Best Web Hosting Provider In India 2024
Naga Chaitanya: 100% లవ్ మ్యాజిక్ తండేల్ క్రియేట్ చేస్తుందా? హీరో నాగ చైతన్య సమాధానం ఇదే!
Naga Chaitanya About Is Thandel Creates 100% Love Movie Magic: నాగ చైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్‌గా మరోసారి జోడీ కట్టిన సినిమా తండేల్. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో చందు మొండేటి దర్శకత్వంలోని తండేల్ మూవీ 100% లవ్ మ్యాజిక్ క్రియేట్ చేస్తుందా అన్న ప్రశ్నకు నాగ చైతన్య ఆన్సర్ ఇంట్రెస్టింగ్‌గా మారింది.
Naga Chaitanya About Is Thandel Creates 100% Love Movie Magic: యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి మరోసారి హీరో హీరోయిన్స్‌గా జోడీ కట్టిన సినిమా తండేల్. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా రూపొందిన ఈ సినిమాకు చందూ మొండేటి దర్శకత్వం వహించారు.
తండేల్ మూవీ ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా టీమ్ పలు ప్రమోషనల్ ఈవెంట్స్‌లలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే నిర్వహించిన విలేకరులు సమావేశంలో హీరో నాగ చైతన్య పాల్గొని వారు అడిగిన ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ సమాధానాలు ఇచ్చాడు.
‘తండేల్’ సినిమాపై ఆడియన్స్‌లో చాలా అంచనాలు ఉన్నాయి. మీలో ఎలాంటి ఎగ్జయిట్‌మెంట్ ఉంది?
– నా కెరీర్‌లో బిగ్గెస్ట్ ప్రొడక్షన్, హై బడ్జెట్ మూవీ. క్యారెక్టర్, స్టొరీ అన్ని రకాలుగా బిగ్ స్పాన్ ఉన్న సినిమా ఇది. చాలా ఎగ్జయిట్‌మెంట్ ఉంది. ఆల్రెడీ సినిమా చూశాం. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. సెకండ్ హాఫ్ అయితే యునానిమాస్‌గా చాలా బాగా చెప్పారు. నాకు కూడా ఎమోషనల్ హై ఇచ్చింది. చివరి 30 నిమిషాలు వెరీ సాటిస్ఫాక్షన్. క్లైమాక్స్ గ్రేట్ ఎమోషనల్ హై ఇస్తుంది.
‘తండేల్’ కథ ఎలా వచ్చింది?
– దూత సమయంలో ఈ కథ విన్నాను. వాసు గారు గీత ఆర్ట్స్‌లో ఈ కథని హోల్డ్ చేశారని తెలిసింది. డెవలప్ చేసి మంచి సేఫ్ వస్తే చెప్పమన్నాను. నేను మొదట విన్నప్పుడు ఒక డాక్యుమెంటరీలా ఉంది. సినిమాటిక్ లాంగ్వేజ్‌లోకి తీసుకురావడానికి వర్క్ చేయాలి. అలా వర్క్ చేసిన తర్వాత అద్భుతంగా వచ్చింది.
శ్రీకాకుళం వెళ్లి అక్కడి వారిని కలవడం ఎలా అనిపించింది?
– ఈ కథ మొదట ఓ ఐడియాగా చెప్పారు. పాత్రకు తగ్గట్టుగా మారాలంటే వాళ్ల లైఫ్ స్టైల్ తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడానికి వాళ్లని నేరుగా కలవాలని వెళ్లాం. మొత్తం హోం వర్క్ చేశాక నేను చేయగలనని కన్విన్స్ అయిన తర్వాత జర్నీ మొదలైయింది.
యాక్టర్‌గా నెక్ట్స్ లెవల్‌కి వెళ్తారని, ప్రాణం పెట్టి చేశారని బన్నీ వాసు అంటున్నారు?
-ప్రతి సినిమాతో ఇంకా బెటర్ అవ్వాలని ప్రతి యాక్టర్‌కి ఉంటుంది. అయితే ఈ కథ రియల్ లైఫ్ క్యారెక్టర్ దొరికింది కాబట్టి ఇంకా మోటివేట్ అయ్యాను. యాక్టర్‌గా నెక్ట్స్ స్టెప్ వెళ్లే అవకాశం ఈ సినిమాలో కనిపించింది. దాదాపు ఎనిమిది నెలలు స్క్రిప్ట్, నా ట్రాన్స్‌ఫర్మేషన్ మీదే ఉన్నాను. శ్రీకాకుళం యాస గురించి ట్యూషన్ తీసుకున్నాను. యాస రియల్లీ ఛాలెజింగ్‌గా అనిపించింది.
మళ్లీ గీత ఆర్ట్స్‌లో చేస్తున్నారు. 100% లవ్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
-అవుతుంది. ఒక యాక్టర్‌గా మంచి దారి చూపిస్తుందని భావిస్తున్నాను. గీత ఆర్ట్స్‌లో మళ్లీ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. యాక్టర్‌కి మంచి రిలీజ్ ఇస్తారు. వాళ్ల ప్రోడక్ట్ బావుంటుంది. ఈ కథ గీత ఆర్ట్స్ దగ్గర ఉండటం నాకు డబుల్ బొనంజా.
సంబంధిత కథనం