Bollywood OTT: స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన కీర్తి సురేష్ బాలీవుడ్ డెబ్యూ మూవీ – ఎందులో స్ట్రీమింగ్ అంటే?

Best Web Hosting Provider In India 2024

Bollywood OTT: స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన కీర్తి సురేష్ బాలీవుడ్ డెబ్యూ మూవీ – ఎందులో స్ట్రీమింగ్ అంటే?

Nelki Naresh Kumar HT Telugu
Feb 05, 2025 06:18 AM IST

Bollywood OTT: కీర్తి సురేష్ బాలీవుడ్ డెబ్యూ మూవీ బేబీ జాన్ స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చింది. బుధ‌వారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్రీ స్ట్రీమింగ్ కాకుండా రెంట‌ల్ విధానంలో ఈ బాలీవుడ్ మూవీ రిలీజైంది. తేరీ రీమేక్‌గా తెర‌కెక్కిన బేబీ జాన్‌లో వ‌రుణ్ ధావ‌న్ హీరోగా న‌టించాడు.

బాలీవుడ్ ఓటీటీ
బాలీవుడ్ ఓటీటీ

Bollywood OTT: బేబీ జాన్ మూవీతో బాలీవుడ్‌లో తొలి అడుగు వేసింది కీర్తి సురేష్‌. త‌మిళ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ తేరీ రీమేక్‌గా తెర‌కెక్కిన బేబీ జాన్ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. స‌డెన్‌గా ఈ మూవీ ఓటీటీలోకి వ‌చ్చింది. బుధ‌వారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది. ఫ్రీ స్ట్రీమింగ్ కాకుండా రెంట‌న్ విధానంలో విడుద‌ల‌చేశారు. వాలెంటైన్స్ డే నుంచి ఫ్రీ స్ట్రీమింగ్‌కు బేబీ జాన్ మూవీ అందుబాటులోకి రానున్న‌ట్లు స‌మాచారం.

yearly horoscope entry point

కీర్తి సురేష్‌, వామికా గ‌బ్బి…

బేబీ జాన్ మూవీలో వ‌రుణ్ ధావ‌న్ హీరోగా న‌టించాడు. కీర్తి సురేష్‌తో పాటు వామికా గ‌బ్బి మ‌రో హీరోయిన్‌గా క‌నిపించింది. జాకీ ష్రాఫ్ విల‌న్ రోల్ చేశాడు. క‌లీస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ డిసెంబ‌ర్ నెలాఖ‌రున థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది.

స‌ల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్‌…

స‌ల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేయ‌డం, ప్ర‌మోష‌న్స్ భారీగా నిర్వ‌హించ‌డంతో పాటు టీజ‌ర్‌, ట్రైల‌ర్ ఆక‌ట్టుకోవ‌డంతో బేబీజాన్‌పై రిలీజ్‌కు ముందు బాలీవుడ్‌లో భారీగా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. కానీ కాన్సెప్ట్ ఔట్‌డేటెడ్ కావ‌డం, యాక్ష‌న్ త‌ప్ప ఎమోష‌న్స్ స‌రిగ్గా వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డంతో డిజాస్ట‌ర్‌గా మిగిలింది. తేరీలోని మ్యాజిక్‌ను రీక్రియేట్ చేయ‌డంలో డైరెక్ట‌ర్ ఫెయిల‌య్యాడు.

180 కోట్ల బ‌డ్జెట్‌…

180 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ అర‌వై కోట్ల లోపే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. గ‌త ఏడాది బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్స్‌లో ఒక‌టిగా బేబీ జాన్ నిలిచింది. డెబ్యూ మూవీతోనే బాలీవుడ్‌లో హిట్టు కోట్టాల‌నే కీర్తి సురేష్ ఆశ‌లు తీర‌లేదు. ఈ బాలీవుడ్ మూవీకి తేరీ డైరెక్ట‌ర్ అట్లీ ఓ ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించాడు. బేబీ జాన్ మూవీకి త‌మ‌న్ మ్యూజిక్ అందించాడు.

బేబీ జాన్ క‌థ ఇదే…

జాన్ డిసిల్వ అలియాస్ బేబీ జాన్ (వ‌రుణ్ ధావ‌న్‌) కేర‌ళ‌లో ఓ బేక‌రీ న‌డుపుకుంటూ బ‌తుకుతుంటాడు. కూతురు ఖుషి త‌ప్ప అత‌డికి ఎవ‌రు ఉండ‌రు. తార (వామికా గ‌బ్బి) అనే యువ‌తి కార‌ణంగా బేబీ జాన్ ఒక‌ప్పుడు ముంబైలోని రౌడీల‌ను గ‌డ‌గ‌డ‌లాడించిన ఐపీఎస్ ఆఫీస‌ర్ స‌త్య అనే నిజం బ‌య‌ట‌ప‌డుతుంది. ముంబైకి చెందిన స‌త్య త‌న పేరు మార్చుకొని కేర‌ళ‌లో ఎందుకు సెటిల‌య్యాడు? అత‌డి భార్య మీరా (కీర్తి సురేష్‌) ఏమైంది? నానాజీకి స‌త్య‌కు ఉన్న గొడ‌వ‌లు ఏమిటి? స‌త్య లైఫ్‌లోకి ఏజెంట్ భాయ్ జాన్ ఎందుకొచ్చాడు అన్న‌దే బేబీ జాన్ మూవీ క‌థ‌.

వెబ్‌సిరీస్‌…

బేబీ జాన్ త‌ర్వాత హిందీలో అక్క పేరుతో ఓ వెబ్‌సిరీస్ చేస్తోంది కీర్తి సురేష్‌. పీరియాడిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సీరియ‌ల్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇటీవ‌ల ఈ సిరీస్ ఫ‌స్ట్ లుక్ వీడియో టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు. ఈ వెబ్‌సిరీస్‌లో కీర్తి సురేష్‌తో పాటు రాధికా ఆప్టే మ‌రో కీల‌క పాత్ర పోషిస్తోంది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024