Best Web Hosting Provider In India 2024
Income Tax Limit: ఆదాయ పన్ను పరిమితి పెంపుతో లక్ష కోట్ల నష్టం.. ఎలా భర్తీ చేస్తారని ప్రశ్నించిన సీపీఎం
Income Tax Limit: ఆదాయ పన్ను పరిమితి లక్ష కోట్లకు పెంచడంతో ఏర్పడే లక్ష కోట్ల నష్టాన్ని ఎలా పూరిస్తారో కేంద్రం సమాధానం చెప్పాలని తెలంగాణ సీపీఎం డిమాండ్ చేసింది. ఉదారవాద విధానాలకు కొనసాగింపుగా ఆదాయ పన్ను పరిమితిని పెంచారని ఆరోపించారు.
Income Tax Limit: బడ్జెట్లో వేతన జీవులకు ఊరటనిచ్చేలా రూ. 12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు వల్ల ఏర్పడే లక్ష కోట్ల నష్టాన్ని ఎలా పూరిస్తారో కేంద్రం ప్రకటించాలని సీపీఎం డిమాండ్ చేసింది.
దేశంలో అమలవుతున్న నయా ఉదారవాద విధానాల కొనసాగింపుగానే కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు అన్నారు. మంగళవారం సంగారెడ్డిలోని కేవల కిషన్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
బడ్జెట్‌లో ప్రైవేట్ పెట్టుబడులకు పెద్దపీట వేశారని ఆన్నారు. క్రోని క్యాపిటలిజం కొద్దిమంది సంపన్నులే శతకోటీశ్వర్లు అవుతున్నారని పేర్కోన్నారు. ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచేందుకు బడ్జెట్లో ఎలాంటి ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు లేవన్నారు.
మధ్యతరగతి కుటుంబాలకు 12 లక్షల వరకు ఆదాయ పన్ను మినాయింపు ఇవ్వడం వల్ల కొంత ప్రయోజనం చేకూరినప్పటికీ దానివల్ల కేంద్ర ప్రభుత్వానికి ఒక లక్ష కోట్ల ఆదాయం తగ్గనుందన్నారు. ఆ లోటు ఆదాయాన్ని కార్పొరేట్లకు పన్ను విధించడం ద్వారా సమకూర్చుకోవాల్సి ఉండగా కేంద్ర ప్రభుత్వం అలాంటి ప్రయత్నం ఏమి చేయలేదన్నారు.
సంక్షేమ పథకాలకు కోత విధించే అవకాశం ….
ఫలితంగా సంక్షేమ పథకాలకు కోత విధించే దిశగా కేంద్రం అడుగులు వేస్తుందని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా చమురు మునిసరకు ధరలు 50% తగ్గినప్పటికీ దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు మాత్రం ఏ మాత్రం తగ్గకపోగా పైపెచ్చు పెంచుకుంటూ పోతున్నారన్నారు.
బడ్జెట్లో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గింపు గురించి ఎలాంటి ప్రస్తావన చేయకపోవడం దేశ ప్రజలకు తీరని నష్టం చేకూరుస్తుందని అన్నారు. కార్మికులకు 26వేల కనీస వేతనం గ్యారంటీ చేస్తే ప్రజల కొనుగోలు శక్తి పెరిగి మార్కెట్లో సరుకుల క్రయవిక్రయాలు పెరుగుతాయని తద్వారా ఆర్థిక సంక్షోభం అధిగమించేందుకు అవకాశం ఏర్పడుతుందని తెలిపారు.
జిడిపి శ్రామికుల శ్రమశక్తి బలమైన కారణమని ఆయన వివరించారు కార్మికుల రైతులు శ్రామికులు సంపదలను సృష్టిస్తుంటే జిడిపి పెరుగుతుందని అన్నారు. వారికి బడ్జెట్లో ఎలాంటి సంక్షేమానికి సంబంధించిన ప్రయోజనాలు చేకూర్చడానికి కేంద్రం ఇష్టపడలేదని ఆరోపించారు.
పార్టీ ప్రాయింపులపై స్పీకర్ నిర్లక్షం తగదు
ప్రజా ప్రతినిధులు ఏ పార్టీపై గెలుస్తున్నారో ఏ పార్టీలో చేరిపోతున్నారు ప్రజలకు అర్థం కాని అయోమయ పరిస్థితి నెలకొందన్నారు బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు పలువురు కాంగ్రెస్లో చేరిపోయారని వారి పైన చర్యలు తీసుకునే విషయంలో స్పీకర్ రాజకీయ నిర్ణయాలకు తావివ్వడం వల్లనే తీవ్ర జాప్యం జరిగిందని అన్నారు.
హైకోర్టు జోక్యం చేసుకొని స్పీకర్‌ను చర్యలు తీసుకోవాలని చెప్పినప్పటికీ పట్టించుకోలేదన్నారు సుప్రీంకోర్టు సైతం అదే విషయాన్ని ఇటీవల నొక్కి చెప్పిందని గుర్తు చేశారు రాష్ట్ర శాసనసభ స్పీకర్ తక్షణమే రాజ్యాంగపరమైన విధుల్ని నిర్వహించి పార్టీ ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తుందని తెలిపారు.
విభజన చట్టాల అమలులోప్రజా ప్రతినిధుల వైఫల్యం.…
తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ యువజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయించడంలో ఘోరంగా వైఫల్యం చెందారని చుక్కా రాములు విమర్శించారు. రైల్వేలు కానీ ఇతర ప్రాజెక్టులో కేటాయింపు లేకపోవడం వల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందన్నారు.
విభజన చట్టంలో హామీలు ఇచ్చి 15 సంవత్సరాలు గడుస్తున్నా వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ వచ్చాయన్నారు. బిజెపికి రాజకీయ స్వార్థం తప్ప తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి ఇష్టం లేదని విమర్శించారు కాంగ్రెస్ బిజెపిలో పరస్పరం రాజకీయ విమర్శలకే పరిమితమై ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని అన్నారు.
టాపిక్