Best Web Hosting Provider In India 2024
Ratha Saptami Wishes: రథ సప్తమికి సూర్య భగవానుడి ఆశీస్సులు అందాలని మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు పంపండి
Ratha Sapthami Wishes: రథ సప్తమినాడు సూర్య భగవానుడి ఆశీస్సులు పొందేందుకు ప్రతి ఒక్కరూ పూజ చేస్తారు. రథసప్తమి నాడు మీ బంధుమిత్రులకు తెలుగులోనే శుభాకాంక్షలు చెప్పండి.
రథసప్తమి హిందువులకు ముఖ్యమైన పండుగ. ప్రత్యక్ష దైవం సూర్యుడిని ప్రతిరోజూ పూజిస్తే మీ కోరికలు నెరవేరుతాయి. మాఘమాసం శుక్షపక్షంోల వచ్చే సప్తమి తిథిని రథ సప్తమి అంటారు. ఈరోజే సూర్య భగవానుడి జన్మదినం. చలికాలం వదిలి వేసవి కాలం ఆరంభానికి రథ సప్తమి మొదటి దినంగా మారుతుంది. వేదకాలం నుంచే సూర్యారాధన చేసే ఆచారం ఉండేది. ముల్లోక దేవతల్లో కనిపించే దేవుడు సూర్యుడే. నవగ్రహాల్లో ప్రథముడు కూడా సూర్యుడే. ఆయన జీవకోటికి శుభాలను అందించే దేవుడు. సూర్యుడు జన్మతిధి సందర్భంగా అరసవిల్లి, కోణార్క్ దేవాలయాల్లో వైభవంగా పూజలు జరుగుతాయి. రథసప్తమినాడు ఇంటి ముందు రథం ముగ్గు వేయాలని చెబుతారు. ముగ్గుపైన మట్టి పొయ్యిపై గిన్నె పెట్టి పాలు పొంగిస్తారు. సూర్యుడిని గోధుమలతో చేసిన తీసి పాయసాన్ని వండి నైవేద్యంగా అర్పిస్తారు. ఈ పండుగకు రథ సప్తమి శుభకాంక్షలు బంధువులు, స్నేహితులకు చెప్పండి. ఇక్కడ మేము తెలుగులో రథ సప్తమి శుభాకాంక్షలు ఇచ్చాము. వీటిని మెసేజులు, వాట్సాప్, ఫేస్ బుక్ లలో షేర్ చేయండి.