Best Web Hosting Provider In India 2024
Hyderabad : ఎల్బీ నగర్ లో విషాదం – సెల్లార్‌లో కూలిన మట్టి దిబ్బలు, ముగ్గురు మృతి
Wall Collapsed in LB Nagar : హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. సెల్లార్ తవ్వకాల్లో మట్టి దిబ్బలు కుప్పకూలటంతో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి గాయపడ్డాడు.
ఎల్బీ నగర్ లో గోడ కూలి ముగ్గురు కూలీలు మృతి
మట్టి దిబ్బలు కుప్పకూలి ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ లో జరిగింది. ఓ హోటల్ భవనం సెల్లార్ తవ్వకాల్లో మట్టి దిబ్బలు కూలటంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులను బిహార్ కూలీలుగా గుర్తించారు. మరో కార్మికుడు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
టాపిక్
Telangana NewsHyderabadCrime News
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.