Best Web Hosting Provider In India 2024
Eggs Empty Stomach: ఖాళీ పొట్టతో గుడ్లు తినడం ఆరోగ్యానికి మంచిది కాదా? ఆయుర్వేదం ఏం చెబుతోంది?
Eggs Empty Stomach: ఖాళీ కడుపుతో గుడ్లు తినడం సురక్షితమేనా? ఈ సందేహం ఎంతో మందిలో ఉంది. అలా తినవచ్చో లేదో వైద్యులు వివరిస్తున్నారు. గుడ్లు ఎప్పుడు తింటే ఆరోగ్యకరమో కూడా చెబుతున్నారు.
కోడిగుడ్డు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అందుకే ప్రతిరోజూ ఒక ఉడికించిన కోడిగుడ్డు తినమని పోషకాహార నిపుణులు, వైద్యులు సూచిస్తారు. గుడ్లలో అధిక నాణ్యత గల ప్రోటీన్ ఉంటుంది. అలాగే విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ బి12, రిబోఫ్లేవిన్, ఫోలేట్, ఇనుము, సెలీనియం వంటి పోషకాలతో కూడా సమృద్ధిగా ఉంటాయి. గుడ్లు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. కానీ ఈ గుడ్లను తప్పుగా తింటే అవి ప్రయోజనం పొందడానికి బదులుగా ఆరోగ్యానికి హాని చేయడం ప్రారంభిస్తాయి. ముఖ్యంగా కొంతమంది ఖాళీ పొట్టతో కోడిగుడ్డు వంటకాలు తింటూ ఉంటారు. ఆయుర్వేదం ప్రకారం ఖాళీ పొట్టతో గుడ్డు తినకూడదట. ఎందుకో తెలుసుకోండి.
గ్యాస్ట్రిక్ సమస్యలు
అపానవాయువు, గ్యాస్, కడుపు తిమ్మిరి వంటి జీర్ణవ్యవస్థ సమస్యలతో బాధపడుతున్న వారు ఖాళీ పొట్టతో కోడిగుడ్లను తినడకూదు. ఇప్పటికే జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్న వారిలో ఆ సమస్యలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది.
అలెర్జీలు
కొంతమందికి గుడ్ల అలెర్జీ ఉంటుంది. అలాంటి వారు పొరపాటున కూడా ఖాళీ కడుపుతో గుడ్లు తినకూడదు. ఇలాంటి పొరపాటు చేయడం వల్ల వారికి తామర, శరీరంలో వాపు, వికారం, వాంతులు లేదా విరేచనాలు వంటి జీర్ణశయాంతర సమస్యలు ఉండవచ్చు. సమస్య తీవ్రమైతే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపించవచ్చు.
పచ్చిగుడ్డు
కొంతమంది పచ్చిగుడ్డును తింటూ ఉంటారు. ఇది ఏమాత్రం మంచిది. ఎన్నో రకాల రోగాలు వచ్చే అవకాశం పెరిగిపోతుంది. పచ్చి లేదా తక్కువ ఉడికించిన గుడ్లు తినడం ద్వారా కూడా ఫుడ్ పాయిజనింగ్ సమస్య బారిన పడవచ్చు. నిజానికి అలాంటి గుడ్డు తినడం వల్ల సాల్మొనెల్లా బ్యాక్టీరియా శరీరంలో చేరే ప్రమాదం ఉంది. ఈ బ్యాక్టీరియా విరేచనాలు, జ్వరం, కడుపు తిమ్మిరి వంటి లక్షణాలను కలిగిస్తుంది.
గుడ్డులో అధికంగా ప్రోటీన్ ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని యాంటీబయాటిక్స్ ప్రభావాన్ని తగ్గించడానికి ఆ ప్రోటీన్ పనిచేస్తుంది. అటువంటి పరిస్థితిలో, ఏదైనా యాంటీబయాటిక్స్ తీసుకునేటప్పుడు, వైద్యుడిని అడిగిన తర్వాత మాత్రమే గుడ్డును ఆహారంలో చేర్చండి. యాంటీ బయోటిక్స్ తీసుకుంటున్నప్పుడు గుడ్లు తినడం తగ్గిస్తే మంచిది.
పోషక అసమతుల్యత
ఉదయం అల్పాహారం కోసం కేవలం గుడ్లు మాత్రమే తీసుకోవడం వల్ల శరీరంలో ఇతర ముఖ్యమైన పోషకాలు లోపిస్తాయి. ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, కార్బోహైడ్రేట్లు సమతుల్య మొత్తంలో పుష్కలంగా ఉండే ఇలాంటి వాటిని ఎల్లప్పుడూ ఉదయం మీ అల్పాహారంలో చేర్చండి.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం