Best Web Hosting Provider In India 2024
Brahmamudi February 4th Episode రుద్రాణి గ్యాంబ్లింగ్- 2 కోట్లు కొట్టేసిన రాహుల్‌ను బాదిన రాజ్- ట్విస్టుల మీద ట్విస్టులు
Brahmamudi Serial February 4th Episode: బ్రహ్మముడి ఫిబ్రవరి 4 ఎపిసోడ్‌లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకున్నాయి. రాజ్ దగ్గర ఉన్న రెండు కోట్ల గురించి రుద్రాణి షేర్స్ మార్కెట్ అనే గ్యాంబ్లింగ్ల్ ప్లాన్ వేసి ఎమోషనల్ డ్రామా చేస్తుంది. తర్వాత రాహుల్‌తో రాజ్ దగ్గర ఉన్న 2 కోట్లను దొంగతనం చేయిస్తుంది.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో తనను అపర్ణ నిందించిందని రాజ్ అంటే.. అలా చేయలేదని, వాళ్లు నిందించడానికి వారికి బదులు ఆమె అడిగారని కావ్య చెబుతుంది. దాంతో ఛ.. మామ్‌ను తప్పుగా అపార్థం చేసుకున్నాను అని రాజ్ అంటాడు. మీ అమ్మగారినే కాదు మీరు ఆడవాళ్లందరని తప్పుగా అర్థం చేసుకుంటారు. మీరు దీంట్లో కోర్స్ కూడా చేసినట్లు అనిపిస్తుంది అని కావ్య అంటుంది.
డిపాజిట్‌కు సీడీఎమ్‌లు ఉన్నాయిగా
ఇద్దరు సరదాగా వాదించుకుంటారు. పడుకునేలోపు మీరు ఏమైనా చేస్తే.. నేను సపోర్ట్ చేద్దామనుకుంటున్నాను అని కావ్య అంటే.. హుమ్.. అని సీరియస్‌గా రాజ్ చూస్తాడు. అదే డబ్బులు లెక్కపెట్టడానికి సపోర్ట్ చేస్తాను అని కావ్య అంటే.. డబ్బు లెక్కపెట్టడం అయిపోయింది. లోపల పెట్టు. రేపు వెళ్లి బ్యాంక్‌లో డిపాజిట్ చేద్దాం అని రాజ్ అంటాడు. బ్యాంక్ లేనప్పుడు డిపాజిట్ చేయడానికి సీడీఎమ్‌లు ఉన్నాయి కదా అని కావ్య అంటాడు.
అందుకు ఇవి రెండు లక్షలు కాదు.. రెండు కోట్లు. అప్డేట్ అవ్వు కానీ, సగం సగం కాకు అని కావ్యను రాజ్ అంటాడు. ఆ మాటలు చాటుగా విన్న రాహుల్ రెండు కోట్ల.. వీళ్లకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని అనుమానిస్తాడు. రాజ్ లేవగానే రాహుల్ వెళ్లిపోతాడు. ఏవండి నాకో డౌట్. రెండు కోట్లు కట్టాలంటే ట్యాక్స్ కట్టాలి కదా అని కావ్య అడుగుతుంది. అది ఆడిటర్ చూసుకుంటాడు. మాట్లాడాను. రేపు వెళ్లి డిపాజిట్ చేయాలి. లేకుంటే వాడు గొడవ చేస్తాడు అని రాజ్ అంటాడు.
మరోవైపు రుద్రాణి తలపట్టుకుని ఉంటే.. ధాన్యలక్ష్మీ అటు ఇటు తిరుగుతుంది. రుద్రాణివైపు కోపంగా చూసి.. కొన్నిరోజులు సైలెంట్‌గా ఉందామంటే అమెరికా అని నన్ను తిక్కలదాన్ని చేశావ్. నువ్ చేసే పనులకు నాకు వచ్చే కోపానికి నిన్ను చంపేయాలని ఉంది. రాజ్, కావ్య ప్రతి పనిలో వేలు పెడుతున్నావ్. తప్పు అని గొడవ చేసి చివరికి నువ్వే గొప్పవాళ్లను చేస్తున్నావ్. అంతటికి కారణం నువ్వు కాదా అని ధాన్యలక్ష్మీ అంటుంది.
