Best Web Hosting Provider In India 2024
Sweden School Shooting : స్వీడన్‌లోని ఓ పాఠశాలలో కాల్పుల కలకలం.. 10 మంది మృతి
Sweden School Shooting : స్వీడన్‌లోని ఒరెబ్రో నగరంలోని ఒక పాఠశాలలో విచక్షణారహితంగా కాల్పులు జరిపిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో దాదాపు 10 మంది మరణించగా, చాలా మంది గాయపడ్డారు.
స్వీడన్‌లోని ఒరెబ్రో నగరంలోని ఒక పాఠశాలలో కాల్పుల కలకలం రేగింది. ఈ ఘటనలో 10 మంది మరణించారు. చాలా మంది గాయపడ్డారు. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటన తర్వాత పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఈ ఘటనలో అనుమానితుడు కూడా మరణించినట్టుగా పోలీసులు చెబుతున్నారు. కాల్పుల ఘటనతో ఒర్రెబోలోని పాఠశాల ఉన్న ప్రాంతమంతా ఉలక్కి పడింది. వెంటన భద్రతా బలగాలు చేరుకుని సహాయక చర్యలు మెుదలుపెట్టాయి.
దాడి చేసిన వ్యక్తికి ఏ సంస్థతోనూ సంబంధం ఉందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో జరిగింది. దీని కారణంగా ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది. ఈ కాల్పుల్లో 10 మంది గాయపడ్డారు.
దర్యాప్తు, భద్రతా పనులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండటానికి పాఠశాల దగ్గరకు వెళ్లవద్దని పోలీసులు స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఓరెబ్రో నగరాన్ని సాధారణంగా ప్రశాంతమైన, సురక్షితమైన ప్రదేశంగా పరిగణిస్తారు. అయితే ఈ సంఘటన ఆ ప్రాంతంలో భయానక వాతావరణాన్ని సృష్టించింది. స్వీడన్ చరిత్రలోనే అతిపెద్ద ఘటనలో ఒకటని చెబుతున్నారు. అడల్ట్ స్కూల్‌లో ఈ ఘటన జరిగింది. ఇక్కడ 20 ఏళ్ల పైబడినవారికి పాఠాలు బోధిస్తారు.
స్వీడిష్ హెరాల్డ్ ప్రకారం.. ఒరెబ్రో స్థానిక పోలీసు చీఫ్ రాబర్టో ఫారెస్ట్ మాట్లాడుతూ నష్టం చాలా ఎక్కువగా ఉన్నందున మేం ఈ సమయంలో మరింత సమాచారం ఇవ్వలేమని అన్నారు. మృతుడి గుర్తింపును నిర్ధారించే పనిలో ఉన్నారు. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో ఇది ఉగ్రవాద దాడి అని తేలిందన్నారు. ఒకే వ్యక్తి దాడి చేశాడని పోలీసులు భావిస్తున్నారు. అతనికి ఏ సంస్థతోనూ సంబంధం ఉందో ఇంకా వెల్లడి కాలేదు.
బీబీసీ కథనం ప్రకారం.. స్వీడన్‌లోని ఒరెబ్రోలోని క్యాంపస్ రిస్‌బర్గ్స్కా స్కూల్‌లో కాల్పులు జరిగాయి. మొదట మేం కొన్ని బుల్లెట్ల శబ్దం విన్నామని పాఠశాల ఉపాధ్యాయులు కొందురు చెబుతున్నారు. ఆ తర్వాత కొంత సమయం తర్వాత కాల్పులు తీవ్రమయ్యాయని అన్నారు.
ఒరెబ్రో నగరం స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్ నుండి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. చాలా మంది విద్యార్థులు పాఠశాలలో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగిందని చెబుతున్నారు. ఈ దాడిలో విద్యార్థులు గాయపడ్డారా లేదా అనేది ప్రస్తుతం స్పష్టంగా తెలియదు. దాడి వెనుక కారణం కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Best Web Hosting Provider In India 2024
Source link