Best Web Hosting Provider In India 2024
APSRTC : శ్రీకాకుళం నుంచి మహా కుంభమేళాకు.. రాజమండ్రి నుంచి కాశీ యాత్రకు స్పెషల్ బస్సులు
APSRTC : మహా కుంభమేళాకు వెళ్లే భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. భక్తుల సౌకర్యార్థం ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా, శివరాత్రికి కాశీ యాత్రకు స్పెషల్ సర్వీసులను వేసింది. ఈ ప్రత్యేక బస్సుల ప్యాకేజీ వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీకాకుళం నుంచి ప్రయాగరాజ్‌లో జరిగే మహా కుంభమేళాకు, తూర్పుగోదావరి జిల్లా నుంచి శివరాత్రికి కాశీ యాత్రకు.. ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ స్పెషల్ బస్ సర్వీస్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సర్వీస్‌లను యాత్రికులు వినియోగించుకోవాలని ఆర్టీసీ విజ్ఞప్తి చేసింది.
శ్రీకాకుళం నుంచి..
శ్రీకాకుళం నుంచి ఫిబ్రవరి 8న రాత్రి 8 గంటలకు సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరుతుంది. పూరి (జగన్నాథస్వామి దేవాలయం), కోణార్క్ (సూర్య దేవాలయం), భువనేశ్వర్ (లింగరాజ్ ఆలయం) ప్రయాగరాజ్ (కుంభమేళా, పుణ్యస్నానం) అనంతరం.. తిరిగి ప్రయాణం అవుతుంది. తిరుగు ప్రయాణంలో వారణాసి, గయ, బుద్ధగయ సందర్శన ఉంటుంది.
ఆరు రోజులు పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. ప్రయాగరాజ్, కాశీ క్షేత్రాల్లో ఒక రోజు బస ఉంటుంది. టిక్కెట్టు ధర ఒక్కరికి రూ.9,500గా ఆర్టీసీ నిర్ణయించింది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి అల్పాహారం అందిస్తారు. టిక్కెట్టు కావాలనుకునేవారు శ్రీకాకుళం బస్సు డిపోలో సంప్రదించాలి. ఇతర వివరాలకు కోసం 9959225608, 9959225609 నంబర్లలో సంప్రదించాలి.
కాశీ ప్యాకేజీ..
మహాశివ రాత్రి సందర్భంగా వారణాసిలోని కాశీ విశ్వేశ్వరుని దర్శనం కోసం.. ఫిబ్రవరి 18న రాజమండ్రి డిపో నుంచి ప్రత్యేక బస్సు బయలుదేరుతుంది. ఈ యాత్ర 11 రోజులు పాటు 13 క్షేత్రాల మీదుగా సాగుతోంది. రాజమండ్రిలో బస్సు బయలుదేరి.. భువనేశ్వర్, పూరి, కోణార్క్, జాజ్‌పూర్, ప్రయాగ్‌రాజ్, కాశీ, అయోధ్య, సీతామడి, నైమిశారణ్యం, గయ, బుద్ధగయ, అరసవిల్లి, అన్నవరం మీదుగా రాజమండ్రి చేసుకుంటుంది.
టిక్కెట్టు ధర ఒక్కరికి రూ.12,800గా ఆర్టీసీ నిర్ణయించింది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి అల్పాహారం అందిస్తారు. తాగేందుకు వాటర్ కూడా ఇస్తారు. టిక్కెట్టు కావాలనుకునేవారు రాజమండ్రి బస్సు డిపోలో సంప్రదించాలి. మరిన్ని వివరాల కోసం 9502300189, 9966666544, 9866045588 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందూస్తాన్ టైమ్స్ తెలుగు)
టాపిక్