Best Web Hosting Provider In India 2024
NNS 5th February Episode: అంజు మెడలో రణ్‌వీర్ చెయిన్.. అమర్ షాక్.. కోల్‌కతాకు రణ్‌వీర్, మనోహరి.. అంజు కూడా..!
NNS 5th February Episode: నిండు నూరేళ్ల సావాసం బుధవారం (ఫిబ్రవరి 5) ఎపిసోడ్లో అంజు మెడలో చెయిన్ వేస్తాడు రణ్‌వీర్. అది చూసి అమర్ షాక్ తింటాడు. మరోవైపు అంజుని తనతోపాటు కోల్‌కతాకు తీసుకెళ్లడానికి రణ్‌వీర్ కొత్త ప్లాన్ వేస్తాడు.
NNS 5th February Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (ఫిబ్రవరి 5) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అంజు మెడలో ఉన్న చెయిన్ కు ఏదైనా స్పెషాలిటీ ఉందా అని అమర్‌ని అడుగుతుంది మిస్సమ్మ. అదేం లేదని అమర్ అనగానే.. నాకెందుకో ఇది మామూలు చెయిన్ అనిపించడం లేదు. దానికి ఏదో స్పెషాలిటీ ఉందేమో అనిపిస్తుంది అంటుంది. అమర్ షాక్ అవుతాడు.
ప్లాన్ మార్చిన రణ్‌వీర్
సోఫా పక్కనే దాక్కున్న ఆరు.. మిస్సమ్మ తెలిసి అడుగుతుందా..? తెలుసుకోవడానికి అడుగుతుందా..? అని అనుకుంటుంది. ఇంతలో అమర్ దానికి అంత స్పెషాలిటీ ఏమీ లేదని.. ఆరు కొన్నది అని చెప్తాడు. అంజు కూడా మిస్సమ్మ ఇది ది గ్రేట్ అంజు మెడలో ఉంది. అందుకే ఈ చెయిన్‌కు అంత స్పెషాలిటీ ఉంది అని చెప్తుంది. ఇంతలో మనోహరి, రణవీర్ వస్తారు.
కారు దిగగానే.. రణవీర్ ప్లాన్ చేంజ్ చేస్తున్నాను మనోహరి అని చెప్తాడు. అయితే అడిగి తీసుకెళ్దామనుకుంటున్నావా అంటుంది మనోహరి. అవును మనోహరి.. అమర్‌ను నేరుగా ఢీకొట్టలేం.. మంచితనం.. మనుషుల మీద ఉన్న ప్రేమ అనే బలంతో కొట్టగలం.. ఇప్పుడు నేను అదే అస్త్రాన్ని వాడబోతున్నాను అనుకుంటూ లోపలికి వెళ్తాడు రణ్‌వీర్.
రణ్‌వీర్ చెయిన్ చూసి అమర్ షాక్
లోపల మిస్సమ్మ.. అంజు చెయిన్‌ను చూస్తుంటే.. ఏంటి నా చెయిన్‌ను అలా చూస్తున్నావు.. అమ్మో దిష్టి తగులుద్ది నా చెయిన్‌కు అని అంజు లోపలికి వేసుకుంటుంది. రణవీర్ రాగానే హాయ్ రణవీర్ అంకుల్.. చేతిలో మళ్లీ కవర్.. ఏంటి మళ్లీ షాపింగ్‌కు వెళ్లారా అని అడుగుతుంది. మిస్సమ్మ.. రణవీర్, మనోహరిలను చూసి కలసి వస్తున్నారు. కలిసి బయటకు వెళ్లారా..? లేదా బయటికి వెళ్లాక కలిశారా అని అడుగుతుంది.
రణవీర్ బయటకు వెళ్లాక కలిశాం.. నాకు హెల్ప్ కావాలంటే.. మనోహరి గారిని రమ్మని చెప్పాను అంటాడు. మిస్సమ్మ.. ఏం హెల్ప్ అని అడుగుతుంది. అంజలికి గిఫ్ట్ కొనాలని అనుకున్నాను అందుకోసం మనోహరిగారిని రమ్మన్నాను అంటూ చెయిన్ తీసి ఈ గిఫ్ట్ అంజలికి అని చెప్తాడు రణవీర్. చెయిన్ చూసిన అమర్ షాక్ అవుతాడు. ఈ చెయిన్ ఈ చెయిన్ అంటూ అమర్ అంటుంటే.. ఈ చెయిన్ ఏంటి అమరేంద్ర గారు మీరు ఎక్కడైనా చూశారా..? అని రణవీర్ అడుగుతాడు. చూశానని కాదు.. ఈ చెయిన్, డాలర్ ఎందుకు తీసుకొచ్చారు అని అమర్ అడుగుతాడు.
