![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497842_358_newTwitterIcon.png)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497843_996_facebook1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497844_122_wapp1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
Best Web Hosting Provider In India 2024
NNS 4th February Episode: నిజం తెలుసుకున్న మిస్సమ్మ.. మనోహరి, రణ్‌వీర్‌కి వార్నింగ్.. అంజు మెడలో గొలుసు
NNS 4th February Episode: నిండు నూరేళ్ల సావాసం మంగళవారం (ఫిబ్రవరి 4) ఎపిసోడ్లో మిస్సమ్మకు నిజం తెలిసిపోతుంది. దీంతో మనోహరి, రణ్‌వీర్ లకు వార్నింగ్ ఇస్తుంది. అటు అంజు మెడలో అమర్ చెయిన్ వేస్తాడు.
NNS 4th February Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (ఫిబ్రవరి 4) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అంజును తీసుకెళ్లేందుకు మనోహరి, రణ్‌వీర్ ప్లాన్ చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడకు వచ్చిన మిస్సమ్మ వాళ్లు మాట్లాడుకునేది వింటుంది. మిస్సమ్మను చూసి రణవీర్, మనోహరి షాక్ అవుతారు.
![yearly horoscope entry point](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
మనోహరి, రణ్‌వీర్‌లకు మిస్సమ్మ వార్నింగ్
ఎందుకు అంత షాక్ అవుతున్నారు అంటుంది మిస్సమ్మ. మీ కళ్లల్లో ఆ భయం కనిపిస్తుంది. అసలు ఏం చేస్తున్నారు. ఏం చేద్దామనుకుంటున్నారు. మీ ఇద్దరికీ ముందే పరిచయం ఉందా లేదా అన్నది నాకు అనవసరం. కానీ మీరు నా కుటుంబం జోలికి వస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోను అంటూ వార్నింగ్ ఇస్తుంది మిస్సమ్మ.
దీంతో మనోహరి ఏయ్ నీకేమైనా పిచ్చి పట్టిందా..? ఏదేదో మాట్లాడుతున్నావేంటి..? ఈయనేదో అడిగితే చెప్తున్నాను. దానికెందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నావు అంటూ మను వెళ్లిపోతుంటే.. మిస్సమ్మ ఆపి.. మీరు అంజును హాస్పిటల్ కు తీసుకెళ్లారని తెలిస్తే ఆయన నాలా వచ్చి మాట్లాడరు చంపేస్తారు. ఏంటలా చూస్తున్నారు. రణవీర్ అంజును బ్లడ్ టెస్ట్ కోసం హాస్పిటల్‌కు తీసుకెళ్లాడని నాకు తెలుసు. వెనక నువ్వు వెళ్లావని కూడా తెలుసు అంటుంది.
రణవీర్.. అయ్యో మిస్సమ్మ గారు మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అంటాడు. నేను తప్పుగా అర్థం చేసుకోవడం లేదు రణవీర్. మీరే ఈ మనోహరితో కలిసి చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. మీ ప్లానేంటో తెలియదు. ఏం చేస్తున్నారో కూడా తెలియదు. కానీ పిల్లల దగ్గరకు వెళ్లాలంటే ముందు నన్ను దాటుకుని వెళ్లాలి. అన్ని ఇక్కడితో ఆపి వెనక్కి వెళితే మంచిది. లేదంటే మీ ప్రతి పనిలో నేనే అడ్డంకిగా ఉంటాను. మీకు నా గురించి మళ్లీ స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా అని వార్నింగ్ ఇచ్చి మిస్సమ్మ వెళ్లిపోతుంది.
చిత్రగుప్తుడిని బోల్తా కొట్టించిన ఆరు
గుప్త, ఆరు మెల్లగా నడుచుకుంటూ చిత్రగుప్తుడి వెనక నుంచి వెళ్తుంటే.. చిత్రగుప్తుడు చూసి అంత జరిగినా ఈ చిత్రవిచిత్రగుప్తుడు మారడం లేదు ఏంటి అని వాళ్లను ఫాలో అవుతాడు. కొంచెం దూరం వెళ్లాక ఇద్దరూ కలిసి చిత్రగుప్తుడు వినేలా నా దగ్గర నాగమణి ఉంది అది ఎవరి దగ్గర ఉంటే వాళ్లకు పవర్ వస్తుంది.
