Best Web Hosting Provider In India 2024
OTT Revenge: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్.. పచ్చిబూతులు, వయెలెన్స్.. 7 భాషల్లో స్ట్రీమింగ్!
Kobali OTT Streaming Today With Revenge Crime Thriller Genre: ఓటీటీలోకి ఇవాళ తెలుగు రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కోబలి వచ్చేసింది. టాలీవుడ్ పాపులర్ నటుడు రవి ప్రకాష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ రస్టిక్ రివేంజ్ థ్రిల్లర్ తెలుగుతో సహా 7 భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
OTT Revenge Crime Thriller Kobali Release Today: ఓటీటీలోకి ప్రతివారం డిఫరెంట్ కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ అవుతుంటాయి. ఓటీటీ కంటెంట్‌కు ఎలాంటి సెన్సార్ లేకపోవడంతో విపరీతమైన వయలెన్స్, పచ్చి బూతులు, అడల్ట్ సీన్స్‌తో ఇదివరకు చాలా సినిమాలు, వెబ్ సిరీసులు వచ్చేశాయి.
అవి చాలా అరుదు
హిందీ, ఇంగ్లీష్‌లో ఇలాంటి సినిమాలు నిత్యం వస్తూనే ఉంటాయి. కానీ, తెలుగులో బూతులు, వయెలెన్స్‌తో వచ్చిన ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీసులు చాలా అరుదు. ఇటీవల కాలంలో తెలుగులోనూ ఇలాంటి కంటెంట్‌తో మూవీస్, సిరీసులు తెరకెక్కుతోన్నాయి. తాజాగా ఇలాంటి కంటెంట్‌తో వచ్చిన తెలుగు వెబ్ సిరీసే కోబలి.
రవి ప్రకాష్‌తోపాటు యాంకర్ శ్యామల
ప్రముఖ తెలుగు నటుడు రవి ప్రకాష్ ప్రధాన పాత్రలో తెరెకక్కిన కోబలి వెబ్ సిరీస్‌కు రేవంత్ లెవక దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌లో రవి ప్రకాష్‌తోపాటు యాంకర్ శ్యామల, రాకీ సింగ్, వెంకట్, తరుణ్ రోహిత్, భరత్ రెడ్డి, యోగ్ ఖత్రీ, గడ్డం నవీన్, మణికంఠ తదితురుల ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ వెబ్ సిరీస్‌కు డైరెక్టర్ రేవంత్ లెవక, జీవన్ బండి, రాజశేఖర్ రెడ్డి, కమ్మిరెడ్డి కథ అందించారు.
పచ్చి బూతులు-విపరీతమైన వయెలెన్స్
జ్యోతి మేఘావత్, రాజశేఖర్ రెడ్డి, తిరుపతి శ్రీనివాసరావు నిర్మాతలుగా వ్యవహరించిన కోబలి వెబ్ సిరీస్‌కు గౌర హరి సంగీతం అదించారు. కిశోర్ మద్దాలి ఎడిటర్‌గా వర్క్ చేసిన కోబలి వెబ్ సిరీస్‌ను రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కించారు. ఈ సిరీస్‌లో పచ్చి బూతులు, విపరీతమైన వయెలెన్స్ ఉన్నట్లు కోబలి ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.
కోబలి ఓటీటీ స్ట్రీమింగ్
బండ బూతులు, పరుష పదజాలం, కాస్తా బోల్డ్ సీన్స్, రక్తపాతం, పగ, ప్రతికారం వంటి అంశాలతో కోబలి వెబ్ సిరీస్ తెరకెక్కింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఇవాళ్టీ (ఫిబ్రవరి 4) నుంచి కోబలి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అది కూడా తెలుగుతోకలిపి మొత్తంగా ఏడు భాషల్లో కోబలి ఓటీటీ రిలీజ్ అయింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, బెంగాలీ భాషల్లో కోబలి హాట్‌స్టార్‌లో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.
అధికారిక ప్రకటన
అయితే, కోబలి సిరీస్‌ను ఇవాళ ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నట్లు వారం రోజుల క్రితం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అధికారికంగా ప్రకటించింది. దానికి తగినట్లుగానే నేడు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది కోబలి. ఇదిలా ఉంటే, కోబలి వెబ్ సిరీస్‌లో ఓ ఐటమ్ సాంగ్ ఉన్నట్లు ట్రైలర్‌లో చూపించారు. అంతేకాకుండా లిల్లీ అంటూ సాగే కోబలి వెబ్ సిరీస్ సాంగ్‌ను కూడా రిలీజ్ చేశారు.
ఐటమ్ సాంగ్ ఉన్న సిరీస్
ఇలా ఐటమ్ సాంగ్ ఉన్న వెబ్ సిరీస్‌గా కోబలి నిలిచిందని చెప్పుకోవచ్చు. ఇక కోబలి వెబ్ సిరీస్‌లో సుమారు 30 నిమిషాల రన్ టైమ్‌తో 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. మరి రా అండ్ రస్టిక్ రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన కోబలి ఓటీటీలో ఆడియెన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
సంబంధిత కథనం