Best Web Hosting Provider In India 2024
Illu Illalu Pillalu February 4th Episode: విశ్వకు ప్రాణభిక్షపెట్టిన రామరాజు -చందు లవ్‌స్టోరీ రివీల్ -ధీరజ్ హ్యాపీ!
Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఫిబ్రవరి 4 ఎపిసోడ్‌లో ధీరజ్‌ను చంపాలని చూసిన విశ్వకు రామరాజు వార్నింగ్ ఇస్తాడు. ఇంకోసారి నా కొడుకు జోలికి వస్తే ముక్కలుగా నరికేస్తానని వార్నింగ్ ఇస్తాడు. మరోవైపు చందు లవ్‌స్టోరీని భద్రావతి భయపెడుతుంది.
Illu Illalu Pillalu: చాలా రోజుల తర్వాత అ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మాటల్లో మునిగిపోతారు ధీరజ్, చందు, సాగర్. ముగ్గురు మేడపైన నిద్రపోవాలని అనుకుంటారు. నిద్ర పోయే టైమ్ అయ్యిందని, ఈ రోజు రూమ్‌లోకి వచ్చేది ఉందా? లేదా? అని సాగర్‌ను అడుగుతుంది నర్మద.
చాలా రోజుల తర్వాత సరదాగా మాట్లాడుకునే అవకాశం దొరికిందని, ఈ రోజు మేడపైనే పడుకుంటానని నర్మదను బతిమిలాడుతాడు సాగర్. నర్మద ఒప్పుకుంటుంది.
నర్మద ఒప్పుకోకపోయి ఉంటే కాళ్లు పట్టుకునేలా ఉన్నావని సాగర్‌ను ఆటపట్టిస్తాడు తిరుపతి. పెళ్లికి ముందు పులిలా ఉండే మగాడి జీవితం పెళ్లి తర్వాత మాటలు రాని టెడ్డీ బేర్‌లా మారిపోతుందని సాగర్ అంటాడు.
లవ్ మ్యారేజ్ కదా…
మీది లవ్ మ్యారేజ్ ..మీ ఇద్దరి మధ్య మంచి అండర్‌స్టాడింగ్ ఉంది కదా…అలా మాట్లాడుతున్నావేంటి అని తమ్ముడిని చందు అడుగుతాడు. లవ్ మ్యారేజ్ కాబట్టే బెండు కావాల్సిందేనని, లేదంటే భార్య అలుగుతుందని సాగర్ అంటాడు. అలకపాన్పుపై ఉన్న భార్యను కూల్ చేయడం చాలా కష్టమని సాగర్ చెబుతాడు.
నర్మదతో లవ్ స్టోరీ గురించి సాగర్‌ను అడుగుతాడు తిరుపతి. నర్మదనే తనను చూసి ఫ్లాట్ అయిపోయి ప్రపోజ్ చేసిందని తెగ బిల్డప్‌లు ఇస్తాడు సాగర్. నేను నో అన్న వినకుండా వెంటపడిందని, ప్రేమించమని నర్మద తనను బతిమిలాడిందని సాగర్ అంటాడు. సాగర్ చెబుతున్న అబద్ధాల్ని నర్మద వింటుంది.
రామరాజు కన్నీళ్లు…
ముగ్గురు అన్నదమ్ములు సరదాగా కబుర్లు చెప్పుకొని నిద్రపోతారు. పడుకున్న తర్వాత ధీరజ్ దగ్గరకు వస్తాడు రామరాజు. ధీరజ్ ఒంటిపై ఉన్న దెబ్బలను చూసికన్నీళ్లు పెట్టుకుంటాడు. రామరాజు కన్నీటి చుక్క ధీరజ్ చేయిపైపడుతుంది. ధీరజ్ మెళుకువ వస్తుంది. ధీరజ్ కూడా ఎమోషనల్ అవుతాడు.
తండ్రి తన దగ్గరకు వచ్చిన సంగతి సాగర్‌కు చెబుతాడు. నాన్నకు నా మీద ఉన్న ప్రేమకు కన్నీటి చుక్కే సాక్ష్యమని, ఆయన మనసులో నా మీద ఎక్కడో ప్రేమ దాగి ఉందని ఉందని ధీరజ్ సంబరపడతాడు.
సాగర్ కవిత్వం…
ఉదయం ముగ్గు వేస్తోన్న నర్మదను చూసి కవిత్వం చెబుతూ పొగుడుతాడు సాగర్. రాత్రి నా గురించి ఏం అబద్ధాలు ఆడారు అని సాగర్‌ను అడుగుతుంది నర్మద. నేనేం అబద్ధాలు చెప్పలేదని సాగర్ అంటాడు. ఒక్కసారి గుర్తుచేసుకోమని సాగర్‌తో అంటుంది నర్మద. నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నీకు మనశ్శాంతి లేకుండా పోయిందా, నేను నిన్ను రాక్షసిలా సాధిస్తున్నానా సాగర్‌ను నిలదీస్తుంది నర్మద. నా ఉద్దేశం అది కాదని సాగర్ తడబడిపోతాడు.