కోడలిగా వచ్చినప్పుడు
కరెక్ట్‌గా చెప్పారు ఆంటీ అని స్వప్న ఎంట్రీ ఇస్తుంది. చివరికీ మా అత్తతో చేరితో కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్లే అని తెలుసుకున్నారు అని స్వప్న అంటుంది. తల్లిలాంటి అత్తను పట్టుకుని కుక్క అంటావా అని రుద్రాణి అంటుంది. మరి నక్క అనమంటారా అని చెప్పిన స్వప్న మీకోసం వచ్చాను అని ధాన్యలక్ష్మీతో అంటుంది. ఒకసారి మీరు ఇంట్లో కోడలిగా వచ్చినప్పుడు మీరు ఎలా ఉండేవారు. మీకు అందరు గౌరవం ఇచ్చారు. మీరు ఎప్పుడు అయితే మా అత్తతో చేరారో మీ మాటకు విలువ లేకుండా పోయింది అని స్వప్న చెబుతుంది.
మూర్ఖులు తము చెప్పిందే నిజం అని వాదిస్తారు. ఒప్పుకునేలా చేసి చివరికి వాళ్ల స్థాయికి చేరుస్తారు. ఇప్పుడు మా అత్త మిమ్మల్ని తన స్థాయికి చేర్చింది ఆలోచించుకోండి అని స్వప్న వెళ్లిపోతుంది. ఏంటీ ఆలోచిస్తున్నావ్. అది చెప్పింది నిజమని నమ్ముతున్నావా అని రుద్రాణి అంటే.. కాసేపు నన్ను వదిలేయ్. చిరాకుగా ఉంది అని ధాన్యలక్ష్మీ అంటుంది. దాంతో రుద్రాణి వెళ్లిపోతుంది. ఇంట్లో అంతా వాయిదాల పద్ధతితో ఇలా వాయించేస్తున్నారేంటీ. స్వప్న అంత చెడగొట్టింది అని రుద్రాణి అనుకుంటుంది.
ఇంతలో రాహుల్ వచ్చి నీకు ఇక ధాన్యలక్ష్మీ అత్తతో పనిలేదు. వన్ వుమెన్ షోనే. అలాంటి ఇలాంటి బాంబ్ కాదు. ఇన్నిరోజులు ఖర్చులకు డబ్బులు లేవు అంటూ రాజ్, కావ్య క్యాంటిన్ ఫుడ్ పెడుతున్నారు కదా. కానీ, అదంతా అబద్ధం. వాళ్లదగ్గర రెండు కోట్ల డబ్బు ఉంది అని చెబుతాడు. కానీ, రుద్రాణి నమ్మదు. మనల్నీ ఇంట్లో అంతా కామెడీ పీస్‌లా చూస్తున్నారు. అన్ని చేసి బకరాలు అవుతున్నాం. నిజంగా వాళ్ల దగ్గర రెండు కోట్లు ఉంటే వాళ్లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టిద్దాం అని రుద్రాణి అంటుంది.
సూపర్ ప్లాన్ మమ్మీ
ఎలా పట్టిద్దాం అని రాహుల్ అంటాడు. రేపు నేను షేర్స్ మార్కెట్‌లో రెండు కోట్లు పోగొట్టుకున్నట్లు నటిస్తాను. ఆ డబ్బును రాజ్‌ను కట్టమంటాను. సాధారణంగానే రాజ్ డబ్బులు లేవంటాడు అని రుద్రాణి చెబుతుంది. అప్పుడు నీ నాటకం మొదలు పెడతావ్ అని రాహుల్ అంటాడు. అప్పుడు ఏదో ప్లాన్ చెబుతుంది రుద్రాణి. అది విన్న రాహుల్ అబ్బా సూపర్. ప్లాన్ అదిరిపోయింది. రేపే నీ నాటకానికి తెరలేపు అని అంటాడు.
