వైయ‌స్ఆర్‌సీపీ కార్పొరేటర్లకు భద్రత కల్పించండి 

Best Web Hosting Provider In India 2024

ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

గుంటూరు: తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. వైయ‌స్ఆర్‌సీపీ కార్పొరేటర్లకు భద్రత కల్పించాల‌ని ఉన్న‌త న్యాయ‌స్థానం తీర్పు ఇచ్చింది. తమ పార్టీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసే ప్రయత్నం జరుగుతోందని సోమవారం ఉదయం ఎన్నిక సమయంలో వారు ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు  వైయ‌స్ఆర్‌సీపీ హైకోర్టులో పిటిషన్‌ వేసింది. కార్పొరేటర్లకు రక్షణ కల్పించాలని పిటిషన్‌లోవైయ‌స్ఆర్‌సీపీ కోరింది. పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. కార్పొరేటర్లకు రక్షణ కల్పించాలని ఎస్పీకి వినతి పత్రం ఇవ్వాలని వైయ‌స్ఆర్‌సీపీకి కోర్టు సూచించింది. కార్పొరేటర్లు బయల్దేరి వెళ్లే దగ్గర నుంచి సెనేట్ హాల్ కు చేరుకునే వరకు రక్షణ కల్పించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది.

కాగా, సోమవారం తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్‌ ఎన్నికల సందర్బంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. వైయ‌స్ఆర్‌సీపీ కార్పొరేటర్లపై టీడీపీ, జనసేన గూండాలు దాడి చేశారు. ​కార్పొరేటర్లు వెళ్తున్న బస్సుపై జనసేన, టీడీపీ కార్యకర్తల రాళ్ల రువ్వడంతో బస్సు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇదే సమయంలో సాక్షి రిపోర్టర్‌, కెమెరామెన్‌పై పచ్చ గూండాలు దాడికి దిగారు. కార్పొరేటర్లను బలవంతంగా ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో, అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

పోలీసులు అక్కడ ఉన్నప్పటికీ పచ్చ మూకలు రెచ్చిపోవడం గమనార్హం. వైయ‌స్ఆర్‌సీపీ కార్పొరేటర్లపై దాడి జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తూ నిల్చున్నారు. వారిని నిలువరించే ప్రయత్నం చేయలేదు. ఇక, బస్సుపై దాడి చేసిన వ్యక్తిని టీడీపీకి చెందిన శంకర్‌ యాదవ్‌గా గుర్తించారు. శంకర్‌ యాదవ్‌ ఓవరాక్షన్‌ చేస్తూ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న వైయ‌స్ఆర్‌సీపీ మహిళా కార్యకర్తలతో అనుచితంగా వ్యవహరించారు. వైయ‌స్ఆర్‌సీపీ కార్పొరేటర్లపై హత్యాయత్నం చేశారు. ఈ క్రమంలో నలుగురు కార్పొరేటర్లను టీడీపీ, జనసేన గూండాలు ఎత్తుకెళ్లారు.
 

Best Web Hosting Provider In India 2024