Minister Lokesh : నా వెంట్రుక కూడా పీకలేరని ఎరిగినందుకే ఈ పరిస్థితి- జగన్ 2.0కి లోకేశ్ కౌంటర్

Best Web Hosting Provider In India 2024

Minister Lokesh : నా వెంట్రుక కూడా పీకలేరని ఎరిగినందుకే ఈ పరిస్థితి- జగన్ 2.0కి లోకేశ్ కౌంటర్

Bandaru Satyaprasad HT Telugu Feb 05, 2025 09:28 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Bandaru Satyaprasad HT Telugu
Feb 05, 2025 09:28 PM IST

Minister Lokesh : ఈసారి జగన్ 2.0 చూస్తారని మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ 1.0 అరాచకం నుంచే ఇంకా బయటపడలేదన్నారు. ఇలాగే నా వెంట్రుక కూడా పీకలేరని అంటే ఉన్న 1.0 కూడా పీకేశారన్నారని ఎద్దేవా చేశారు.

నా వెంట్రుక కూడా పీకలేరని ఎరిగినందుకే ఈ పరిస్థితి- జగన్ 2.0కి లోకేశ్ కౌంటర్
నా వెంట్రుక కూడా పీకలేరని ఎరిగినందుకే ఈ పరిస్థితి- జగన్ 2.0కి లోకేశ్ కౌంటర్
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

Minister Lokesh : వైసీపీ కార్యకర్తల కోసం జగన్ 2.0 చూస్తారంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. ‘ప్రజలు జగన్ 1.0 అరాచకం నుంచే ఇంకా బయటకు రాలేదు, విధ్వంసం మర్చిపోలేదు. ఇలాగే నా వెంట్రుక కూడా పీకలేరు అని ఎగిరారు. ప్రజలు ఉన్న 1.0 కూడా పీకేశారు. జగన్ కి, ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మేమేమి చేస్తాం. ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన అసెంబ్లీకి రావటం ఆయన బాధ్యత. కనీసం పులివెందుల ప్రజల కోసమైనా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల పై మాట్లాడాలి’ అని లోకేశ్ అన్నారు.

yearly horoscope entry point

‘పులివెందుల ఎమ్మెల్యే గారికి డైరెక్ట్ ప్రశ్న.. మీరు 5 ఏళ్లలో తెచ్చిన పెట్టుబడులు ఎన్ని? మేము 8 నెలల్లో తెచ్చిన పెట్టుబడులు ఎన్ని అనేవి చర్చించటానికి సిద్ధమా? చర్చకు రెడీనా జగన్ ?’ –లోకేశ్

దిల్లీ పర్యటనలో

‘దిల్లీలో పలువురు కేంద్రమంత్రులను కలిశాను. వివిధ శాఖల మంత్రులతో ఆయా సమస్యలపై చర్చించాం. రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి అండగా ఉండాలని కోరాను. విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు సాయం చేయాలని కోరాను. అనంతపురంలో డిఫెన్స్ పరిశ్రమలకు గల అనుకూలతల గురించి రక్షణశాఖ మంత్రికి వివరించాం.

దిల్లీలో ఉక్కు శాఖ మంత్రిని కలిసి, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్యాకేజ్ ఇచ్చిన కేంద్రానికి కృతజ్ఞతలు చెప్పాను. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు వచ్చిన భయమేమీ లేదు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉండదని కేంద్రమంత్రే చెప్పారు. నిర్వహణ సరిగా లేకే విశాఖ స్టీల్ ప్లాంట్‌కు నష్టాలు వచ్చాయి. విశాఖ స్టీల్ ప్లాంట్‌‌ను లాభాల బాట పట్టించేందుకు కృషి చేస్తున్నాం’-మంత్రి లోకేశ్

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

Nara LokeshYs JaganYsrcpAndhra Pradesh NewsTrending ApTelugu News
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024