Mandukasana Benefits: లైంగిక జీవితం బాగుండాలంటే మహిళలు ఈ యోగాసనం తప్పకుండా చేయాలి! ఎలా చేయాలో ఇక్కడ ఉంది!

Best Web Hosting Provider In India 2024

Mandukasana Benefits: లైంగిక జీవితం బాగుండాలంటే మహిళలు ఈ యోగాసనం తప్పకుండా చేయాలి! ఎలా చేయాలో ఇక్కడ ఉంది!

Ramya Sri Marka HT Telugu
Feb 04, 2025 08:30 AM IST

Mandukasana Benefits: ఈ రోజుల్లో గంటల తరబడి కూర్చుని పని చేయాల్సిన పరిస్థితితో పాటు కూర్చున్నచోటుకే అన్నీ వచ్చే వెసులుబాటు ఉంది. ఫలితంగా వెన్ను నొప్పి నుంచి లైంగిక జీవితంలో అసంతృప్తి వరకూ ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా మహిళలు వీటి నుంచి ఉపశమనం పొందాలంటే ఈ ఆసనం వేయడం అలవాటు చేసుకోండి.

లైంగిక జీవితం బాగుండాలంటే మహిళలు ఈ ఆసనం తప్పకుండా చేయాలి!
లైంగిక జీవితం బాగుండాలంటే మహిళలు ఈ ఆసనం తప్పకుండా చేయాలి! (shutterstock)

నేడు చాలా మంది జీవనశైలి నిశ్చలంగా ఉంటుంది. అంటే ఎక్కువసేపు కూర్చునే ఉద్యోగాలు చేయండి. ఆర్డర్ పెడితే ఉన్న చోటుకే ఏదైనా రావడం ఇలాంటివన్నీ మనిషిలో శారీరక శ్రమను తగ్గించేస్తున్నాయి. దీనివల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. వెన్నునొప్పి నుండి తప్పుడు భంగిమ వంటే అనేక సమస్యలు ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్నాయి. వీటి ప్రభావం దంపతుల లైంగిక జీవితంపై ముఖ్యంగా మహిళల శారీరక సుఖంపై కూడా పడుతుంది. మీరు కూడా ఇదే జీవనశైలిని అనుసరిస్తున్నట్లయితే, లైంగిక జీవితంలో అసంతృత్తిగా ఫీల్ అవుతుంటే ఈ మండూకాసనం మీకు చాలా బాగా సహాయపడుతంది.

yearly horoscope entry point

మండూకాసనం దీన్న కప్ప భంగిమ లేదా ఫ్రాగ్ పోజ్ అని కూడా పిలుస్తారు. ఈ ఆసనం శరీరంలో చలనశీలతను పెంచడంతో పాటు భంగిమను సరిచేయడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా లైంగిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నమహిళలకు ఇది చక్కటి ఉపశమనం కలిగిస్తుంది. మండూకాసనం చేయడం వల్ల కలిగే లాభాలేంటి, ఎలా చేయాలి వంటి వివరాలను తెలుసుకుందాం పదండి.

లైంగిక జీవితంపై మండూకాసనం ప్రభావం ఎంత వరకూ ఉంటుంది?

యోగా నిపుణుల అభిప్రాయం ప్రకారం హిప్ ఓపెనర్ వ్యాయామాలు మహిళల లైంగిక జీవితాన్ని మెరుగుపరుస్తాయి. ఎలాగంటే..

1.పెల్విక్ ఫ్లోర్ బలపడడం:

మండూకాసనం చేసినప్పుడు పెల్విక్ ఫ్లోర్ (మూలాధారం , గర్భాశయ భాగం) శక్తివంతంగా తయారవుతుంది. ఇది మహిళలు పీరియడ్స్ సమయంలో అనుభవించే శరీరంలోని మార్పులను, బలహీనతలను తగ్గించి, వారి ఆరోగ్యాన్ని స్థిరపరిచే విధంగా సహాయపడుతుంది. లైంగిక సంబంధాల సమయంలో శక్తిని పెంచుతుంది.

2.ఆరోగ్యకరమైన రక్తప్రవాహం:

ఈ ఆసనాన్ని చేస్తే పెల్విక్ ప్రాంతంలో రక్తప్రవాహం మెరుగుపడుతుంది. దీని వలన గర్భాశయం , ఇతర సంబంధిత అవయవాలు ఎక్కువ పోషకాలను అందుకుంటాయి.