నన్ను భూలోకం తీసుకెళ్లిన వాళ్లకే ఇస్తాను అని చెప్తుంది ఆరు. చాటు నుంచి విన్న చిత్రగుప్తుడు ఆ బాలికను నేనే భూలోకం తీసుకెళ్తాను ఆ నాగమణి నేనే తీసుకుంటాను అనుకుంటాడు.
అంజు మెడలో చెయిన్
అమర్ కిందకు వచ్చి అంజు లాకెట్ మిస్సమ్మకు ఇస్తూ అంజు వచ్చాక మెడలో వేయమని చెప్తాడు. మిస్సమ్మ సరే అంటుంది. ఇంతలో నిర్మల, శివరాం వస్తారు. ఈ చెయిన్ అంజు పుట్టిన రోజు నాడు కానీ ఏదైనా స్పెషల్ అకేషన్ రోజు వేస్తావు కానీ ఈరోజు ఎందుకు వేస్తున్నావు అని శివరాం అడుగుతాడు.
అమర్ ఈ చెయిన్ ఇంకెప్పటికీ అంజలి మెడలో వేద్దామనుకుంటున్నాను అని చెప్తాడు. ఇన్ని రోజుల లేనిది ఇప్పుడెందుకు కొత్తగా వేస్తున్నావు నాన్నా అని నిర్మల అడుగుతుంది. ఇది అంజు మెడలోనే ఉండాలి అమ్మా అది తన హక్కు.. ఇది తనతో ఉంటేనైనా తన ప్రయాణంలో తన కన్నవాళ్లు ఉంటారని చెప్పబోతూ.. అమర్ ఆగిపోతాడు. ఏంటండి మీరు విచిత్రంగా మాట్లాడుతున్నారు తన కన్నవాళ్లు అంటూ పరాయిదానిలా మాట్లాడుతున్నారు అని మిస్సమ్మ అడుగుతుంది.
దీంతో రాథోడ్ మిస్సమ్మ ఇది మేడం చేయించిన చెయిన్.. అది అంజు మెడలో వేస్తే.. మేడం తనతో ఉంటుందని సార్ అభిప్రాయం అంటాడు. ఇంతలో అంజు లోపలికి రాగానే.. అమర్ చెయిన్ తీసి మెడలో వేస్తాడు. పై నుంచి అంతా గమనిస్తుంటారు రణవీర్, మనోహరి.
అంజుని తీసుకెళ్లడానికి రణ్‌వీర్ కొత్త ప్లాన్
ఆ చెయిన్ ఏంటని రణవీర్.. మనోహరిని అడుగుతాడు. అదేదో సెంటిమెంట్ చెయిన్ అంటూ ఇద్దరూ చూసి షాక్ అవుతారు. పక్కకు వెళ్లి చెయిన్ గురించి మాట్లాడుకుంటారు. అసలు నిజం కళ్ల ముందే పెట్టుకుని దేశం మొత్తం వెతికాను అంటూ రణవీర్ మాట్లాడుతూ అమర్ తనకు తెలియకుండానే నాకు చాలా హెల్ప్ చేస్తున్నాడు అంటాడు. అలాంటి చెయినే మరోకటి చేయించుకుని అంజలిని తీసుకుని మనం వెంటనే బయలుదేరాలి.. నాకు ఎక్కువ టైం లేదు అంటాడు.
అప్పుడే వచ్చిన అంజలి నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడుగుతుంది. మనోహరి, రణవీర్ షాక్ అవుతారు. అంజు తమ కూతురేనని మనోహరి, రణ్‌వీర్‌కి తెలిసిపోతుందా? చిత్రగుప్తుడి సాయంతో ఆరు మళ్లీ భూలోకానికి వస్తుందా? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు ఫిబ్రవరి 4న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!
సంబంధిత కథనం
టాపిక్