Best Web Hosting Provider In India 2024
Telangana By Elections : ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉందాం.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Telangana By Elections : కేటీఆర్ మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యల నేపథ్యంలో కేటీఆర్ ఈ కామెంట్స్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
సుప్రీంకోర్టు తాజా ఆదేశాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ఫిరాయింపుదారులను ఇకపై రక్షించడం అసాధ్యమని వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉందాం.. అని బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
సిద్ధంగా ఉందాం..
‘రాజ్యాంగం నిర్దేశించిన చట్టం, సుప్రీంకోర్టు ముందస్తు తీర్పులు స్పష్టంగా ఉన్నందున.. కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుదారులను ఇకపై రక్షించడం అసాధ్యం. నా తోటి బీఆర్ఎస్ పార్టీ సైనికులారా.. త్వరలో ఉప ఎన్నికలలో పోరాడటానికి మనం సిద్ధంగా ఉందాం’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. కేటీఆర్ చేసిన ఈ కామెంట్స్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎమ్మెల్యేలకు నోటీసులు..
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ.. బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పార్టీ మారిన పలువురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది.
కేటీఆర్ పిటిషన్..
ఇదే అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రిట్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం.. విచారణను ఫిబ్రవరి 10కి వాయిదా వేసింది. గతంలో ఇదే వ్యవహారంపై దాఖలైన పటిషన్‌తో కలిపి విచారణ జరుపుతామని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్‌ల ధర్మాసనం స్పష్టం చేసింది.
ఎంత సమయం కావాలి..
పార్టీల ఫిరాయింపులకు సంబంధించి హైకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చామని.. ప్రభుత్వం తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు వివరించారు. ఈ అంశంపై తేల్చడానికి తగిన సమయం ఇవ్వాలని కోరారు. తగిన సమయం అంటే ఎంత? అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. రీజనబుల్ టైమ్ అంటే.. మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసే వరకా అంటూ అసహనం వ్యక్తం చేసింది. అసెంబ్లీ స్పీకర్‌ను అడిగి నిర్ణయాన్ని కోర్టుకు తెలియజేస్తామని న్యాయవాది చెప్పారు.
టాపిక్