Best Web Hosting Provider In India 2024
Virat Kohli Akhil Akkineni: విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ అఖిల్.. హీరో ఆది సాయి కుమార్ కామెంట్స్
Aadi Sai Kumar Compares Akhil Akkineni With Virat Kohli: సినీ హీరోల సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2025 ఈ నెలలో ప్రారంభం కానుండగా.. తెలుగు వారియర్స్ జెర్సీని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ అఖిల్ అక్కినేని అని హీరో ఆది సాయి కుమార్ కామెంట్స్ చేశాడు.
Aadi Sai Kumar About Akhil Akkineni Virat Kohli: సౌత్, నార్త్ హీరోలంతా కలిసి క్రికెట్ ఆడే తరుణం రానే వచ్చింది. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 11వ సీజన్ ఈ నెలలోనే ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 8 నుంచి సీసీఎల్ 2025 టోర్నమెంట్ మొదలు అవనుంది. బెంగళూరులో ఈ మ్యాచ్‌లు స్టార్ట్ అవుతాయి.
ఫిబ్రవరి 8 నుంచి మార్చి 2 వరకు
అనంతరం తేదీల వారీగా ఒక్కో ప్రాంతంలో మార్చి 2 వరకు సీసీఎల్ 2025 మ్యాచులు జరగనున్నాయి. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ టీమ్ అయిన తెలుగు వారియర్స్‌కు హీరో అక్కినేని అఖిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్, హీరో ఆది సాయి కుమార్, అశ్విన్ బాబు, సామ్రాట్, విశ్వ, సచిన్ జోషి తదితరులు ప్లేయర్స్‌గా సత్తా చాటనున్నారు.
ఐదోసారి కప్పు కొట్టేందుకు
ఇప్పటికీ నాలుగు సార్లు సీసీఎల్ ట్రోఫీని అందుకుంది తెలుగు వారియర్స్ టీమ్. ఇప్పుడు ఈ ఏడాది కప్ కొట్టి ఐదోసారి టైటిల్ గెలిచేందుకు అఖిల్ అక్కినేని టీమ్ ఉవ్విల్లూరుతుంది. అయితే, ఫిబ్రవరి 8న సీసీఎల్ 11వ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టాలీవుడ్ వారియర్స్ టీమ్ జెర్సీని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో హీరో ఆది సాయి కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
చాలా పాషన్‌తో ఆడుతున్నాం
హీరో, తెలుగు వారియర్స్ ప్లేయర్ ఆది సాయి కుమార్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. తెలుగు వారియర్స్ కెప్టెన్ అఖిల్ మాకు విరాట్ కోహ్లి లాంటి ప్లేయర్. చాలా పాషన్‌తో ఆడుతున్నాం. నాలుగు సార్లు కప్ కొట్టాం. ఈసారి మళ్లీ ఛాంపియన్ అవుతాం” అని అన్నాడు. అఖిల్ అక్కినేని విరాట్ కోహ్లీతో పోల్చడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇంటెలిజెంట్ కెప్టెన్
ఇక ఇదే ఈవెంట్‌లో పాల్గొన్న నటుడు, ఆటగాడు సామ్రాట్ మాట్లాడుతూ.. “సీజన్ వన్ నుంచి నేను ఉన్నాను. ఈ జర్నీలో అప్స్ అండ్ డౌన్స్ అన్నీ చూశాను. విష్ణు గారు చాలా పాషన్‌తో టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. అఖిల్ ఇంటెలిజెంట్ కెప్టెన్. తమన్ అన్న మై పార్ట్‌నర్. ఈ సీజన్ కప్ మాదే” అని చెప్పుకొచ్చాడు.
అదనపు ఉత్సాహాన్ని
సీసీఎల్ వ్యవస్థాపకుడు విష్ణు వర్ధన్ ఇందూరి మాట్లాడుతూ.. “సీసీఎల్ 11వ సీజన్‌కు చేరుకోవడం మాకు గర్వకారణం. ఈ టోర్నమెంట్ ప్రత్యేకమైనది. భారతదేశంలోని చలనచిత్ర పరిశ్రమల నుంచి నటీనటులను ఒకే వేదికపైకి తీసుకువస్తుంది. పాల్గొనే జట్ల నైపుణ్యం, స్ఫూర్తి , దృఢ సంకల్పాన్ని చూసి మేము సంతోషిస్తున్నాము. తెలుగు వారియర్స్ ఎల్లప్పుడూ టోర్నమెంట్‌కు అదనపు ఉత్సాహాన్ని తీసుకొస్తుంది.” అని తెలిపారు.
తెలుగు వారియర్స్ మ్యాచ్‌లు
రికా వాలీ ఛైర్మన్ షోరబ్ అర్ఫాత్ మాట్లాడుతూ.. “విష్ణు గారికి, సచిన్ గారికి థాంక్ యూ. అఖిల్ గారు గ్రేట్ ఫైటర్ ఇన్ క్రికెట్. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థాంక్ యూ” అని వెల్లడించారు. ఇక తెలుగు వారియర్స్ టీమ్ ఫిబ్రవరి 8న కర్ణాటక బుల్డోజర్స్‌తో, ఫిబ్రవరి 14న భోజ్‌పురి దబాంగ్స్ టీమ్‌తో, ఫిబ్రవరి 15న చెన్నై రైనోస్ జట్టుతో, ఫిబ్రవరి 23న బెంగాల్ టైగర్స్‌తో క్రికెట్ ఆడనుంది. మార్చి 2న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
సంబంధిత కథనం