Heart Health: మీరు ఎక్కువగా తినే ఈ ఆహారాలు మీ గుండెకు హాని చేస్తాయని చెబుతున్న హార్వర్డ్ అధ్యయనం

Best Web Hosting Provider In India 2024

Heart Health: మీరు ఎక్కువగా తినే ఈ ఆహారాలు మీ గుండెకు హాని చేస్తాయని చెబుతున్న హార్వర్డ్ అధ్యయనం

Haritha Chappa HT Telugu
Feb 05, 2025 07:00 AM IST

Heart Health: గుండె ఆరోగ్యానికి కొన్ని రకాల ఆహారాలు తినాలి. కొన్ని రకాల ఆహారాలను తినకుండా దూరం పెట్టాలి. హార్వర్డ్ యూనివర్శిటీ తాజా అధ్యయనం ప్రకారం రెండు రకాల ఆహారాలు గుండె ఆరోగ్యానికి మంచిది కాదు.ఈ ఆహారాలు గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయి.

గుండెకు హాని చేసే ఆహారాలు
గుండెకు హాని చేసే ఆహారాలు (Pixabay)

ఏటా ఎంతో మంది గుండె పోటుతో మరణిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా యువతలో కూడా గుండె పోటు సమస్యలు ఎక్కువైపోతోంది. ఆరోగ్యంగా కనిపిస్తున్న వారు కూడా హఠాత్తుగా గుండెపోటుతో మరణిస్తున్న సంఘటనలు జరుగుతున్నాయి. సైలెంట్ కిల్లర్ లా గుండెపోటు వచ్చి ప్రాణాలు తీస్తోంది. అందుకే ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ తమ గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. హార్వర్డ్ అధ్యయనం ప్రకారం రెండు రకాల ఆహారాలు గుండెకు హాని చేస్తాయి. వాటిని దూరం పెట్టాల్సిన అవసరం అందరికీ ఉంది.

yearly horoscope entry point

గుండె ఆరోగ్యానికి ప్రమాదకరమైన ఆహారాలు

చక్కెర కంటెంట్, సోడా కంటెంట్, ప్రాసెస్ చేసిన మాంసాలు, కూల్ డ్రింక్స్ వంటివి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. చక్కెర కంటెంట్ అధికంగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల గుండె, రక్త నాళాలలో దీర్ఘకాలిక మంటకు దారితీస్తుంది. అదేవిధంగా ప్రాసెస్ చేసిన మాంసాన్ని తరచుగా తినడం వల్ల గుండె ఆరోగ్యం మరింత దిగజారుతుంది. వీటితో పాటు, ధూమపానం గుండె ఆరోగ్యానికి హానికరం.

హార్వర్డ్ కు చెందిన డిహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు మూడు దశాబ్దాల పాటు 200,000 మందికి పైగా అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారపు అలవాట్లను అధ్యయనం చేశారు. వారికి గుండె జబ్బులు లేదా స్ట్రోక్ అభివృద్ధి చెందిందో లేదో తెలుసుకోవడానికి. ఈ సందర్భంలో, చక్కెర పానీయాలు, ప్రాసెస్ చేసిన మాంసం తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుందని కనిపెట్టారు.

హార్వర్డ్ అధ్యయనం వివరాలు ది లాన్సెట్ జర్నల్లో ప్రచురితమయ్యాయి.కొన్ని ఆహారాలలో అదనపు కేలరీలు, చక్కెర, సోడియం, అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అలాంటి ఆహారాల వివరాలు ఇక్కడ ఉన్నాయి.

  • శుద్ధి చేసిన పిండి (మైదా)తో చేసిన బ్రెడ్
  • సాస్ లు, స్ప్రెడ్ లు, మసాలా దినుసులు
  • ప్యాకేజ్‌డ్ స్వీట్స్
  • ప్యాక్ చేసిన స్నాక్స్
  • చక్కెర నిండిన తియ్యటి పానీయాలు
  • ప్రాసెస్ చేసిన ఎర్ర మాంసం, పౌల్ట్రీ, చేపలు
  • తినడానికి సిద్ధంగా ఉన్న ఆహారాలు
  • పెరుగు/ పాల ఆధారిత స్వీట్లు
  • ఆల్కహాల్
  • శీతల పానీయాలు

అధ్యయనంలో పాల్గొన్న వారిలో కొందరు రోజూ బ్రెడ్‌లు, స్వీట్లు, రెడీ టు ఈట్ ఫుడ్ తింటున్నారని తేలింది. అలాంటివారే అధికంగా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. ధాన్యం ఆహారాలు, పెరుగు, పాల ఆధారిత వంటకాలు గుండెకు పెద్దగా ప్రమాదాన్ని కలిగించవని కనుగొన్నారు.

మైదాతో చేసిన ఆహారాలు, కూల్ డ్రింక్స్, కొవ్వు నిండిన మాంసాలు, పంచదారతో చేసిన ఆహారాలు పూర్తిగా దూరంగా ఉండడం మంచిది. జున్ను, ప్యాకేజ్డ్ ఫుడ్, రెడీ టు ఈట్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్, బేకరీ ప్రొడక్ట్స్, సోడా, స్పోర్ట్స్ డ్రింక్స్, చిప్స్, కుకీస్, పిజ్జా, మీరు రోజూ బర్గర్లు, పాస్తా, ఐస్ క్రీం, కేకులు మొదలైనవి తినే వ్యక్తులు గుండె విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024