![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/akka_web_series_1738589198007_1738589207020.jpeg)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497842_358_newTwitterIcon.png)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497843_996_facebook1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497844_122_wapp1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/akka_web_series_1738589198007_1738589207020.jpeg)
Netflix Upcoming Movies Web Series: కీర్తి సురేష్ బోల్డ్ వెబ్ సిరీస్ నుంచి మాధవన్ మూవీ వరకు నెట్‌ఫ్లిక్స్ రిలీజెస్ ఇవే
Netflix Upcoming Movies Web Series: నెట్‌ఫ్లిక్స్ లో ఈ ఏడాది కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ ల జాతర ఉండనుంది. తమ ప్లాట్‌ఫామ్ లో రాబోయే సినిమాలు, వెబ్ సిరీస్ గురించి చెబుతూ సోమవారం (ఫిబ్రవరి 3) టీజర్లు రిలీజ్ చేసింది. అందులో కీర్తి సురేష్ నటించిన అక్కా వెబ్ సిరీస్ కూడా ఒకటి.
Netflix Upcoming Movies Web Series: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ ఏడాది ఎన్నో ఇంట్రెస్టింగ్ ఒరిజినల్ మూవీస్, వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. ఇందులో కీర్తి సురేష్ నటించిన బోల్డ్ వెబ్ సిరీస్ అక్కాతోపాటు మాధవన మూవీ ఆప్ జైసే కోయి, ఢిల్లీ క్రైమ్ సీజన్ 3, రానా నాయుడు సీజన్ 2లాంటి వెబ్ సిరీస్, మూవీస్ ఉన్నాయి.
![yearly horoscope entry point](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
నెట్‌ఫ్లిక్స్‌లోకి ఈ ఏడాది రాబోతున్న మూవీస్, వెబ్ సిరీస్
నెట్‌ఫ్లిక్స్ ఈ ఏడాది తమ ప్లాట్‌ఫామ్ పైకి రాబోతున్న కంటెంట్ గురించి టీజర్లతో అభిమానులను ఫిదా చేసేసింది. 2025లో ఈ ఓటీటీలోకి ఎన్నో సూపర్ హిట్ వెబ్ సిరీస్ కొత్త సీజన్లు, కొత్త వెబ్ సిరీస్ లు, సినిమాలు రానున్నాయి. మరి అవేంటో చూసేయండి.
కీర్తి సురేష్ ‘అక్కా’ వెబ్ సిరీస్
కీర్తి సురేష్ నటిస్తున్న అక్కా వెబ్ సిరీస్ త్వరలోనే రానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ఓ టీజర్ ద్వారా వెల్లడించింది. ఈ టీజర్ చాలా ఇంటెన్స్ గా ఉంది. కీర్తి సురేష్ చాలా బోల్డ్, డేరింగ్ పాత్ర పోషించినట్లు ఈ టీజర్ చూస్తే తెలుస్తోంది. అక్క అనే గ్రూపు లీడర్ గా ఆమె నటించింది.
“మాతృస్వామ్యం బలంగా నిలదొక్కుకుంది. ఓ రెబల్ వాళ్ల పతనం కోసం ప్లాన్ చేస్తోంది. అక్కలపై ప్రతీకారం కోసం పేర్నూరుకు చెందిన ఓ అమ్మాయి ఎదురు చూస్తోంది. అక్క త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ లో” అనే క్యాప్షన్ తో ఈ సిరీస్ స్ట్రీమింగ్ గురించి తెలిపింది. ఈ ఏడాదే వస్తున్నా.. స్ట్రీమింగ్ తేదీని మాత్రం వెల్లడించలేదు.
మండల మర్డర్స్ – క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్
మండల మర్డర్స్ అనే మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కూడా నెట్‌ఫ్లిక్స్ లోకి రాబోతోంది. ఈ సిరీస్ టీజర్ కూడా ఆసక్తికరంగా ఉంది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది.
కోహ్రా వెబ్ సిరీస్ సీజన్ 2
నెట్‌ఫ్లిక్స్ సూపర్ హిట్ వెబ్ సిరీస్ కోహ్రా (Kohrra) రెండో సీజన్ కూడా ఈ ఏడాది రాబోతోంది. ఈ సిరీస్ టీజర్ కూడా రిలీజ్ చేశారు. కొత్త మిస్టరీతో ఈ కొత్త సీజన్ రాబోతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. తొలి సీజన్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ రెండో సీజన్ పై భారీ అంచనాలు ఉన్నాయి.
ఆప్ జైసా కోయి – మాధవన్ మూవీ
మాధవన్ నటించిన ఆప్ జైసా కోయి అనే మూవీ కూడా నెట్‌ఫ్లిక్స్ లోకి త్వరలోనే రానుంది. ఇదొక రొమాంటిక్ కామెడీ మూవీ కావడం విశేషం. ఇందులో మాధవన్ కు జోడీగా ఫాతిమా సనా షేక్ నటించింది. ఈ మూవీ టీజర్ కూడా సోమవారం (ఫిబ్రవరి 3) నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేసింది.
నాదానియా మూవీ
సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్, ఖుషీ కపూర్ జంటగా నటిస్తున్న మూవీ నాదానియా. ఈ సినిమా కూడా నేరుగా నెట్‌ఫ్లిక్స్ లోకి రానుంది. మూవీ టీజర్ ను ఆ ఓటీటీ రిలీజ్ చేసింది. ఇది కూడా ఓ రొమాంటిక్ జానర్ మూవీ కావడం విశేషం.
ఢిల్లీ క్రైమ్ సీజన్ 3
నెట్‌ఫ్లిక్స్ లో సూపర్ హిట్ వెబ్ సిరీస్ లలో ఒకటి ఢిల్లీ క్రైమ్. ఈ సిరీస్ మూడో సీజన్ ఈ ఏడాది రానుంది. తొలి రెండు సీజన్లలో నిర్భయ కేసు, బనియన్ గ్యాంగ్ అకృత్యాల గురించి చూపించగా.. మూడో సీజన్లో మరో కొత్త కేసుతో ఈ వెబ్ సిరీస్ రానుంది. ఈసారి కథ అస్సాంలో జరగనుంది.
టోస్టర్ మూవీ
ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావ్ నటించిన మూవీ టోస్టర్ కూడా నేరుగా నెట్‌ఫ్లిక్స్ లోకి రానుంది. ఇది కూడా ఓ రొమాంటిక్ కామెడీ మూవీ.