అంజు మెడలో చెయిన్ వేసిన రణ్‌వీర్
స్పెషల్ రీజన్ అంటూ ఏమీ లేదండి.. తీసుకురావాలని తీసుకొచ్చాను అంటాడు. అమర్ ఇది నార్మల్ చైన్ కాదు కదా..? ఏదో ఆర్డర్ ఇచ్చి చేయించినట్టు ఉంది. ఇదే చైన్ ఎందుకు చేయించారు అని అడుగుతాడు. రణవీర్ కంగారుపడుతూ అంటే మా ఊర్లో దుర్గామాతను ఎక్కువగా కొలుస్తామండి అందుకే అంజు పాప మెడలో దుర్గామాత లాకెట్ వేస్తే రక్షగా ఉంటుందని ఈ చైన్ తీసుకొచ్చాను అని చెప్తాడు. మిస్సమ్మ గారు పాప మెడలో ఈ చైన్ మీరే వేయండి అంటాడు.
ఇంతలో మనోహరి.. రణవీర్ గారు మీరే తీసుకొచ్చారు కదా.. మీరే అంజు మెడలో వేయండి అని చెప్తుంది. అమర్ కూడా అవునని అనడంతో రణవీరే అంజు మెడలో చైన్ వేస్తాడు. చైన్ చూసుకున్న అంజు చాలా బాగుంది అంకుల్.. నాకు ఎలా ఉంది అంకుల్ అని అడుగుతుంది. చాలా బాగుంది అమ్మా అంటాడు రణవీర్.
చిత్రగుప్తుడి దగ్గరికి ఆరు
ఇంతలో అమర్ సేమ్ చైన్ ఎలా తీసుకొచ్చి ఉంటాడు అని మనసులో అనుమానపడతాడు. ప్రస్తుతానికి నిజం బయటపడలేదు కానీ రణవీర్ ఇక్కడే ఉంటే ఆ నిజం బయటపడుతుంది ఏదో ఒకటి చేయాలి అని ఆరు అనుకుంటుంది. వెంటనే చిత్రగుప్తుడి దగ్గరకు వెళ్తుంది ఆరు.
చిత్రగుప్తుడు నాగమణి ఎక్కడ అని అడుగుతాడు. వెంటనే ఆరు మీకు నాగమణి కావాలంటే నా ఈ సమస్యను మీరు పరిష్కరిస్తే.. ఆ నాగమణి ఎక్కడుందో గుర్తుకు వస్తుంది అని చెప్తుంది. సరే అయితే నేను ఆలోచిస్తాను అంటాడు చిత్రగుప్తుడు.
రణ్‌వీర్‌లో మొదలైన అనుమానం
మనోహరి.. రణవీర్‌కు ఫోన్ చేసి అమర్‌ను అడుగుతాను.. నా దగ్గర ప్లాన్ ఉంది అన్నావు.. అస్త్రాన్ని వాడబోతున్నాను అన్నావు ఏమైంది అని అడుగుతుంది. ఏమవడం ఏంటి.. ? మైండ్ అసలు పనిచేయడం లేదు. మనం తీసుకొచ్చిన చైన్ గురించి అమర్ అంత గుచ్చి గుచ్చి అడుగుతుంటే.. నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా..? ఆ చైన్ చూడ్డానికి డిఫరెంట్‌గా ఉంది కదా.. అందుకే అమర్ అలా అడిగి ఉంటాడు అని చెప్తుంది మనోహరి.
లేదు మనోహరి అమర్ అడిగిన విధానం. ఆ చైన్‌ను చూసిన విధానం మామూలుగా లేదు అని చెప్తాడు. దీంతో మనోహరి.. నువ్వు ఎక్కువవగా ఆలోచిస్తున్నావు నీ ఫ్యామిలీ చైన్ గురించి అమర్‌కు ఎలా తెలుస్తుంది అంటుంది. అదే కనుక్కోవాలి అంటూ రణవీర్ అంజు మెడలో ముందురోజు అమర్ వేసిన చైన్ గుర్తుకు వస్తుంది.
అంజుని కోల్‌కతాకు తీసుకెళ్తానన్న రణ్‌వీర్
అదే విషయం మనోహరిని అడిగితే నీకేమైనా పిచ్చి పట్టిందా..? అనవసరమైన అనుమానాలతో నీ డౌట్లు పక్కన పెట్టు అంటుంది. ఇంతలో అంజు పరుగెత్తుకుంటూ బయటకు రణవీర్ దగ్గరకు వస్తుంది. అంజు మెడలో చైన్ చూసి షాక్ అవుతాడు రణవీర్. వెంటనే అంజును నేను కోల్‌కతా వెళ్తున్నాను నాతో పాటు వస్తావా..? అని అడుగుతాడు. డాడీ ఒప్పుకోరు అంటుంది. అవన్నీ నేను చూసుకుంటాను కానీ మీ డాడీ నిన్ను పిలిచి అడిగితే ఓకే చెప్పు అని అంటాడు.
ఇంతలో లోపలికి వెళ్లిన రణవీర్ అమర్ దగ్గరకు వెళ్లి నేను ఇవాళ కోల్‌కతా వెళ్తున్నాను అని చెప్తుండగానే.. మనోహరి వచ్చి నేను కూడా కోల్‌కతా వెళ్తున్నాను అని చెప్తుంది. రణ్‌వీర్ ఏం చేయబోతున్నాడు? అమర్‌కి మనోహరి రణ్‌వీర్ భార్య అని తెలుస్తుందా? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు ఫిబ్రవరి 5న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!
సంబంధిత కథనం
టాపిక్