Thandel IMDb: ఇండియాలోనే నంబర్ వన్.. ఈ విషయంలో తిరుగులేని నాగ చైతన్య, సాయి పల్లవి తండేల్ మూవీ

Best Web Hosting Provider In India 2024

Thandel IMDb: ఇండియాలోనే నంబర్ వన్.. ఈ విషయంలో తిరుగులేని నాగ చైతన్య, సాయి పల్లవి తండేల్ మూవీ

Hari Prasad S HT Telugu
Feb 03, 2025 03:03 PM IST

Thandel IMDb: తండేల్ మూవీ మరో అదురైన ఘనతను సొంతం చేసుకుంది. ఐఎండీబీలో ఓ విషయంలో ఇండియాలోనే నంబర్ వన్ సినిమాగా నిలవడం విశేషం. నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన ఈ సినిమా వచ్చే శుక్రవారం (ఫిబ్రవరి 7) థియేటర్లలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.

ఇండియాలోనే నంబర్ వన్.. ఈ విషయంలో తిరుగులేని నాగ చైతన్య, సాయి పల్లవి తండేల్ మూవీ
ఇండియాలోనే నంబర్ వన్.. ఈ విషయంలో తిరుగులేని నాగ చైతన్య, సాయి పల్లవి తండేల్ మూవీ

Thandel IMDb: నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న మూవీ తండేల్ కోసం దేశమంతా ఎదురు చూస్తోంది. ఈ పాన్ ఇండియా మూవీ శుక్రవారం (ఫిబ్రవరి 7) రిలీజ్ కానుండగా.. ఐఎండీబీ ఇండియా ఎక్కువ మంది ఎదురు చూస్తున్న సినిమాలు, షోలలో నంబర్ వన్ స్థానంలో ఉన్నట్లు మూవీ టీమ్ సోమవారం (ఫిబ్రవరి 3) వెల్లడించింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై నాగ చైతన్య కూడా భారీ ఆశలే పెట్టుకున్నాడు.

yearly horoscope entry point

తండేల్ నంబర్ వన్ మూవీ

ప్రపంచవ్యాప్తంగా సినిమా లవర్స్ పల్స్ పట్టుకునే సంస్థ ఐఎండీబీ (ఇంటర్నెట్ మూవీ డేటాబేస్). వివిధ అంశాలపై పోల్స్ నిర్వహిస్తూ ఉంటుంది. తాజాగా ఇండియాలో ఎక్కువ మంది ఎదురు చూస్తున్న సినిమాల జాబితాను రిలీజ్ చేయగా.. అందులో తండేల్ తొలి స్థానంలో ఉన్నట్లు మూవీ టీమ్ ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా వెల్లడించింది.

“ఓ అతిపెద్ద అల తీరాన్ని తాకడాన్ని చూసేందుకు ప్రేక్షకులు వేచి చూస్తున్నారు. ఐఎండీబీలో ఎక్కువ మంది ఎదురు చూస్తున్న సినిమాలు, షోల జాబితాలో తండేల్ తొలి స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 7న రిలీజ్ కాబోతోంది” అనే క్యాప్షన్ తో ఈ తండేల్ మూవీ టీమ్ ట్వీట్ చేసింది. తండేల్ మూవీపై అత్యధికంగా 23.7 శాతం మంది ప్రేక్షకులు ఆసక్తి చూపించారు.

తండేల్ మూవీ గురించి..

తండేల్ మూవీని చందూ మొండేటి డైరెక్ట్ చేశాడు. చాలా కాలంగా ఓ మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న నాగ చైతన్య.. ఈ పాన్ ఇండియా సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. సాయి పల్లవి జంటగా నటిస్తుండటంతో ఈ కపుల్ మరోసారి సిల్వర్ స్క్రీన్ పై మాయ చేస్తుందన్న నమ్మకంతో ప్రేక్షకులు ఉన్నారు. నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

శ్రీకాకుళానికి చెందిన కొందరు జాలర్లు.. గుజరాత్ తీరానికి వెళ్లి అనుకోకుండా పాకిస్థాన్ నేవీకి చిక్కడం అనే కథాంశంతో తండేల్ ను చిత్రీకరించారు. దేశభక్తికి లవ్ స్టోరీని కూడా జోడించి తీసిన మూవీ ఇది. గతంలో కార్తికేయ, కార్తికేయ2, ప్రేమమ్ లాంటి సినిమాలు తీసిన చందూ మొండేటి డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. మరి శుక్రవారం (ఫిబ్రవరి 7) రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎంత వరకు ప్రేక్షకుల ఆదరణ సంపాదిస్తుందో చూడాలి.

Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024