![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/super_subbu_1738596224186_1738596229736.jpg)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497842_358_newTwitterIcon.png)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497843_996_facebook1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497844_122_wapp1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/super_subbu_1738596224186_1738596229736.jpg)
Netflix Telugu Web Series: నెట్‌ఫ్లిక్స్ తొలి తెలుగు వెబ్ సిరీస్ ఇదే.. సందీప్ కిషన్ సెక్స్ ఎడ్యుకేషన్.. ఫన్నీగా టీజర్
Netflix Telugu Web Series: నెట్‌ఫ్లిక్స్ తొలి తెలుగు వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సందీప్ కిషన్ లీడ్ రోల్లో మల్లిక్ రామ్ క్రియేట్ చేసిన ఈ కామెడీ సిరీస్ టీజర్ చాలా ఫన్నీగా సాగిపోయింది.
Netflix Telugu Web Series: సందీప్ కిషన్ సెక్స్ ఎడ్యుకేషన్ చెబితే ఎలా ఉంటుంది? నెట్‌ఫ్లిక్స్ లోకి సూపర్ సుబ్బు పేరుతో వస్తున్న వెబ్ సిరీస్ చూస్తే తెలుస్తుంది. ప్రముఖ ఓటీటీ అయిన నెట్‌ఫ్లిక్స్ తొలిసారి తెలుగులో రూపొందిస్తున్న వెబ్ సిరీస్ ఈ సూపర్ సుబ్బు. సందీప్ కిషన్, బ్రహ్మానందం, మురళీ శర్మలాంటి వాళ్లు నటిస్తున్న ఈ కామెడీ సిరీస్ టీజర్ ను సోమవారం (ఫిబ్రవరి 4) ఆ ఓటీటీ రిలీజ్ చేసింది.
![yearly horoscope entry point](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
సూపర్ సుబ్బు వెబ్ సిరీస్
నెట్‌ఫ్లిక్స్ అంటే ఇప్పటి వరకూ అంతా నేషనల్, ఇంటర్నేషనల్. కానీ ఇక లోకల్ కూడా కాబోతోంది. ఈ గ్లోబల్ ఓటీటీ తొలిసారి సూపర్ సుబ్బు పేరుతో తెలుగులో రూపొందించిన సూపర్ సుబ్బు వెబ్ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కు రానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ సోమవారం (ఫిబ్రవరి 3) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. సందీప్ కిషన్, బ్రహ్మానందం, మురళీ శర్మలాంటి నటులు ఉన్న ఈ సిరీస్ టీజర్ చాలా ఫన్నీగా సాగిపోయింది.
“అతడు సూపర్ అన్‌లక్కీ, అతడు సూపర్ వికారమైన మనిషి, అతడు సూపర్ సుబ్బు. త్వరలోనే సూపర్ సుబ్బు నెట్‌ఫ్లిక్స్ లోకి రాబోతున్నాడు” అనే క్యాప్షన్ తో ఈ వెబ్ సిరీస్ టీజర్ రిలీజ్ చేసింది. 50 సెకన్ల పాటు ఉన్న ఈ టీజర్ మొత్తం నవ్వులతో నిండిపోయింది.
సూపర్ సుబ్బు టీజర్ ఎలా ఉందంటే?
సూపర్ సుబ్బు వెబ్ సిరీస్ ను మల్లిక్ రామ్ క్రియేట్ చేశాడు. టిల్లూ స్క్వేర్, పెళ్లి గోల, అద్భుతంలాంటి సినిమాలతో పాపులర్ అయిన డైరెక్టర్ అతడు. తన మార్క్ కామెడీతో అలరించే ఈ డైరెక్టర్ ఇప్పుడు తొలిసారి నెట్‌ఫ్లిక్స్ తో చేతులు కలిపి ఓ ఫన్నీ వెబ్ సిరీస్ తీసుకొస్తున్నాడు. అదే ఈ సూపర్ సుబ్బు.
ఈ వెబ్ సిరీస్ టీజర్ విషయానికి వస్తే.. మొదట్లోనే ఓ జాబ్ కోసం బ్రహ్మానందం దగ్గరికి వస్తాడు సందీప్ కిషన్. ఈ సిరీస్ లో అతడు సుబ్బు అనే పాత్ర పోషించాడు. కంప్యూటర్ జాబ్ అనుకొని వచ్చిన అతడికి సెక్స్ ఎడ్యుకేషన్ జాబ్ ఉందని చెప్పి షాకిస్తాడు బ్రహ్మానందం. కానీ ఓవైపు పెళ్లి, ఉద్యోగం కోసం ఇంట్లో వాళ్ల, స్నేహితుల ఒత్తిడి ఎదుర్కొనే అతడు.. ఆ ఉద్యోగానికి సరే అంటాడు. తర్వాత ఏం జరిగిందన్నది ఈ వెబ్ సిరీస్ లో చూడాలి.
సూపర్ సుబ్బు వెబ్ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కానుందని నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. అయితే స్ట్రీమింగ్ తేదీని మాత్రం ఇంకా చెప్పలేదు. 2025లో తమ ప్లాట్‌ఫామ్ పై రిలీజ్ కాబోయే సిరీస్, సినిమాల గురించి సోమవారం (ఫిబ్రవరి 3) వరుస ట్వీట్లలో నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. అందులో ఈ సూపర్ సుబ్బు కూడా ఒకటి.
ఇదే కాకుండా రానా నాయుడు వెబ్ సిరీస్ సీజన్ 2 కూడా రానుంది. ఇక కీర్తి సురేష్ నటిస్తున్న అక్కా వెబ్ సిరీస్, ఢిల్లీ క్రైమ్ సీజన్ 3, కోహ్రా వెబ్ సిరీస్ సీజన్ 2, సారే జహా సే అచ్చా వెబ్ సిరీస్ సీజన్ 1లాంటివి కూడా ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్ లోకి రానున్నాయి.
సంబంధిత కథనం