Best Web Hosting Provider In India 2024
Long Hair Tips: జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరగాలంటే హెయిర్ కట్ చేయించాల్సిందేనా? ఎన్ని రోజులకోసారి చేయించాలి?
Long Hair Tips: జుట్టు వేగంగా ఆరోగ్యంగా పెరగాలంటే అప్పుడప్పుడూ కత్తిరించుకుంటూ ఉండాలనే మాటలు వినే ఉంటారు. హెయిర్ కట్ చేయించుకోవడం వల్ల నిజంగానే జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరుగుతుందా? ఆరోగ్యకరమైన వెంట్రుకల ఎదుగుదలకు కటింగ్‌కూ ఉన్న సంబంధం ఏంటి తెలుసుకుందాం రండి.
పొడవైన, ఒత్తైన మరీ ముఖ్యంగా సొగసైన జుట్టు ప్రతి అమ్మాయి కల. అయితే ఇవి సులభంగా మాత్రం దక్కవు. ముఖంలాగే వెంట్రుకలకు కూడా సరైన సంరక్షణ అవసరం, లేకుంటే జుట్టు పాడైపోవడానికి ఎక్కువ సమయం పట్టదు. జుట్టు సంరక్షణలో సాధారణంగా మంచి షాంపూ, కండీషనర్, సీరం, మాస్క్, హెయిర్ ఆయిల్ వంటివి ఉంటాయి. కొంచెం అదనపు సంరక్షణ కోసం అనేక చికిత్సలు కూడా అందుబాటులో వచ్చాయి.
వీటన్నిటితో పాటు కొందరు అమ్మాయిలు తమ జుట్టును ఎప్పటికప్పుడు కత్తిరించుకుంటూ ఉంటారు అంటే ట్రిమ్ చేసుకుంటారు. అప్పుడప్పుడూ ఇలా జుట్టును కొసలు అంటే చివర్లను కత్తిరించడం వల్ల ఎదుగుదల వేగమవుతుందని నమ్ముతారు. హెయిర్ కట్ అనేది నిజంగానే జుట్టు ఎదుగుదలకు సహాయపడుతుందా? అలా అయితే ఎన్ని రోజులకు ఒకసారి ఇలా జుట్టును కత్తిరించుకోవాలి వంటి విషయాల గురించి తెలుసుకుందాం రండి..
జుట్టు పెరగాలంటే హెయిర్ కట్ తప్పకుండా చేయించాల్సిందేనా?
జుట్టును కొద్దిగా కత్తిరించుకుంటే వేగంగా, ఆరోగ్యంగా పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు. అందుకే అప్పుడప్పుడూ అయినా పార్లర్ కు వెళ్లి హెయిర్ కట్ లేదా హెల్తీ హెయిర్ ట్రిమ్మింగ్ చేయించుకుంటారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం అయితే ఇది కేవలం అనుమానమే. ఎందుకంటే జుట్టు కత్తిరింపుకు పెరుగుదలకు నేరుగా సంబంధం ఉందనే ఆధారాలు ఏం లేవు. కానీ తరచూ ఇలా హెయిర్ కట్ లేదా ట్రిమ్మింగ్ చేయించుకోవడం వల్ల కొన్నిప్రయోజనాలు మాత్రం ఉంటాయి.
హెయిర్ కట్ లేదా ట్రిమ్మింగ్ ప్రయోజనాలు:
1.స్టైల్‌లో మార్పు:
అప్పుడప్పుడూ హెయిర్ కట్ లేదా ట్రిమ్మింగ్ చేయించుకోవడం వల్ల మీ జుట్టు రూపంలో పాటు మీ స్టైల్ కూడా పూర్తిగా మారుతుంది, కొత్త లుక్ వస్తుంది. ఇది మీలో ఒక రకమైన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
2. పరిమాణంలో మార్పు:
హెయిర్ కట్ లేదా ట్రిమ్ చేయించుకుంటూ ఉండటం వల్ల మీ జుట్టుకు కొత్త వాల్యూమ్, షేప్, ,టెక్స్చర్ ను వస్తుంది. ఇది మీ ముఖం ,శరీరానికి అందమైన రూపాన్ని ఇస్తుంది.
3.నష్టాలను తొలగించుకోవచ్చు:
జుట్టును కత్తిరించుకోవడం వల్ల స్ప్లిట్ ఎండ్స్ సమస్య పెరగకుండా ఉంటుంది. వెంట్రుకల ఆరోగ్యాన్ని తిరిగి పొందచ్చు.ఆరోగ్యకరమైన, అందమైన జుట్టును మీ సొంతం చేసుకోవచ్చు.
ఎన్ని రోజులకు ఒకసారి హెయిర్ కట్ లేదా ట్రిమ్మింగ్ చేసుకోవాలి?
జుట్టు పొడవుగా పెరగడం విషయాన్ని పక్కక్కు పెడితే ఉన్నది ఊడిపోకుండా ఆరోగ్యంగా ఉండాలంటే మీరు తప్పనిసరిగా వెంట్రుకలను కత్తిరించుకోవాలి. అయితే, కొంతమంది ప్రతి నెల కొద్దిగా జుట్టును కత్తిరించుకుంటారు. దీనివల్ల జుట్టు మరింత ఆరోగ్యంగా ఉంటుందని వారు నమ్ముతారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రతి నెలా తప్పనిసరిగా హెయిర్ కట్ చేయించాల్సిన అవసరం అయితే లేదు. నెల నెలా కత్తిరించుకోవడం వల్ల వెంట్రుల ఆరోగ్యంలో పెద్ద మార్పు ఏమీ ఉండదు. జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కనీసం మూడు నుండి నాలుగు నెలలకు ఒకసారి కత్తిరించుకుంటే సరిపోతుంది. మీకు చివర్లు చిట్టిపోకుండా ఉంటే ఆరు నెలలకు ఒకసారి కత్తిరించుకున్నా ఏం పరవాలేదు.
సంబంధిత కథనం