![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/mastan_case_1738590988875_1738590996644.png)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497842_358_newTwitterIcon.png)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497843_996_facebook1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497844_122_wapp1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/mastan_case_1738590988875_1738590996644.png)
Mastan Sai : హీరో రాజ్ తరుణ్ కేసులో షాకింగ్ ట్విస్ట్-మస్తాన్ సాయి అరెస్ట్, హార్డ్ డిస్క్ లో భారీగా ప్రైవేట్ వీడియోలు
Mastan Sai : హీరో రాజ్ తరుణ్-లావణ్య కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. తాము విడిపోవడానికి మస్తాన్ సాయి కారణమని లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో 200లకు పైగా ప్రైవేట్ వీడియోలు ఉన్నాయని లావణ్య ఆరోపిస్తుంది.క
Mastan Sai : హీరో రాజ్ తరుణ్ -లావణ్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజ్ తరుణ్ తనతో విడిపోవడానికి మస్తాన్ సాయి కారణమని లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. పలువురి ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించినట్లు మస్తాన్ సాయిపై ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల విచారణలో…మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసుకున్నారు. లావణ్య ఈ హార్డ్ డిస్క్ ను పోలీసులకు అప్పగించింది. ఇందులో 200కి పైగా ప్రైవేట్ వీడియోలు ఉన్నట్లు ఆమె ఆరోపిస్తుంది.
![yearly horoscope entry point](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు తీసి బ్లాక్ మెయిల్
మస్తాన్ సాయి పలువురు అమ్మాయిలతో సన్నిహితంగా ఉండగా, వారి ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేశాడని లావణ్య ఆరోపించారు. ఆ వీడియోలతో సాయి వాళ్లను బ్లాక్‌మెయిల్ చేసేవాడని చెప్పింది. మస్తాన్ సాయి రికార్డ్ చేసిన పలు వీడియోలను లావణ్య పోలీసులకు అందించింది. సాయి గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు కూడా అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. లావణ్యకు సంబంధించిన కొన్ని వీడియోలను రికార్డు చేసి వాటితో ఆమెను బ్లాక్‌మెయిల్ చేశాడని పోలీసులు చెబుతున్నారు.
అయితే మస్తాన్ సాయి గురించి లావణ్య షాకింగ్ విషయాలు బయటపెట్టింది. హీరో నిఖిల్, వరలక్ష్మి టిఫిన్స్ ప్రభాకర్ రెడ్డికి చెందిన ప్రైవేట్ వీడియోలు మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో ఉన్నట్లు ఆమె తెలిపింది. మస్తాన్ సాయి ఇంటికి వెళ్లి ఈ హార్డ్ డిస్క్‌ను తాను తీసుకొచ్చినట్లు వెల్లడించింది. అమ్మాయిలను ట్రాప్ చేసి వారికి డ్రగ్స్ అలవాటు చేసి లైంగిక దాడికి పాల్పడేవారని ఆరోపించింది. యువతులు మత్తులో ఉన్న సమయంలో వారిపై లైంగిక దాడి చేసి వీడియోలను చిత్రీకరించేవాడని ఆరోపించింది.
హీరో నిఖిల్ ఫోన్ హ్యాక్
తాను బట్టలు మార్చుకునే సమయంలో స్పై కెమెరాలు పెట్టి వీడియోలు చిత్రీకరించాడని, వీడియో కాల్స్, ప్రైవేట్ వీడియోలు రికార్డు చేసి బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డాడని లావణ్య ఆరోపించింది. హీరో నిఖిల్ ఫోన్ హ్యాక్ చేసినట్లు లావణ్య తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ వీడియోల ద్వారా ఇంకా ఎంత మంది వెలుగులోకి వస్తారో వేచిచూడాలి. సాయి ఎవరెవరిని బ్లాక్ మెయిల్ చేశాడు, ఈ కేసులో ఇంకా ఎవరున్నారనేదానిపై నార్సింగ్ పోలీసులు విచారణ చేస్తు్న్నారు.
టాపిక్