Singanamala Ramesh Babu: 10 ఎకరాలు పలు వ్యక్తులకు అమ్మినట్లు కేసు పెట్టారు, నా కథ ఎవరు చూస్తారు: నిర్మాత రమేష్ బాబు

Best Web Hosting Provider In India 2024

Singanamala Ramesh Babu: 10 ఎకరాలు పలు వ్యక్తులకు అమ్మినట్లు కేసు పెట్టారు, నా కథ ఎవరు చూస్తారు: నిర్మాత రమేష్ బాబు

Sanjiv Kumar HT Telugu
Feb 06, 2025 06:39 AM IST

Producer Singanamala Ramesh Babu About His Case: టాలీవుడ్‌లో అగ్ర నిర్మాతల్లో ఒకరైన సింగగనమల రమేష్ బాబు 14 ఏళ్ల పాటు న్యాయ పోరాటం తర్వాత నిర్దోషిగా నిరూపించుకున్నారు. ఓ ల్యాండ్ కేసులో ఒకరికి తెలియకుండా మరొకరికి పలువురికి అమ్మినందుకు తనపై కేసు పెట్టినట్లు నిర్మాత రమేష్ బాబు తెలిపారు.

10 ఎకరాలు పలు వ్యక్తులకు అమ్మినట్లు కేసు పెట్టారు, నా కథ ఎవరు చూస్తారు: నిర్మాత రమేష్ బాబు
10 ఎకరాలు పలు వ్యక్తులకు అమ్మినట్లు కేసు పెట్టారు, నా కథ ఎవరు చూస్తారు: నిర్మాత రమేష్ బాబు

Producer Singanamala Ramesh Babu About His Case: టాలీవుడ్‌లో గతంలో టాప్ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్నారు నిర్మాత సింగగనమల రమేష్ బాబు. 14 ఏళ్ల నాటి కేసులో ఆయనను నాంపల్లి కోర్టు నిర్దోషిగా తీర్పు ఇచ్చింది. దానికి సంబంధించిన విషయాలని తాజాగా మీడియా సమావేశంలో తెలిపారు.

yearly horoscope entry point

”నేనొక ఫిల్మ్‌ ఫైనాన్షియర్‌ని. సినిమా అంటే పాషన్‌తో నిర్మాతగా మారాను. సినిమా నాకు తల్లి లాంటిది. మహాబలిపురంలో ఉన్న నా 10 ఎకరాల స్థలాన్ని ఒకరికి తెలియకుండా మరొకరికి.. ఇలా పలువురు వ్యక్తులకు అమ్మానని నాపై కేసు పెట్టారు. 14 ఏళ్ల పాటు న్యాయ పోరాటం చేశాను. అది తప్పుడు కేసని తేలింది. న్యాయస్థానం నన్ను నిర్దోషిగా తేల్చింది. తప్పుడు కేసులు కోర్టు ముందు నిలబడవు. నా న్యాయపోరాటం గెలిచింది” అని నిర్మాత సింగనమల రమేష్ బాబు అన్నారు.

మీపై కేసు పెట్టిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు?

-నాకు ఎలాంటి కక్ష సాధింపులు లేవు. ఏదైనా న్యాయపరంగానే పోరాటం చేస్తా.

భవిష్యత్‌లో సినిమాల్లో కొనసాగుతారా ?

-నేనొక ఫిల్మ్‌ ఫైనాన్షియర్‌ని. సినిమా అంటే పాషన్‌తో నిర్మాతగా మారాను. సినిమా నాకు తల్లి లాంటిది. భవిష్యత్తులోనూ ఇదే రంగంలో కొనసాగుతా. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిద్దరూ హీరోలుగా చేశారు. హిట్ అందుకున్నారు. ఇప్పుడు డైరెక్షన్ రైటింగ్ చేయాలని అనుకుంటున్నారు. నేను కూడా నిర్మాతగా చేస్తా. ఫైనాన్షియర్‌గా చేస్తాను.

మీ మీద కేసు పెట్టింది ఎవరు? వాళ్లకు సినీ రంగంతో సంబంధం ఉందా?

-నాపై కేసు పెట్టిన వాళ్లు ఇండస్ట్రీ చెందిన వారు కాదు.

అసలు మీపై పెట్టిన కేసు ఏమిటి?

-రూ.14 కోట్లు మోసం చేశానని నా మీద అభియోగం. మహాబలిపురంలో ఉన్న నా 10 ఎకరాల స్థలాన్ని ఒకరికి తెలియకుండా మరొకరికి.. ఇలా పలువురు వ్యక్తులకు అమ్మానని కేసు పెట్టారు. సుదీర్ఘంగా న్యాయ విచారణ జరిగింది. న్యాయస్థానం నన్ను నిర్దోషిగా తేల్చింది. ఇప్పటికీ ఆ ఆస్తులు నా పేరు మీదే ఉన్నాయి.

మీ స్టొరీనే సినిమా కథలా ఉంది. సినిమా చేసే అవకాశం ఉందా ?

-వెబ్ సిరిస్ చేస్తే వెయ్యి ఎపిసోడ్స్ పెట్టొచ్చు. అయితే నా కథ ఎవరు చూస్తారు (నవ్వుతూ).

ఫైనాన్స్ బిజినెస్ ఎంత లాభదాయకం ?

-మేము సంపాదించింది ఫైనాన్స్ బిజినెస్ వలనే. నాన్న గారి నుంచి అది నాకు వచ్చింది. అయితే, సినిమా మేకింగ్ అనేది ఎప్పటికీ ఓ జూదమే. ఆ గ్యాంబ్లింగ్ వలనే నాకు రెండు సినిమాల్లో వందకోట్లు పోయింది. అయితే ప్రజెంట్ సినిమా నిర్మాణం బావుందని వింటున్నాను. నిర్మాతకు పది రూపాయలు మిగులుతాయని బయట అంటున్నారు.

ఈ జర్నీలో మీరు నేర్చుకున్న పాఠం ?

-24 క్రాఫ్ట్స్ మన గ్రిప్‌లో ఉన్నప్పుడే సినిమా తీయాలి.

ఖలేజా సినిమాకి సి కళ్యాణ్ గారు ఒక పార్టనర్ కావడానికి కారణం?

-కాదండీ. నా డబ్బుతో ఆయన సినిమా పూర్తి చేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు నాకు దేవుడే సపోర్ట్‌గా ఉన్నారు.

ఎలాంటి సినిమాలు చేయాలని ఉంది?

-కథనే నా హీరో. కథని నమ్ముకొని సినిమా చేస్తాను. పెద్దసినిమాలు, కంటెంట్ బేస్డ్ సినిమాలు అన్ని రకాల సినిమాలు చేయాలని ఉంది. తర్వలోనే ఓ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ ఉండే అవకాశం ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024