Best Web Hosting Provider In India 2024
04 Feb 2025 5:25 PM
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉన్న సీనియర్ నాయకులతో వైయస్ జగన్ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ భేటీలో వైయస్ఆర్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, కురసాల కన్నబాబు, కొట్టు సత్యనారాయణ, విడదల రజని, జోగి రమేష్, మాజీ ఎమ్మెల్యేలు ప్రసాదరాజు, కోన రఘుపతి తదితరులు పాల్గొన్నారు.