Baby Names: బేబీ గర్ల్‌కి అందమైన పేర్లు ఇవిగో, ఈ పేర్లకు ప్రేమ అని అర్థం

Best Web Hosting Provider In India 2024

Baby Names: బేబీ గర్ల్‌కి అందమైన పేర్లు ఇవిగో, ఈ పేర్లకు ప్రేమ అని అర్థం

Haritha Chappa HT Telugu
Feb 06, 2025 09:29 AM IST

Baby Names: వాలెంటైన్స్ వీక్ వచ్చిందంటే ‘లవ్’ అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది. ఈ వీక్ లో పుట్టిన ఆడపిల్లల కోసం ప్రేమ అనే అర్థం వచ్చే పేర్లను ఇక్కడ ఇచ్చాము. ఈ ప్రతి పేరు వినడానికి చాలా ప్రత్యేకంగా, అందంగా ఉంటాయి.

బేబీ గర్ల్ నేమ్స్
బేబీ గర్ల్ నేమ్స్ (shutterstock)

వాలెంటైన్స్ వీక్ ప్రారంభం కాబోతోంది. ఈ వారంలో పుట్టే పిల్లలకు ప్రేమ అని అర్థం వచ్చేలా అందమైన పేర్లను పెడితే చక్కగా ఉంటుంది. మీ పాపకు ఆప్యాయత, ప్రేమ అనే అర్థం వచ్చేలా పేరును ఇవ్వాలనుకుంటే ఇక్కడ కొన్ని పేర్లను ఇచ్చాము. ఇవన్నీ ట్రెండీగా, కొత్తగా ఉంటాయి. ఒక వ్యక్తికి పెట్టే పేరు వారి ప్రవర్తన, జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుందని చెబుతారు. కాబట్టి మీ కుమార్తెకు జీవితంలో ఎల్లప్పుడూ ప్రేమ, ఆనందం నిండేలా అందమైన పేరు ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏదో ఒకటి ఎంచుకోండి. ఈ బేబీ నేమ్స్ లిస్ట్ లో చాలా పేర్లు ఉన్నాయి. ఈ పేర్లన్నింటికీ అర్థం ప్రేమ అని.

yearly horoscope entry point

అందమైన బేబీ గర్ల్ పేర్లు

  1. ఆష్నా- ఈ పేరుకు ప్రియురాలు, ప్రేమకు అంకితమైన స్నేహితురాలు, ఆరాధించదగిన వారు అని అర్థం.

2. అమృత – ఈ పేరుకు అర్థం ప్రియమైనది, మధురమైనది, అమరమైనది.

3. హితాక్షి – హితాక్షి అనే పేరు చాలా ప్రత్యేకంగా, క్యూట్ గా అనిపిస్తుంది. కూతురంటే ఇష్టమైతే హితాక్షి అనే పేరును పెట్టండి. దీనికి ప్రేమ ఉనికి అని అర్థం.

4. అనురక్తి – ఈ పేరుకు అర్థం ప్రేమ, ఆప్యాయత, భక్తి.

5. మౌళిక – ఈ పేరుకు అర్థం నిజమైన ప్రేమ.

6. ప్రణీష – ఈ పేరుకు అర్థం జీవితంపై ప్రేమ ఉన్న వ్యక్తి అని.

7. దావినా -దావినా అనేది హీబ్రూ పేరు, దీని అర్థం అందమైనది అని.

8. అహువా – అహువా అనేది యూదు సంస్కృతిలో ప్రియమైన పేరు, ఇది లోతైన అనురాగం, ప్రేమకు చిహ్నం.

9. వితా – ఈ పేరు హీబ్రూ పేరు, దీని అర్థం ప్రేమ.

10. అహ్వా – ఈ పేరు కూడా హీబ్రూ పదం నుంచి వచ్చినదే, దీని అర్థం ప్రేమ.

11. అలీజా – అలీజా అనేది సంతోషానికి, ఉత్సాహానికి ప్రతీక.

12. ఎడ్నా- ఎడ్నా అనేది ఆనందం, సంతృప్తికి ప్రతీక అయిన పేరు.

13. గీలా – ఈపేరుకు ఆనందం, వేడుక అని అర్థం.

14. అనన్యజ – ఈ పేరుకు అర్థం గుండెల్లోంచి పుట్టే ప్రేమ అని

15. అనవి – దయగల, ప్రేమగల వ్యక్తి అని ఈ పేరుకు అర్థం.

16. అనురతి – ఈ పేరుకు ప్రేమ, అనురాగం అనే అర్థాలు వస్తాయి.

17. అర్నవి – సముద్రం లాంటి విశాలమైన హృదయం ఉన్న వ్యక్తి అని అర్థం.

18. ప్రణయిని – ఈ పేరుకు అర్థం ప్రియమైన, ప్రేమ నిండిన వ్యక్తి అని.

19. వాత్సల్య – ఈ పేరుకు అర్థం ప్రేమ, అనురాగం కల వ్యక్తి అని.

20. జోయా – ప్రేమ నిండి గుండె కలిగిన అమ్మాయి.

Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024