Valentines Day 2025: ప్రేమికుల రోజున మీ లవర్‌కు గులాబీలు ఇస్తున్నారా? పువ్వుల సంఖ్యను బట్టి అర్థం మారుతుందట!

Best Web Hosting Provider In India 2024

Valentines Day 2025: ప్రేమికుల రోజున మీ లవర్‌కు గులాబీలు ఇస్తున్నారా? పువ్వుల సంఖ్యను బట్టి అర్థం మారుతుందట!

Ramya Sri Marka HT Telugu
Feb 04, 2025 08:30 PM IST

Valentines Day 2025: వాలెంటైన్స్ డే రోజున తమ ప్రియుడు లేదా ప్రేయసికి గులాబీలతో శుభాకాంక్షలు తెలపాలనుకుంటారు. అభినందనలు తెలిపే సమయంలో రోజే కాదు గులాబీల సంఖ్య కూడా ప్రత్యేకమేనట. మొదటి సంఖ్య నుంచి 24 గులాబీల వరకూ ఉన్న అర్థమేమిటో ఓ సారి గమనిద్దాం.

ప్రేమికుల రోజున పువ్వుల సంఖ్యను బట్టి అర్థం మారుతుందట!
ప్రేమికుల రోజున పువ్వుల సంఖ్యను బట్టి అర్థం మారుతుందట! (shutterstock)

ప్రేమించే మనస్సున్న ప్రతి ఒక్క హృదయానికి వాలెంటైన్స్ డే ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. తమ బిజీ షెడ్యూల్ నుండి కొంత సమయాన్ని కేటాయించుకుని తమ భాగస్వామితో/ ప్రియమైన వారితో హృదయపూర్వకంగా సమయం గడపడానికి ఆసక్తి కనబరుస్తాం. ఈ ప్రత్యేక రోజున, ప్రేమికులు తమ మనస్సును వ్యక్తపరచడానికి గులాబీలను కచ్చితంగా ఉపయోగిస్తారు. గులాబీ రంగులు ఒక్కొక్కటి ప్రత్యేకమైన అర్థం కలిగి ఉంటుందని నమ్ముతారు. అలాగే శుభాకాంక్షలు తెలిపేందుకు వినియోగించే గులాబీల సంఖ్యను బట్టి కూడా అభిమానాన్ని తెలియజేయొచ్చట. అదెలాగో తెలుసుకుందామా!

yearly horoscope entry point

1 గులాబీ ఇస్తే..

వాలెంటైన్స్ డే రోజున మీ భాగస్వామికి ఒక గులాబీ ఇవ్వడం అంటే, మీరు వారిని తొలి చూపులోనే ప్రేమించేశారని అర్థం. ఇక గులాబీ వారికి ఇవ్వడం వెనుక, వారితో బంధంలోకి అడుగు పెట్టాలనుకుంటున్నారని తెలియజేస్తున్నట్లుగా అవుతుంది.

2 గులాబీలు ఇస్తే..

మీరిద్దరూ పరస్పరం ప్రేమించుకుంటున్నట్లు ముందుగానే కన్ఫామ్ అయితే రెండు గులాబీలు ఇస్తారు. అలా ఒకరికొకరు వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు తెలుపుకుంటారు.

3 గులాబీలు ఇస్తే..

ఒకటి కాదు, రెండు కాదు, మూడు గులాబీలు ఇవ్వాలనుకుంటే దానికి అర్థం మీరు ఇప్పటికే ప్రేమలో ఉండి, ప్రేమికుల రోజును మరోసారి జరుపుకుంటున్నట్లు అర్థం వస్తుంది.

4 గులాబీలు ఇస్తే..

నాలుగో నెంబర్ అంటే లాక్ వేసినట్లుగా అర్థం వస్తుంది. మీరిద్దరు మాత్రమే నాలుగు కాలల పాటు కలిసి ఉండాలనుకుంటున్నట్లు భావం వస్తుంది. మీ ఇద్దరి మధ్య ప్రేమ బంధం చాలా బలంగా ఉండి, దానికి మరొకరికి చోటు ఇవ్వడానికి రెడీగా లేరని భావం.

5 గులాబీలు ఇస్తే..

వాలెంటైన్స్ డే రోజున మీరు ఐదు గులాబీలు ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే, దానికి అర్థం మీ భాగస్వామి పట్ల మీకు ప్రేమతో పాటు శ్రద్ధ కూడా ఉందని వ్యక్తమవుతుంది.

6 గులాబీలు ఇస్తే..

వాలెంటైన్స్ డే రోజున ఆరు గులాబీలు ఇవ్వడంలో అసలైన మజా ఉంటుంది. ఆరు గులాబీలతో చేసిన పూలగుత్తిని స్కూల్, కాలేజీ లేదా ఆఫీసులోని క్రష్‌కు అభినందనలు తెలియపరచడానికి ఉపయోగిస్తారు.

9 గులాబీలు ఇస్తే..

మీ లోపలి భావాలను, సంతోషాన్ని ఎల్లప్పుడూ కొనసాగించుకోవడానికి ఇది ఒక మంచి ఆప్షన్. వాలెంటైన్స్ డే రోజున మీరు మీ భాగస్వామికి ఇదే విషయాన్ని 9 గులాబీలు ఇచ్చి తెలియజేయవచ్చు. జీవితకాలం పాటు ఇదే ప్రేమతో, స్నేహంతో ఉండాలని కోరుకుంటున్నానని, వారికి 9 గులాబీలను బహుమతిగా ఇచ్చి తెలియపరచండి.

12 గులాబీలు ఇస్తే..

మీరిద్దరిలో ఒకరినొకరు విడిచి ఉండలేమని చెప్పడానికి 12 గులాబీలు ఇవ్వండి. మీ భాగస్వామితో మీ మనస్సులోని భావాలను పంచుకుంటూ, ‘నీవు ఎల్లప్పుడూ నాతో ఉండు’ అని చెప్పడానికి, వారికి 12 గులాబీలను అందించండి.

24 గులాబీలు ఇస్తే..

ఇది భారీ సంఖ్యే. నిజంగానే పూల సంఖ్యకు తగ్గట్టుగానే 24 గులాబీలను వారికి ఇచ్చేందుకు మీరు సిద్ధమయ్యారంటే, దానికి “ఈ జన్మ నీ కోసమే” తెలియపరిచే అర్థం వస్తుంది. జన్మంతా తన ప్రేమ కావాలనుకుంటే, ఆలస్యం చేయకండి. 24 గులాబీల పూల గుత్తిని వారికి అందించి హ్యాపీ వాలెంటైన్స్ డే అని చెప్పేయండి.

ఇవన్నీ చేయడానికి కంటే ముందు లేదా తర్వాత ఎన్ని పూలు ఇస్తే, ఎలాంటి అర్థం వస్తుందో అనే విషయాన్ని వారికి తెలియజేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024