3.మానసిక శాంతి:

యోగా, సాధన చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది, శరీరంలో కార్టిసోల్ స్థాయిలు తగ్గించి, ఒత్తిడి రహితంగా జీవించడానికి సహాయపడుతుంది. ఇది లైంగిక జీవితంలో మంచి అనుభవాన్ని పొందేందుకు సహాయపడుతుంది.

4.క్రాంపులు తగ్గించడం:

మండూకాసనం పెల్విక్ ప్రాంతంలో బలాన్ని పెంచి, పీరియడ్ నొప్పులను తగ్గిస్తుంది.

5. శక్తిని పెంచుతుంది:

ఈ ఆసనం చేయడం వల్ల భుజం, వెన్ను, పెల్విక్ ప్రాంతాల్లో బలం పెరుగుతుంది. శరీరం మరింత సాఫీగా , శక్తివంతంగా మారుతుంది. లైంగిక జీవితంలో ఎక్కువ సమయాన్ని గడిపేలా, ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది.

ఫ్రాగ్ పోజ్ చేయడం వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలు:

హిప్ ఓపెనర్ ఫ్రాగ్ పోజ్:

మండూకాసనం చేయడం వల్ల శరీరానికి సమతుల్యత లభిస్తుంది, చలనశీలత మెరుగుపడుతుంది. అధ్యయనాల ప్రకారం గంటల తరబడి కూర్చుని పనిచేయడం, నిరంతరం డ్రైవింగ్ చేయడం వల్ల నడుము చుట్టూ ఉన్న కండరాలు బిగుసుకుపోతాయి ఈ ఆసనం కండారాల్లో ఉద్రిక్తతను తగ్గించడంలో సహాయపడుతుంది. రోజూ ఈ ఆసనం చేయడం వల్ల హిప్ చుట్టుపక్కల కండరాలు సాగి ఆరోగ్యంగా తయారవుతాయి.

వెన్నునొప్పి నుండి ఉపశమనం:

అధ్యయనాల ప్రకారం వెన్నునొప్పి ఉన్నవారు రోజూ ఈ ఆసనం చేయాలి. దీనివల్ల వెన్నెముకకు విశ్రాంతి లభిస్తుంది, హిప్‌లో ఉన్న ఉద్రిక్తత తొలగిపోతుంది.

ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి:

రోజూ ఫ్రాగ్ పోజ్ చేయడం వల్ల ఒత్తిడి మరియు ఆందోళన నుండి ఉపశమనం లభిస్తుంది. నడుము చుట్టూ ఉన్న కండరాల ఉద్రిక్తత తగ్గి విశ్రాంతిగా అనిపిస్తుంది. దీనివల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది

పొట్టపై మృదువైన ఒత్తిడి వల్ల పేగు కదలిక పెరిగి మలబద్ధకం నుండి ఉపశమనం లభిస్తుంది.

మండూకాసనం( Frog Pose) ఎలా చేయాలి?

  • ఫ్రాగ్ పోజ్ లేదా మండూకాసనం అనేది సంస్కృత పదం మండూక నుండి తీసుకోబడింది. మండూకం అంటే కప్ప. ఈ ఆసనంలో శరీరాన్ని కప్ప భంగిమలో ఉంచే ప్రాక్టీస్ చేయాలి.
  • దీనికోసం ముందుగా యోగా మాట్ మీద పొట్ట ఆనుకునేలా బోర్లా పడుకోండి.
  • తరువాత రెండు కాళ్ళను మోకాళ్ళ వరకూ మడిచి రెండు పాదాలు పైన కనిపిస్తున్న విధంగా కలిపి ఉంచండి.
  • రెండు చేతుల పిడికిలి బిగించి మోచేతుపై బరువు పెట్టి పొట్టనే నేలకు నొక్కండి.
  • ఈ భంగిమలో ఉండి ఊపిరి పీల్చుకుంటూ వదులుతూ కాసేపు ఉండండి తర్వాత విశ్రాంతి తీసుకోండి.

ఇలా రోజుకు రెండు నిమిషాలైనా క్రమం తప్పకుండా చేశారంటే లైంగిక జీవితాన్ని ఎంజాయ్ చేయడంతో పాటు పీరియడ్స్ నొప్పులు, వెన్ను నొప్పులు వంటి ఎన్నో రకాల సమస్యలను నయం చేసుకోవచ్చు.

Whats_app_banner
Source / Credits

Best Web Hosting Provider In India 2024