మరుసటి రోజు రుద్రాణితో ఇద్దరు రమ్మంటారా అని అడిగితే.. ఆగమని చెబుతుంది. రాజ్, కావ్య వస్తుంటారు. ఈ డబ్బు బ్యాంక్‌లో డిపాజిట్ చేసి ఆఫీస్‌కు వెళ్లాలి అని రాజ్ అంటాడు. అది చూసి రుద్రాణి వాళ్లను రమ్మని చెబుతుంది. వాళ్లు ఇంట్లోకి వచ్చి రుద్రాణి గారు అంటూ అరుస్తారు. ఎవరు మీరు అని అడుగుతారు. రుద్రాణి చెప్పకపోవడంతో.. ఏంటీ ప్రతి ఇంట్లో చిచ్చుపెట్టే పని పెట్టుకున్నావా అని ఇందిరాదేవి అంటుంది.
డబ్బులు సంపాదిద్దామని షేర్స్‌లో ఇన్వెస్ట్ చేశాను అని రుద్రాణి అంటే.. నీకు అంత డబ్బు ఎక్కడిది అని ఇందిరాదేవి అడుగుతారు. తన దగ్గర లేదని మా దగ్గర రెండు కోట్లు తీసుకుంది. వారంలో ఇస్తానని మూడు వారాలు అయింది. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. అందుకే ఇంటికి వచ్చాం అని వాళ్లు అంటారు. అప్పు ఎందుకు చేశావ్ మామ్ అని రాహుల్ డ్రామా ఆడుతాడు. నీకెందుకు రాలేదని సిగ్గు పడమని రుద్రాణి అంటుంది. వాన్ని చేయమని చెబుతావేంటీ బుద్ధి తక్కువదానా అని ఇందిరాదేవి అంటుంది.
యాక్షన్ తీసుకోమంటారా
ఏం చేయను. మీరు డబ్బులు ఇవ్వలేవు. అందుకే సంపాదిద్దామనుకున్నాను. మార్కెట్ వీక్‌గా ఉంది. గొప్పగొప్ప వాళ్లు కూడా డబ్బులు పెట్టి దివాళా తీశారు అని రుద్రాణి అంటుంది. ఈ ఇల్లును కూడా దివాళ తీద్దామనుకున్నావా అని ఇందిరాదేవి అంటుంది. మీరు తర్వాత వాదించుకోండి. నాకు మాత్రం డబ్బులు కట్టండి అని వాళ్లు అంటారు. రెండు కోట్లకే రెండు వందలు అని చూస్తున్నారు. రెండు కోట్లేగా అని రుద్రాణి అంటుంది.
అప్పుడు రాజ్ కంపెనీలో లాస్ వచ్చిందన్నాడు. ఇప్పుడు నేను మార్కెట్‌లో పోగొట్టుకున్నాడు. నాకోసం ఆమాత్రం కట్టలేడా అని రుద్రాణి అంటుంది. త్వరగా డబ్బు ఇవ్వండి మేము వెళ్లాలి. లేదంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. మేము ముందే చెప్పాం. త్వరగా ఇస్తారా యాక్షన్ తీసుకోమంటారా అని వాళ్లు అంటారు. రాజ్ నువ్వు ఒక్కడివే దిక్కు. త్వరగా ఆ డబ్బులు ఇచ్చేయ్ అని రుద్రాణి అంటుంది. రెండు కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి అని కావ్య అంటుంది.
