Best Web Hosting Provider In India 2024
Krishna Viral News : తల్లి బతికుండగానే పెద్దకర్మ భోజనాలు, వింత కోరిక తీర్చిన కొడుకులు
Krishna Viral News : కృష్ణా జిల్లా ముచ్చర్లలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఊరంతటినీ పిలిచి ఎంతో ఘనంగా..తల్లి బతికుండగానే పెద్ద కర్మ భోజనాలు పెట్టారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే…తల్లే ఇలా భోజనాలు పెట్టమని కోరింది.
Krishna Viral News : బతికుండగానే ఏదైనా…చచ్చాక నేను చూస్తానా? అంటుంటారు ఊళ్లలో వృద్ధులు. కృష్ణా జిల్లాకు చెందిన ఓ వృద్ధురాలికి వింత కోరిక పుట్టింది. ఆస్తులన్నీ కొడుకులకు పంచేసి…తన చివరి కోరిక తీర్చాలని కోరింది. తాను బతికుండగానే పెద్దకర్మ భోజనాలు పెట్టాలని కొడుకులను పట్టుబట్టింది. చివరకు తన మాట నెగ్గించుకుని…ఊరంతటినీ పిలిచి భోజనాలు పెట్టించుకుంది. ఈ వింత ఘటన కృష్ణా జిల్లా పెడన మండలం ముచ్చర్లలో చోటుచేసుకుంది.
వృద్ధురాలి వింత కోరిక
ముచ్చర్లలో ఇద్దరు కొడుకులు తల్లి బతికి ఉండగానే పెద్దకర్మ కార్యక్రమం చేశారు. అయితే తల్లే కావాలని కొడుకులతో పెద్ద కర్మ భోజనాలు పెట్టాలని కోరింది. మొదట కొడుకులు ఒప్పుకోలేకపోయినా…. తల్లి ఒత్తిడితో చివరికి ఆమె కోరికను తీర్చారు.
ముచ్చర్లకు చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు రంగమ్మ… తన ఆస్తులు అన్నింటినీ కొడుకులకు పంచేసింది. చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. కోట్ల ఆస్తులుంటేనే కొడుకులు చివరి కార్యక్రమాలు చేయడంలేదు. ఇలాంటి సమయంలో తాను చనిపోతే తన కొడుకులు ఏం చేస్తారు, కనీసం పెద్ద కర్మ అయినా చేస్తారా? భోజనాలు పెడతారా? అనే డౌట్ రంగమ్మకు వచ్చింది. కొడుకులను పిలిచి తన పెద్ద కర్మ భోజనాలు పెట్టాలని కోరింది. దీంతో షాక్ తిన్న కొడుకులు మొదట ఒప్పుకోలేదు. రంగమ్మ పట్టుబట్టడంతో ఊరందరినీ పిలిచి భోజనాలు పెట్టారు.
ఘనంగా పెద్ద కర్మ భోజనాలు
బంధువులు, స్నేహితులు, ఊరందరినీ పిలిచి రంగమ్మ పెద్ద కర్మ భోజనాలు పెట్టారు కొడుకులు. తల్లి బతికి ఉండగానే ఇదేం పని అని ముందు తిట్టుకున్న జనం…ఇదందా రంగమ్మ పని అని తెలుసుకుని ముక్కున వేలేసుకున్నారు. పెద్ద కర్మ రోజు ఎలాంటి భోజనాలు అచ్చం అలాగే భోజనాలు ఏర్పాటుచేశారు. ఆ తల్లి రంగమ్మ కళ్ల ముందే అందరికీ వడ్డించారు. తన పెద్దకర్మ భోజనాలు కళ్లారా చూసిన రంగమ్మ హుషారుగా అందరినీ పలకరించింది. ఇదేమి చోద్యం అంటూ భోజనానికి వచ్చిన వాళ్లంతా నోరెళ్లబెట్టారు.
అయితే తల్లిదండ్రుల శవాలు ఇల్లు దాటకముందే ఆస్తులు కోసం కొట్టుకునే కొడుకులు ఉన్న ఈ రోజుల్లో…తల్లి అడిగిన వింత కోరికను తీర్చిన కొడుకులను మెచ్చుకుంటున్నారు జనం. రంగమ్మ వింత కోరిక మాత్రం స్థానికంగా హాట్ టాఫిక్ అయ్యింది.
సంబంధిత కథనం
టాపిక్