మా వాళ్లను వదిలేసి వచ్చా…
నువ్వు మీ వాళ్లతో కలిసి ఉంటున్నావు…నేను మాత్రం నీ కోసం మా వాళ్లను వదిలేసి వచ్చాను. మా అమ్మనాన్న నాతో ఇప్పటికీ మాట్లాడటం లేదు. ఈ ఇంట్లో నా స్థానం ఏమిటో తెలియడం లేదు. కానీ పెళ్లికి ముందు ప్రశాంతంగా ఉన్నానని నేను ఎప్పుడైనా నీతో అన్నానా అని సాగర్‌ను అడుగుతుంది నర్మద. అదేం లేదని సాగర్ అంటాడు. మా వాళ్ల ముందు బిల్డప్పుల కోసం అబద్ధం ఆడానని సాగర్ ఒప్పుకుంటాడు.
ప్రేమించమని వెంట పడ్డానా…
ప్రేమించమని నేను నీ వెంట పడ్డానా, నీ కాళ్లు పట్టుకొని బతిమిలాడానా? ఎవరు ఎవరి వెంట పడ్డారు? ఎవరు కాళ్లు పట్టుకున్నారని అడగ్గానే…నేనేనని సాగర్ నిజం చెబుతాడు. మీ వాళ్లతో ఎందుకు అబద్ధం చెప్పావని సాగర్‌ను ఆటపట్టిస్తుంది. నా రేంజ్ తగ్గకూడదని అబద్ధం చెప్పానని సాగర్ అంటాడు.
ప్రేమించకపోతే చచ్చిపోతానని నువ్వే నా కాళ్లు పట్టుకొని బతిమిలాడి ఇప్పుడు మాట మార్చేస్తావా అని సాగర్‌ను కడిగిపడేస్తుంది నర్మద. ప్రేమించమని నేను నీ కాళ్లు పట్టుకుంటానని తెలిస్తే మా వాళ్లు నన్ను ఆడుకుంటారని అబద్ధం చెప్పానని సాగర్ ఒప్పుకుంటాడు. ఇంకోసారి ఎప్పడు అబద్ధం చెప్పనని, తనను వదిలేయమని క్షమాపణలు చెబుతాడు.
చందుకు దొరికిపోయిన సాగర్…
అప్పుడే అక్కడికి చందు రావడంతో సాగర్‌ను వదిలేస్తుంది నర్మద. భార్యకు చుక్కల ముగ్గు వేయడం నేర్పిస్తున్నానని అన్నతో అంటాడు సాగర్. పేపర్‌పై పెన్‌తో చుక్కలు వేయడం రానీ నువ్వు చుక్కల ముగ్గు వేయడం నేర్పిస్తున్నావా…నేను మొత్తం చూసేశానని, మీ మాటలు విన్నానని చందు అంటాడు.అన్న ముందు తన పరువు మొత్తం పోయిందని సాగర్ అంటాడు.
విశ్వ రివేంజ్…
ధీరజ్ నొప్పులతో బాధపడుతుండటం రామరాజు సహించలేకపోతాడు. ధీరజ్ జస్ట్‌లో మిస్సయ్యాడని విశ్వ కోపంతో రగిలిపోతాడు. ధీరజ్‌ను చంపేవరకు తన పగ చల్లారదని, వాడు ప్రాణాలతో ఉండటం తట్టుకోలేకపోతున్నానని అంటాడు.
విశ్వ పీక పట్టుకున్న రామరాజు…
విశ్వ తన స్నేహితులతో కలిసి ఉండటం రామరాజు చూస్తాడు. విశ్వ దగ్గరకు వస్తాడు. విశ్వ పీక పట్టుకుంటాడు. ఊపిరి ఆడటం లేదని, తనను వదిలేయమని రామరాజును బతిమిలాడుతాడు విశ్వ. చనిపోతానని భయంగా ఉందా? ధీరజ్‌ను చంపాలని అనుకునే ముందు ఏమైపోయిందని విశ్వను వదిలేస్తాడని రామరాజు.
నా పిల్లలను ఎవరైనా ఒక్క మాట అంటేనే ఊరుకోను. ప్రాణాలు తీయాలని చూస్తే అసలు వదిలిపెట్టనని విశ్వకు వార్నింగ్ ఇస్తాడు,. విశ్వ కాలర్ పట్టుకొని చంపేస్తానని హెచ్చరిస్తాడు.
నా కొడుకు ప్రాణాలు తీయాలని చూసినందుకు నిన్ను ముక్కలుగా నరికేయాలని ఉందని, కానీ నువ్వు నా భార్య అన్న కొడుకువి కాబట్టి బతికిపోయావని విశ్వతో అంటాడు రామరాజు. ఇది నేను నీకు పెట్టిన ప్రాణభిక్ష అనుకొని బతకమని వదిలేస్తాడు. ఇకపై ఇదే భయంతో ఒళ్లు దగ్గర పెట్టుకొని ఉండు. ఇంకోసారి నా కొడుకు జోలికస్తే నిన్ను చంపేస్తానని మరోసారి హెచ్చరిస్తాడు
చందు ప్రేమ…
చందు ప్రేమకథను బయటపెడుతుంది భద్రావతి. ప్రేమలో ఫెయిలై రోడ్లపై తాగి పడిపోతున్నాడని, అందుకు సాక్ష్యం ధీరజ్, సాగర్‌లేనని అంటుంది. చందు కూడా తనను మోసం చేయడం రామరాజు తట్టుకోలేకపోతాడు. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ముగిసింది.