సుభాష్ కూడా సపోర్ట్ చేస్తాడు. డబ్బులివ్వండి అన్నయ్య. ఇవ్వకుంటే వీళ్లు ఏమైనా చేస్తారు. అసలే రాక్షసులు వీళ్లు అని భయపడినట్లు నటిస్తుంది రుద్రాణి. చేసేముందు ఈ భయం ఉండాలి అని అపర్ణ అంటుంది. డబ్బు సంపాదించి ఇంటికి పూర్వవైభం తీసుకురావాలని అనుకున్నాను అని రుద్రాణి అంటుంది. వైభవం కాదు మీ వల్ల పరువు పోకుంటే చాలు అని స్వప్న అంటుంది. రాజ్ తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను. నన్ను మన్నించి ఈ అత్తను కాపాడురా అని రుద్రాణి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది.
ఇవ్వనిచ్చేలా లేవు
సారీ అత్త నిజంగా మా దగ్గర డబ్బుల్లేవు. అడ్జస్ట్ చేసే పరిస్థితుల్లో కూడా లేము అని రాజ్ అంటాడు. బాగా ఆలోచించు ఏదో ఒక దారి దొరుకుతుంది అని రుద్రాణి అంటుంది. ఆయన డబ్బు ఉంచుకుని లేదని చెప్పేవారు కాదు. అది మీరు అర్థం చేసుకోవట్లేదు అని కావ్య అంటుంది. ఉన్నా నువ్వు ఇవ్వనిచ్చేలా లేవు అని రుద్రాణి అంటుంది. దాంతో అపర్ణ, స్వప్న వారిస్తారు. మీరు ఆఫీస్‌కు వెళ్లండి అని చెప్పడంతో రాజ్, కావ్య వెళ్లిపోతారు.
మా డబ్బులు త్వరగా ఇవ్వమని వాళ్లు కోప్పడతారు. నాకు ఒకరోజు టైమ్ ఇవ్వండి. ఏదోలా ఇస్తాను అని రుద్రాణి అంటుంది. సరే, రేపటి వరకు టైమ్ ఇస్తాం. అప్పటికీ డబ్బు ఇవ్వకంటే అన్న మీతో డైరెక్ట్‌గా డీల్ చేస్తాడు అని వెళ్లిపోతారు. ఏంటీ, ఏం చేద్దామని అనుకుంటున్నావ్ మమ్మల్ని అని ఇందిరాదేవి అంటుంది. మీ గురించే తప్పా నా గురించి ఆలోచిస్తున్నారా. రేపు వాళ్లు ఒకవేళ నా ప్రాణం తీస్తుంటే మీరు ఇలాగే చూస్తుంటారా. తప్పు చేశానని చెబుతున్నాను కదా. ఆమాత్రం సాయం చేయలేరా అని రుద్రాణి అంటుంది.
నీ చెల్లెలికి ఆపద వస్తే రెండుకోట్లు కూడా నీ కొడుకుతో ఇప్పించలేవా. సరే నా కష్టం మీది కానప్పడు ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాను అని రుద్రాణి అంటుంది. నువ్ లేకపోతే నేను బతకలేను అని రాహుల్ అంటాడు. ఇద్దరం కలిసి కట్టకట్టుకుని చద్దాం లేరా అని రుద్రాణి అంటుంది. ఇప్పుడేంటీ అంత ఓవరాక్షన్ చేస్తున్నావ్. రాజ్ అర్జంట్ పనిమీద వెళ్లాడు. రాగానే అడిగి చూస్తాను అని సుభాష్ అంటాడు. అడగడం కాదు డబ్బులు ఇప్పించడం అని రుద్రాణి అంటుంది.
రెండు కోట్లు ఉన్నప్పుడే
చూస్తా అన్నకదా అని సుభాష్ వెళ్లిపోతాడు. అరెయ్ నా పని సక్సెస్‌ఫుల్‌గా పూర్తి అయింది. ఇక మిగిలింది నువ్ చేయాల్సిన పనే రుద్రాణి అంటుంది. అది నేను చూసుకుంటాను. ఇప్పుడు వెళ్లి వాళ్ల దగ్గరి నుంచి రెండు కోట్లు ఎలా కొట్టుకొస్తానో చూడు అని రాహుల్ వెళ్లిపోతాడు. మరోవైపు రుద్రాణి గారు చేసినదానిబట్టి మీకేం అనిపిస్తుందని రాజ్‌ను కావ్య అడుగుతుంది. తను ముందు నుంచి ఇలాగే చేస్తుందని రాజ్ అంటాడు.
