Best Web Hosting Provider In India 2024
మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ
తూర్పుగోదావరి జిల్లా : బీసీలను న్యూనత భావనతో చూసిన వ్యక్తి చంద్రబాబు అంటూ వైయస్ఆర్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి బీసీలను ఉన్నత కులాలుగా చూడాలనుకుంటే.. వారిని అణగదొక్కటమే చంద్రబాబు ధ్యేయంగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ఆంధ్ర జ్యోతి పత్రికలో బీసీలపై వైయస్ఆర్‌సీపీ కత్తి అన్న కథనాన్ని మాజీ మంత్రి ఖండించారు. బుధవారం చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ..ప్రస్తుత ప్రభుత్వం, దానికి మద్దతు ఇచ్చే పత్రికల వార్తల్లో నిజాలు వెతుక్కోవలసిన పరిస్థితి ఉంది. గీత వృత్తి కులాలకు 20 శాతం మద్యం దుకాణాలను కేటాయిస్తానని చంద్రబాబు గతంలో ప్రకటించారు. దానిని10 శాతానికి కుదించారు. ఈ విషయం ఆంధ్రజ్యోతి యాజమాన్యం కనిపించలేదా?. ప్రధానమైన షాపులను మీకు అవసరమైన మద్యం సిండికేట్లకు దక్కేలా చేసి, మిగిలిన 10 శాతం షాపులలో గీత కార్మికులకు వదిలేస్తారా?. వృత్తిని కోల్పోయిన కార్మికులకు అండగా ఉండే విధంగా కూటమి సర్కార్ షాపులు కేటాయించడం లేదు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వల్లే బీసీ కులాల్లో అనేకమంది ఉన్నత విద్యను అభ్యసించారని వేణుగోపాలకృష్ణ గుర్తు చేశారు.