ ఇంట్లో పని వాళ్లు ఎంత మంచి వారైనా, వారిలో మీకెంత చనువున్నా కొన్ని విషయాలను గోప్యంగా ఉంచక తప్పదు. ముఖ్యంగా ఐదు విషయాలను వారికి తెలిసాయంటే ఎప్పటికైనా మీకు ప్రమాదమే!

మీ ఇంట్లో పని మనిషికి ఈ ఐదు విషయాలు ఎప్పటికీ తెలియనివ్వకండి!
మీ ఇంట్లో పని మనిషికి ఈ ఐదు విషయాలు ఎప్పటికీ తెలియనివ్వకండి! (Shutterstock)

మారిన పరిస్థితుల ప్రభావం మన చూట్టూ కనిపిస్తోంది. ఒకప్పుడు పనిమనిషులను పెట్టుకోవడం కేవలం కొంతమందికి మాత్రమే కానీ ఇప్పడు అది సాధారణమైపోయింది. ముఖ్యంగా ఇంట్లో భార్య, భర్త ఇద్దరూ ఉద్యోగాలకు వెళ్లేవారే అయితే పనిమినిషి తప్పనిసరి అయిపోయింది. అయితే కొందరి ఇళ్లల్లో పనివారు కూడా పనిచేస్తూ పనిచేస్తూ ఇంటి మనుషుల్లో భాగమవుతారు. యజమానులు కూడా వారితో స్నేహితుల్లా కలిసిపోయి ఉంటుంటారు. వాస్తవానికి ఇది మంచి పద్ధతే, వారు కూడా మనుషులే కనుక వారితో అలా ఉండటంలో తప్పేం లేదు. కానీ కొన్నిసార్లు ఇది ప్రమాదకరం కావచ్చు.

yearly horoscope entry point

పని మనుషులతో మీరు మంచిగానే ఉండచ్చు కానీ వారిలో ఏదైనా చెడు ఉద్దేశం లేదా లోభం ఉంటే పరిస్థితి ఏంటి? అలాంటి సందర్భాల్లో మీరు ప్రమాదంలో పడచ్చు. మీ కొంపముంచే పని జరగచ్చు. కనుక మీ ఇంట్లో పనివారు ఎంత మంచి వారైనా, వారికి మీకు ఎంత చనువున్నా వారి ముందు కొన్ని విషయాలను గోప్యంగా ఉంచాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీ పనివాళ్లతో మీరు పంచుకోకూడని కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.

ఎప్పుడూ ఖజానా గురించి మాట్లాడకండి:

మన అందరి ఇళ్లలో చిన్నదో పెద్దతో ఒక లాకర్ లేదా ఖజానా ఉంటుంది. అక్కడ మనం డబ్బులు, ఆభరణాలను వంటివి ఉంచుతాము. ఈ రహస్య ఖజానా గురించి మీ హౌస్ హెల్ప్ ముందు ఎప్పుడూ మాట్లాడకండి. మీరు ఖజానా నుండి ఏదైనా తీసుకోవాలనుకుంటే, వారి ముందు పొరపాటున కూడా తీయకండి. ఎవరూ చుట్టూ లేనప్పుడే వాటిని తీసుకోండి. ఇంట్లో లాకర్ ఉందని ఎవరికీ తెలియనివ్వకండి.

పిల్లల గురించిన సమాచారాన్ని ఎక్కువగా పంచుకోకండి:

దురుద్దేశం లేదా లోభం ఉన్న పనివాళ్లకు మీ పిల్లలు చాలా సులభమైన లక్ష్యం. మీ పిల్లలను టార్గెట్ చేసి వారి ద్వారా డబ్బు సంపాదిస్తామని చూస్తారు. కాబట్టి మీరు మీ పిల్లల గురించిన ఎక్కువ సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోకూడదు. మీ ఇంట్లో హౌస్ హెల్ప్ ఉంటే, వారి ముందు పిల్లల గురించి ఎక్కువ విషయాలు చెప్పడం మానుకోండి. పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు, ఎక్కడ ఉన్నారు, ఏ కోచింగ్‌లో చదువుతున్నారు, ఏ సమయంలో ఉంటారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఇష్టంగా ఏం తింటారు వంటి వివరాలను కచ్చితంగా వారి ముందు ఎప్పుడూ చెప్పకండి.

ప్రయాణ ప్రణాలికలను కచ్చితంగా చెప్పకండి:

ఇంట్లోని పనివాళ్లతో మీ ప్రయాణ ప్రణాళికలను పంచుకునేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎప్పుడు ఇంట్లో ఉండరు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎప్పుడు వస్తారు, పిల్లలు మీతో వస్తున్నారా లేదా; ఇలాంటి ఏ వివరాలనూ వారితో ఎక్కువగా అలాగే స్పష్టంగా పంచుకోవద్దు. మీరు వారికి కేవలం సమాచారం మాత్రమే ఇవ్వాలి. కానీ చాలా వివరాలను పొరపాటున కూాడా చెప్పకండి. ఎప్పుడైనా రావచ్చు అన్నట్లుగా చెప్పాలి. లేదంటే మీ ఇంటిభద్రతకో లేక మీ భద్రతకో ముప్పు రావచ్చు.

పరికరాల విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలి:

ఇది డిజిటల్ యుగం మీ చిన్న నిర్లక్ష్యం కూడా మీ ఆర్థిక భద్రతకు పెద్ద ముప్పును కలిగించవచ్చు. చిన్న వివరాలు లీక్ అయినా, మీ ఖజానా ఖాళీ అయిపోతుంది. అందువల్ల, మీ ఫోన్, ల్యాప్‌టాప్, కంప్యూటర్, ఇంటర్నెట్ లేదా వైఫై వంటి పరికరాల వివరాలను హౌస్ హెల్ప్ ముందు పంచుకోవడం మానుకోండి. మీ పరికరాలకు ఎల్లప్పుడూ పాస్‌వర్డ్ ఉంచండి. వాటిని పనివారితో ఎప్పుడూ పంచుకోవద్దు. మీ పిన్, పాస్‌వర్డ్ వంటి విషయాల గురించి ఇంట్లో అలవోకగా మాట్లాడకండి.

మీ ఖర్చులను పంచుకోవద్దు

మీ ఖర్చుల గురించి సమాచారాన్ని పంచుకోవడం మీకు సాధారణంగా అనిపించవచ్చు, కానీ మీరు అలా చేయడం మానుకోవాలి. ముఖ్యంగా మీ ఖరీదైన షాపింగ్ వివరాలను హౌస్ హెల్ప్ ముందు ఉంచకండి. ఏమి కొన్నారు, ఏమి కొనబోతున్నారు లేదా అది ఎంత ఖరీదైనదో; ఇలాంటి విషయాలను ఎప్పుడూ వివరంగా పంచుకోవద్దు. ముఖ్యంగా మీరు ఖరీదైన ఆభరణాలను కొనబోతున్నట్లయితే, దాని గురించి ఇంట్లోవారితో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి.

Whats_app_banner
Source / Credits

Best Web Hosting Provider In India 2024