డబ్బులు ఉన్నప్పుడు చేయడం వేరు. కానీ, ఇలాంటి పరిస్థితుల్లో చేసిందంటే నాకు అనుమానంగా ఉందని కావ్య అంటుంది. డబ్బులు లేవు కాబట్టే గ్యాంబ్లింగ్ ఆడి డబ్బులు సంపాదించొచ్చు అనుకుంది అని రాజ్ అంటాడు. అది కాదండి. ఇంట్లో పరిస్థితి తెలుసు. డబ్బులు లేవని తెలుసు. కానీ, ఏ ధైర్యంతో రెండు కోట్ల అప్పుచేసింది. అది కూడా సరిగ్గా మన రెండు కోట్లు ఉన్నప్పుడు. తను కచ్చితంగా కావాలని చేస్తుందని చెప్పలేను. కానీ, ఏదో అనుమానంగా ఉంది అని కావ్య అంటుంది.
మన దగ్గర డబ్బు ఉన్నట్లు ఎవరికి తెలియదు కదా అని రాజ్ అంటాడు. అందుకేగా గట్టిగా ప్రశ్నించలేకపోయాను అని కావ్య అంటుంది. మరోవైపు రాహుల్ దగ్గరికి బైక్ మీద ఒకతను వస్తాడు. రాహుల్ కారులో ఎక్కుతాడు. ఫోన్‌లో చెప్పింది గుర్తుంది కదా అని రాహుల్ అంటే.. మీ రాజ్ వస్తాడు. కారు బ్యాక్ సీట్‌లో రెండు కోట్లు ఉన్నాయి. బ్యాంక్‌కు వెళ్లేలోపు ఆ బ్యాగ్‌ను కొట్టేయాలి అని అతను అంటాడు. అంతేకాదు నేను స్ట్రీట్ నెంబర్ 4లో ఉంటాను. వాళ్లు నీ వెంట పడతారు. కారులో వస్తున్నారు కాబట్టి నువ్ ఫాస్ట్‌గా వచ్చి ఆగి ఉన్న నా కారులో బ్యాగ్ పడేసి వెళ్లిపో అని రాహుల్ చెబుతాడు.
మొత్తం బయటపెట్టిన కావ్య
కట్ చేస్తే రాజ్ కారు నుంచి అతను బ్యాగ్ కొట్టేస్తాడు. కావ్య అరుస్తుంది. రాజ్, కావ్య ఫాలో అవుతారు. కానీ, ఈలోపు రాహుల్ దగ్గర బ్యాగ్ పడేస్తాడు దొంగ. తర్వాత దొంగను రాజ్ పట్టుకుని బాదుతాడు. ఈ పని నీతో ఎవరు చేయించారో చెప్పమని ఎడా పెడా వాయిస్తాడు. దాంతో రాహుల్ అని ఆ దొంగ చెబుతాడు. అది తెలిసి ఇంటికి వెళ్లి రాహుల్‌ను పిచ్చికొట్టుడు కొడతాడు రాజ్. ఏమైందని రుద్రాణి అడిగితే.. నా దగ్గర రెండు కోట్లు కొట్టేసాడు అని చెబుతాడు.
నీ దగ్గర డబ్బులు లేవని చెప్పావ్. నన్ను వాళ్లు బెదిరిస్తుంటే డబ్బు ఉన్న కూడా నోరు మెదపలేదు అని రాజ్‌నే రివర్స్ అటాక్ చేస్తుంది రుద్రాణి. ఇంతలో వీళ్లిద్దరేగా నన్ను బెదిరించింది అని కావ్య వాళ్లను తీసుకొస్తుంది. దాంతో రుద్రాణి తటాపటాయిస్తుంది. అక్కడితో ట్విస్టుల మీద ట్విస్టులతో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్