Cancer: ఈ బ్లాక్ ప్లాస్టిక్ బాక్సుల్లో బిర్యానీలు ఫుడ్ డెలివరీ చేస్తున్నారా? అవి క్యాన్సర్‌కి కారణం అవుతాయని తెలుసా?

Best Web Hosting Provider In India 2024

Cancer: ఈ బ్లాక్ ప్లాస్టిక్ బాక్సుల్లో బిర్యానీలు ఫుడ్ డెలివరీ చేస్తున్నారా? అవి క్యాన్సర్‌కి కారణం అవుతాయని తెలుసా?

Haritha Chappa HT Telugu
Feb 04, 2025 04:30 PM IST

Cancer: ఫుడ్ డెలివరీ యాప్‌లో అధికంగా వినియోగిస్తున్న వారు ఎక్కువ అవుతున్నారు. అయితే ఫుడ్ డెలివరీలో బ్లాక్ బాక్సులను వాడుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. ఆ బ్లాక్ బాక్స్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.

క్యాన్సర్ కారకాలు
క్యాన్సర్ కారకాలు

బిర్యానీలు, కర్రీలు ఆర్డర్ పెడితే చాలు నల్ల బాక్సుల్లో అవి ఇంటికి వచ్చేస్తాయి. అయితే ఇలాంటి నల్ల బాక్సులు వాడడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ కంటైనర్లను వాడడం వల్ల విషపూరిత రసాయనాలు ఆహారంలోకి లీక్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా ఈ నల్ల బాక్సుల్లో వేడి వేడి ఆహారాలు వేసినప్పుడు అవి క్యాన్సర్ కారకాలుగా మారే అవకాశం ఉన్నట్టు తెలియజేస్తున్నారు.

yearly horoscope entry point

ఇలాంటి నల్లని కంటైనర్లు, బాక్సులు, ట్రేలు, ప్లాస్టిక్ గిన్నెలు వంటివి… పాత ఎలక్ట్రానిక్స్ వస్తువులను రీసైకిల్ చేయడం ద్వారా తయారవుతాయి. దీనిలో విపరీతమైన రసాయనాలు ఉంటాయి. ఇవి మంట, నిరోధకతను కలిగి ఉంటాయి. కాబట్టి ఆహారంలోకి అవి కలిసిపోయే అవకాశం ఉంది. అంటే ఈ బాక్సుల్లో వేడి వేడి పదార్థాలు వేసినప్పుడు ఆ రసాయనాలు ఆహారాల్లో చేరిపోతాయి.

బ్లాక్ ప్లాస్టిక్ లో ఉండే రసాయనాలు

సైంటిఫిక్ జర్నీ కెమోస్పియర్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం 203 బ్లాక్ ప్లాస్టిక్ బాక్సులను విశ్లేషించారు. వీటిలో 85 శాతం విషపూరిత రసాయనాలు ఉన్నట్టు కనిపెట్టారు. ఇవి హార్మోన్ల వ్యవస్థను ఇబ్బందికి గురిచేస్తాయని చెబుతున్నారు. ఇది చివరకు క్యాన్సర్‌కు దారి తీసే అవకాశం ఉందని వివరిస్తున్నారు. బ్లాక్ ప్లాస్టిక్ లో బిపిఏ, థాలెట్లు వంటి పదార్థాలు ఉంటాయి. ఇవి హృదయ సంబంధ వ్యాధులకు, మధుమేహం, పునరుత్పత్తి వ్యవస్థలకు ఇబ్బంది పడతాయి. అనేక రకాల సమస్యలను సృష్టిస్తాయి.

బ్లాక్ ప్లాస్టిక్ తయారీ

సాధారణ ప్లాస్టిక్ ‌కు కార్బన్ బ్లాక్ అనే పదార్థాన్ని జోడించి ఈ నలుపు రంగు బాక్సులను తయారు చేస్తారు. అంటే ఈ నలుపు రంగు బాక్సులు మరింత సమ్మేళనాలను కలిగి ఉంటాయి. అంటే క్యాన్సర్ కారక లక్షణాలను కూడా అధికంగానే కలిగి ఉంటాయి. బ్లాక్ ప్లాస్టిక్ బాక్సుల్లోని ఆహారాన్ని పిల్లలకు తినిపించడం వల్ల వారికి నాడీ సంబంధిత ప్రభావాలు వచ్చే అవకాశం ఉంది. అభివృద్ధి ఆలస్యంగా జరగడం వంటివి కూడా కనిపిస్తాయి. ఈ నల్ల ప్లాస్టిక్ నుండి వచ్చే మైక్రో ప్లాస్టిక్‌లు ఆహారం, నీరు, గాలిలో కలిసిపోతాయి. ఇవి మానవ శరీరంలో చేరి ఇన్ఫ్లమేషన్ ను, ఆక్సీకరణ ఒత్తిడిని కలిగిస్తాయి. దీనివల్ల కణాల నష్టం కూడా జరుగుతుంది. ఇవి దీర్ఘకాలికంగా ఆరోగ్య ప్రభావాలను కలిగి ఉంటాయి.

నల్ల ప్లాస్టిక్ డబ్బాలు క్యాన్సర్ ను కలిగిస్తాయని చెప్పే ఆధారాలు నేరుగా లేనప్పటికీ వాటిలో ఉండే రసాయనాలు మాత్రం క్యాన్సర్ కారకాలని ఇప్పటికే అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ రసాయనాలు శరీరంలోని ఎండోక్రెయిన్ వ్యవస్థను దెబ్బతీస్తాయి. పునరుత్పత్తి ఆరోగ్య సమస్యలను పెంచేస్తాయి. కాబట్టి నల్ల ప్లాస్టిక్ డబ్బాల్లో వచ్చే ఆహారాలను తినకపోవడమే ఉత్తమం.

ఇంట్లో కూడా నల్ల ప్లాస్టిక్ డబ్బాల్లో ఆ వేడి వేడి ఆహారాన్ని నిల్వ చేయడం వంటివి మానుకోవాలి. అలాగే మైక్రోవేవ్ ఓవెన్ లో నల్లటి ప్లాస్టిక్ లో ఆహారాన్ని వేయించడం వంటివి చేయకూడదు. విషపూరిత రసాయనాలు ఆహారంలో కలిసి ఆరోగ్య ప్రమాదాలకు కారణం అవుతాయి. ఇవి మూత్రపిండాలను కూడా విషపూరితం చేస్తాయి. థైరాయిడ్ వ్యవస్థను దెబ్బతీస్తాయి.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024