Best Web Hosting Provider In India 2024
Max OTT Release Date: ఓటీటీ కంటే ముందే టీవీలోకి వస్తున్న కన్నడ సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ!
Max OTT Release Date: ఓటీటీ కంటే ముందే టీవీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మరో కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. కిచ్చా సుదీప్ నటించిన మ్యాక్స్ మూవీ గురించే మనం మాట్లాడుకుంటున్నది. ఈ మధ్యే ఉపేంద్ర యూఐ మూవీ విషయంలోనూ ఇవే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
Max OTT Release Date: కన్నడ మూవీస్ ఈ మధ్య ఓటీటీ కంటే ముందే శాటిలైట్ డీల్స్ కుదుర్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. వరుసగా రెండు సూపర్ హిట్ సినిమాలు ఓటీటీ రిలీజ్ కంటే ముందే టీవీ ప్రీమియర్ గురించి ప్రోమోలు రిలీజ్ చేయడం విశేషం. ఈ మధ్యే యూఐ మూవీ ఇలా చేయగా.. ఇప్పుడు కిచ్చా సుదీప్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ కూడా అదే రూట్లో వెళ్తున్నట్లు కనిపిస్తోంది.
ఓటీటీ కంటే ముందే టీవీలోకి మ్యాక్స్?
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్. గతేడాది క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లకుపైనే వసూలు చేసింది.
ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు షాక్ ఇస్తూ.. టీవీ ప్రీమియర్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేయడం విశేషం. జీ నెట్‌వర్క్ ఈ సినిమా శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది. దీంతో ఈ మధ్యే జీ కన్నడ ఛానెల్ మ్యాక్స్ టీవీ ప్రీమియర్ త్వరలోనే అంటూ ఓ ప్రోమో తీసుకొచ్చింది. ఇది చూసి ఫ్యాన్స్ షాక్ తిన్నారు.
మూవీ డిజిటల్ హక్కుల గురించి ఎలాంటి సమాచారం లేదు. జీ నెట్‌వర్క్ దగ్గర కేవలం శాటిలైట్ హక్కులే ఉన్నట్లు టీవీ ప్రీమియర్ ప్రోమో చూస్తే స్పష్టమవుతోంది. మరి మ్యాక్స్ మూవీ ఏ ఓటీటీలోకి వస్తుందో అన్న ఆసక్తి నెలకొంది.
యూఐ రూట్లోనే మ్యాక్స్?
ఈ మధ్యే ఉపేంద్ర నటించిన యూఐ మూవీ టీవీ ప్రీమియర్ కు సంబంధించిన ప్రోమోను కూడా జీ కన్నడ ఛానెల్ టెలికాస్ట్ చేసిన విషయం తెలిసిందే. యూఐకి సంబంధించి ఓటీటీ డీల్ గురించి ఎలాంటి సమాచారం లేదు. ఇప్పుడు మ్యాక్స్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ మధ్యకాలంలో ఏ సినిమా అయినా ఓటీటీలోకి వచ్చిన తర్వాతే శాటిలైట్ ఛానెల్లో టెలికాస్ట్ కు వస్తోంది.
కానీ ఈ రెండు భారీ బడ్జెట్ సినిమాలు మాత్రం ఓటీటీ గురించి అప్డేట్ ఇవ్వకుండా నేరుగా టీవీ ప్రీమియర్ పై ప్రోమో రిలీజ్ చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ మధ్య కాలంలో చాలా వరకు కన్నడ సినిమాల డిజిటల్ హక్కులు ప్రైమ్ వీడియోకే దక్కుతున్నాయి. యూఐ, మ్యాక్స్ విషయంలోనూ అదే జరిగి ఉంటుందని భావిస్తున్నా.. దీనిపై స్పష్టమైన సమచారం లేదు.
మ్యాక్స్ మూవీ స్టోరీ ఏంటంటే?
మ్యాక్స్ మూవీ కథ మొత్తం ఒక్క రాత్రిలోనే ఓ పోలీస్ స్టేషన్ నేపథ్యంలోనే సాగుతుంది. కథ పరంగా చూసుకుంటే సింపుల్ పాయింట్. సుదీప్‌కు మాస్ ఆడియెన్స్‌లో ఉన్న యాక్షన్ ఇమేజ్‌ను వాడుకుంటూ ఇంట్రెస్టింగ్ స్క్రీన్‌ప్లే, ట్విస్ట్‌లతో దర్శకుడు మ్యాజిక్ చేశాడు. ఒక్కో యాక్షన్ ఎపిసోడ్‌ను ఒక్కో రేంజ్‌లో చూపిస్తూ ప్రేక్షకులకు హై మూవ్‌మెంట్ ఇచ్చాడు. పోలీస్ స్టేషన్‌పై రౌడీలు ఎటాక్ చేసే సీన్స్… వాటిని సుదీప్ టీమ్ తిప్పికొట్టే సీన్స్ థ్రిల్లింగ్‌ను పంచుతాయి.
మ్యాక్స్ పాత్రలో కిచ్చా సుదీప్ స్టైలిష్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించాడు. యాక్షన్ ఎపిసోడ్స్‌లో అదరగొట్టాడు. తన మ్యానరిజమ్స్‌తో మెప్పించాడు. గ్యాంగ్‌స్టర్‌గా సునీల్ విలనిజం బాగుంది. పాజిటివ్‌గా కనిపించే నెగెటివ్ షేడ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో వరలక్ష్మి శరత్‌కుమార్ నటన ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచింది.
సంబంధిత కథనం