Best Web Hosting Provider In India 2024
TG High Court Judges : తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు నూతన న్యాయమూర్తుల నియామకం
TG High Court Judges : తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులను నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. అదనపు న్యాయమూర్తులుగా పనిచేస్తున్న ముగ్గురు జడ్జీలను శాశ్వత జడ్జీలుగా నియమించింది.
తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు నూతన న్యాయమూర్తుల నియామకం
TG High Court Judges : తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులను నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అడిషనల్ జడ్జీలుగా కొనసాగుతున్న వారిని పూర్తి స్థాయి జడ్జీలుగా నియమించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ జరిగిన సుప్రీం కోర్టు కొలీజియం సమావేశంలో తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు శాశ్వత న్యాయమూర్తుల నియామకం ప్రతిపాదనను ఆమోదం లభించింది.
కొత్త జడ్జీలు
1. జస్టిస్ లక్ష్మీ నారాయణ అలిశెట్టి
2. జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి
3. జస్టిస్ సుజనా కళాసికం
తెలంగాణలోని జిల్లా కోర్టులకు జడ్జీలను హైకోర్టు నియమించింది. రాష్ట్రంలోని మొత్తం 30 జిల్లాలకు జిల్లా జడ్జీలను నియమిస్తూ హైకోర్టు నుంచి ప్రకటన వెలువడింది. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించేలా పలు జిల్లాలకు జడ్జిలను నియమించారు.
కొత్త జిల్లా న్యాయమూర్తులు
- హైదరాబాద్ – జస్టిస్ సుజోయ్ పాల్
- రంగారెడ్డి – జస్టిస్ పి. సామ్ కోశి
- మేడ్చల్-మల్కాజిగి – జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి
- హనుమకొండ, వరంగల్ – జస్టిస్ మౌషుమి భట్టాచార్య
- నల్గొండ – జస్టిస్ టి.వినోద్ కుమార్
- కరీంనగర్ – జస్టిస్ కె. లక్ష్మణ్
- ఖమ్మం – జస్టిస్ బి. విజయసేన్ రెడ్డి
- సంగారెడ్డి – జస్టిస్ పి. శ్రీ సుధ
- సూర్యాపేట – జస్టిస్ జి. రాధారాణి
- నిజామాబాద్ – జస్టిస్ ఎన్. తుకారాంజీ
- సిద్దిపేట – జస్టిస్ టి.మాధవి దేవి
- భువనగిరి – జస్టిస్ కె. సురేందర్
- కొత్తగూడెం – జస్టిస్ సూరేపల్లి నంద
- మహబూబ్ నగర్ – జస్టిస్ జువ్వాడి శ్రీదేవి
- మంచిర్యాల – జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్
- పెద్దపల్లి – జస్టిస్ ఎం.జి. ప్రియదర్శిని
- వికారాబాద్ – జస్టిస్ సి.వి. భాస్కర్ రెడ్డి
- జగిత్యాల – జస్టిస్ ఇ.వి. వేణుగోపాల్
- మహబూబాబాద్, ములుగు – జస్టిస్ నగేష్ భీమపాక
- కామారెడ్డి – జస్టిస్ పుల్లా కార్తీక్
- నాగర్ కర్నూల్ – జస్టిస్ కె. శరత్
- మెదక్- జస్టిస్ జె. శ్రీనివాసరావు
- సిరిసిల్ల-జస్టిస్ నామవరపు రాజేశ్వర్ రావు
- నిర్మల్, ఆసిఫాబాద్- జస్టిస్ లక్ష్మీ నారాయణ అలిశెట్టి
- జనగాం-జస్టిస్ జె. అనిల్ కుమార్
- వనపర్తి- జస్టిస్ కె. సుజనా
- ఆదిలాబాద్- జస్టిస్ వై. రేణుక
- గద్వాల్- జస్టిస్ ఎన్. నర్సింగ్ రావు
- భూపాలపల్లి- జస్టిస్ ఈ. తిరుమల దేవి
- నారాయణపేట-జస్టిస్ బి.ఆర్. మధుసూధన్ రావు
సంబంధిత కథనం
టాపిక్
Telangana NewsTrending TelanganaTelugu NewsHigh Court Ts
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.