Best Web Hosting Provider In India 2024
Nidadavole Cheating: న్యూడ్ వీడియోలంటూ బెదిరించి రూ.2.5కోట్లు కొట్టేశారు.. నిందితుల ఆస్తులు జప్తు చేసిన ఏపీ పోలీసులు
Nidadavole Cheating: చిన్ననాటి స్నేహితురాలి భర్తగా పరిచయం చేసుకుని ఆ తర్వాత న్యూడ్ వీడియోలు, మార్ఫింగ్ ఫోటోలతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుంచి రెండున్నర కోట్లు కాజేసిన ఘటన నిడదవోలులో వెలుగు చూసింది. ఈ ఘటనలో నిందితుల నుంచి రూ.1.81 కోట్ల విలువైన స్థిరాస్తుల్ని పోలీసులు జప్తు చేశారు.
Nidadavole Cheating: హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న యువతిని హాస్టల్లో కలిసి చిన్ననాటి స్నేహితురాలు, ఆమె భర్త కలిసి రెండున్నర కోట్లు కాజేశారు. యువతి భయాన్ని ఆసరా చేసుకుని బాధితురాలి నగ్న వీడియోలు తమ దగ్గర ఉన్నాయని భయపెట్టి రెండున్నర కోట్లు వసూలు చేశారు. ఇంకా డబ్బు కోసం వేధిస్తుండటంతో వాటిని తాళలేక బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది.
బాధితురాలి నగ్న వీడియోలు ఉన్నాయని, డబ్బులు ఇవ్వక పోతే వాటిని ఇంటర్నెట్‌లో పెడతానంటూ బెదిరించి రూ.2.53 కోట్లు కాజేసిన యువకుడిని తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పోలీసులు అరెస్టు చేశారు.
తూర్పు గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన యువతి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తూ అక్కడే ఓ వసతి గృహంలో ఉంటోంది. అదే హాస్టల్లో కొద్ది రోజుల క్రితం కాజా అనూషదేవి బాధితురాలిని కలుసుకుంది. వీరిద్దరూ చిన్ననాటి స్నేహితులుగా పోలీసులు చెబుతున్నారు.
ఆ తర్వాత అనూష దేవి తన భర్త అంటూ నినావత్ దేవనాయక్ అలియాస్ మధు సాయి కుమార్ అనే యువకుడిని బాధితురాలికి పరిచయం చేసింది. కొద్ది రోజుల తర్వాత దేవనాయక్ గొంతు మార్చి ఆ యువతికి ఫోన్ చేసి ‘ ఆమెకు సంబంధించిన న్యూడ్ వీడియోలు ఉన్నాయని. నెట్‌లో వాటిని అప్లోడ్ చేయకూడదంటే డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
ఆ తర్వాత బాధితురాలితో ఇతరుల సహాయంతో యువతికి ఎదురైన సమస్యను తాను పరిష్కరించానని చెప్పి దేవనాయక్ ఆమె నుంచి డబ్బు తీసుకున్నాడు. ఇలా పలు దఫాలుగా బాధితురాలి డబ్బు గుంజాడు. ఇటీవల ఆమె డబ్బులు ఇవ్వడానికి నిరా కరించడంతో మళ్లీ బెదిరింపులకు దిగాడు. ఆమె నుంచి దేవనాయక్ రూ.2.53 కోట్లకు పైగా వసూలు చేశాడు. నిందితుడు వేధింపులు శృతి మించడంతో చివరకు బాధితురాలు నిడదవోలు పోలీసులను ఆశ్రయించారు.
ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దేవనా యక్‌ను ఈనెల 2న గుంటూరు జిల్లా చిన్న కాకానిలో అరెస్టు చేశారు. అతని నుంచి రూ.1.81 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు సీజ్ చేశారు. ఇవన్నీ బాధితురాలి నుంచి గుంజిన డబ్బుతోనే వాటిని కొనుగోలు చేసినట్టు గుర్తించారు. నిందితుడికి సహకరించిన అనూషదేవి పాత్రపై విచారణ జరుపుతున్నారు,.
టాపిక్