![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/Minor_raped_by_father_1661222150103_1738814585072.jpg)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497842_358_newTwitterIcon.png)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497843_996_facebook1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497844_122_wapp1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/Minor_raped_by_father_1661222150103_1738814585072.jpg)
Minor Girl And Boy: శ్రీసత్యసాయి జిల్లాలో ఘోరం…బాలికపై బాలుడు అత్యాచారం, గర్భం దాల్చడంతో వెలుగులోకొచ్చిన ఘటన
Minor Girl And Boy: శ్రీసత్యసాయి జిల్లాలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. పదో తరగతి చదువుతున్న బాలికపై బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తోటి విద్యార్థులుగాని, కుటుంబ సభ్యులు ఆమె గర్భం దాల్చడాన్ని గుర్తించలేకపోయారు.
Minor Girl And Boy: బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం చేయడంతో గర్భం దాల్చిన ఘటన సత్యసాయి జిల్లాలో వెలుగు చూసింది. బాలికకు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో బాలికను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఇవి మామూలుగా వచ్చే నొప్పులు కావని, పురిటి నొప్పులని పేర్కొన్నారు. దీంతో కుటుంబ సభ్యులు అవాక్కైయ్యారు. ఆమెకు నెలలు నిండటంతో ప్రసవించింది. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బాలుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
![yearly horoscope entry point](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ధర్మవరం పట్టణంలో ఓ ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదువుతున్న విద్యార్థినికి, ధర్మవరంలోనే పట్టు చీరల పాలీష్ చేసే బాలుడుకి పరిచయం అయింది.
బాలికను ప్రేమిస్తున్నానంటూ వెంటపడిన బాలుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. అయితే ఈ విషయం బాలిక ఇంట్లో ఎవరికీ తెలియదు. అలాగే తోటి విద్యార్థినీలకు కూడా తెలియదు.
బాలిక మామూలుగానే ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లి, ఇంటికి వచ్చేది. పాఠశాలలో తోటి విద్యార్థులు, ఇంట్లో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బాలిక గర్భం దాల్చినట్లు గుర్తించ లేకపోయారు. ఆమె సాధారణంగానే ఉండటంతో ఎవరూ ఆమె గర్భం దాల్చినట్లు అనుకోలేదు. మంగళవారం ఆరోగ్యం బాగోలేదని తల్లిదండ్రులకు బాలిక చెప్పింది.
అలా చెప్పి ఇంటి వద్దే ఉండిపోయింది. బుధవారం సాయంత్రం విపరీతంగా కడుపు నొప్పి ఉందని, భరించలేకపోతున్నానని చెప్పడంతో ఆమెను తల్లిదండ్రులు చెప్పింది. దీంతో తల్లిదండ్రులు హుటాహుటిన ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ఆసుపత్రిలోని వైద్యులు బాలికను పరీక్షించి గర్భం దాల్చిందని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు అవాక్కైయ్యారు. ఆ నొప్పులు సాధారణ నొప్పులు కాదని, పురిటినొప్పులని తల్లిదండ్రులకు వైద్యులు చెప్పారు. అనంతరం ఆ బాలిక ప్రసవించింది. సాధారణ కాన్పుచేసి, మగబిడ్డకు జన్మనిచ్చింది.
అయితే తల్లి, బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఆసుపత్రి నుంచి ధర్మవరం ఒకటో పట్టణ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు ఆసుప్రతికి చేరుకుని వివరాలు సేకరించారు.
పోలీసులకు బాలిక కుటుంబ సభ్యులు చేశారు. దీంతో నిందితుడిపై అత్యాచారం, పోక్సో కేసు నమోదు చేశారు. ఒకటో పట్టణ సీఐ నాగేంద్రప్రసాద్ స్పందిస్తూ నిందితుడిపై కేసులు నమోదు చేశామని, విచారణ చేస్తున్నామని తెలిపారు. బాలికను బాలుడు మోసం చేసి అత్యాచారానికి పాల్పడినట్లు తమ ప్రాథమిక విచారణలో వెల్లడైందని అన్నారు. డీఎస్పీ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోందని, అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
టాపిక్