చొక్కాలు పట్టుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి

Best Web Hosting Provider In India 2024

వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

సంపద సృష్టి చంద్రబాబు జేబులో జరుగుతోంది

సంపాదించే మార్గం ఉంటే నా చెవిలో చెప్పమని చంద్రబాబు అంటున్నారు

మోసాల్లో పీహెచ్‌డీ చేసిన చంద్రబాబు.. నటనలోనూ మేటి

చంద్రబాబును నమ్మడం అంటే.. చంద్రముఖిని నిద్రలేపడమే అని  ఎన్నికల టైంలో చెప్పా

పులి నోట్లో తలపెట్టడమే అని మొత్తుకున్నా

అయినా ప్రజలు పొరపాటు పడ్డారు.. 

స్లో పాయిజన్‌ లాగా.. చంద్రబాబు అబద్ధాలను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటా

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవస్థపై చంద్రబాబు వక్రీకరణ చేస్తున్నారు

బాబు హయాంలో దేశంలో ఏపీ జీడీపీ వాటా 4. 47 శాతం ఉంది. 

వైఎస్సార్‌సీపీ హయాంలో దేశంలో ఏపీ జీడీపీ వాటా రాష్ట్ర వాటా 4.80కి పెరిగింది.

దావోస్‌ పర్యటనలకు వెళ్లి.. ఎన్నో అబద్ధాలు చెప్పారు

12 మంది ఎంపీలున్న బీహార్‌.. బడ్జెట్‌లో ఎన్నో సాధించుకుంది

చంద్రబాబు విధ్వంసాలు అన్నీ విన్నీ కావు

మా హయాంలో తాడిపత్రిలో ఎన్నికల పారదర్శకంగా జరిపాం
 
హ్యాట్సాఫ్‌ జగన్‌ అని అక్కడి టీడీపీ ఇంఛార్జి చెప్పారు

నాలాగా చంద్రబాబు ఎందుకు బటన్‌ నొక్కలేకపోతున్నారు?

రాజకీయాల్లో క్రెడిబిలిటీ ఉండాలి

ఫలానా వాళ్లు మా నాయకులని కాలర్‌ ఎగరేసుకునేలా ఉండాలి

అసెంబ్లీకి వైఎస్సార్సీపీ ఎందుకు వెళ్లడం లేదో.. ఇక స్పీకరే చెప్పాలి

తాడేప‌ల్లి: ఏపీలో ప్రశ్నించే స్వరాలు పెరిగాయని,  చంద్ర‌బాబు చొక్కాలు పట్టుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయ‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హెచ్చ‌రించారు. ప్ర‌జలను వీళ్లను తరిమికొట్టే రోజులు వచ్చే అవకాశం ఉంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జమిలి ఎన్నికలు వస్తున్నాయంటున్నారని,  అవి ఎంత త్వరగా వస్తే.. చంద్రబాబును అంత త్వరగా పంపించేయాలని ప్రజలు ఆగ్రహంతో ఉన్నార‌ని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ధ్వ‌జ‌మెత్తారు. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో వైయ‌స్ జ‌గ‌న్ మీడియాతో మాట్లాడారు 

వైయ‌స్ జ‌గ‌న్ ఏమ‌న్నారంటే..

ఈ నెలలో జరిగిన పరిణామాల మీద ఈ ప్రెస్ మీట్ ..నాణేనికి రెండో వైపు ప్రజెంటేషన్ చేసే కార్యక్రమం ఈ రోజు జరుగుతోంది. 

రాష్ట్రంలో ప్రభుత్వం మారి, చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు కావస్తోంది. 9 నెలలు వెనక్కి పోతే .. ఎన్నికల్లో చంద్రబాబు నోట వినిపించిన కామన్ మాట ఏంటంటే..బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ.. 9 నెలల తర్వాత పరిస్థితి ఏంటంటే.. బాబు ష్యూరిటీ..మోసం గ్యారంటీ.. ఇది మనందరికీ కనిపిస్తూ ఉన్న ఫ్రేస్..

చంద్రబాబుగారు ఎన్నికల సమయంలో రిలీజ్ చేసిన మ్యానిఫెస్టోలో తాను చెప్పిన మాటలు.. ఎన్నికల వేళ .. బటన్ నొక్కడం ఒక పనా.. ముసలావిడ కూడా బటన్ నొక్కుతుంది.. అదేమన్నా గొప్ప పనా అని అనడం చాలా సార్లు చూశాం.. సూపర్ సిక్స్ అన్నాడు.. సూపర్ సెవెన్ అన్నాడు.. 143 హామీలను తాను మ్యానిఫెస్టోలో చేర్చాడు. ఇంటింటికీ దాన్ని ప్రచారం చేశాడు. ఎన్నికల వేళ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలను ప్రతి ఇంటికీ పంపించి.. ఆ ఇంటికి వెళ్లి చంద్రబాబుగారు  చెప్పిన మాటలు ఎవరూ మర్చిపోరు.. చిన్న పిల్లలు కనిపిస్తే..నీకు 15 వేలు..నీకు 15 వేలు.. వారి తల్లులు కనిపిస్తే..నీకు 18 వేలు.. నీకు 18 వేలు.. ఆ తల్లులు..వారి పిన్నమ్మలు.. వారి అత్తలు.. వారు కనిపిస్తే..నీకు 50 ఏళ్లు నిండాయి కదా.. నీకు 48 వేలు..నీకు 48 వేలు..నీకు 48 వేలు.. ఇంట్లో 20 ఏళ్ల పిల్లవాడు కనిపిస్తే నీకు 36 వేలు.. నీకు 36 వేలు.. నీకు 36 వేలు..ఇంట్లో కండువా వేసుకున్న రైతు కనిపిస్తే.. నీకు 20 వేలు.. .. నీకు 20 వేలు.. నీకు 20 వేలు.. ఎన్నికల సమయంలో మనకు రొటీన్ గా వినిపించిన మాటలు.. ఆ ఈనాడు చూసినా.. ఏబీఎన్ చూసినా.. టీవీ 5 చూసినా.. వాళ్ల మాటలు విన్నా.. ప్రతి ఇంట్లో రొటీన్ గా వినిపించే మాటలు ఇవీ.. ఇవే కాకుండా.. ఈ హామీలకు గ్యారెంటీ ఈ బాండ్లు అంటూ చూపించారు. ఇంటింటికీ బాండ్లు కూడా పంపించారు..ఇప్పుడు మీరిచ్చిన బాండ్లు ఏమయ్యాయి.. ? మీ మ్యానిఫెస్టోలో హామీలు ఏమయ్యాయి..? మీరు పంచిన పాంప్లెట్ లు ఏమయ్యాయి.. ఎవరి చొక్కా పట్టుకోవాలి?. ఈ 9 నెలల కాలంలో చంద్రబాబుగారి పాలనలో మనం చూస్తా ఉన్నది ఇది. 

మరోవైపు చూస్తే..రాష్ట్రానికి సంబంధించిన అప్పులు.. కేవలం 9 నెలల కాలంలోనే రికార్డులు బద్దలు కొట్టేశాయి..  బహుశా ఏ ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో అప్పులు చేసిన దాఖలాలు ఎక్కడా లేవు.. ఆ స్థాయిలో రికార్డులు బద్దలు కొట్టేశాయి. 9 నెలల కాలంలోనే బడ్జెటరీ అప్పులే..  రూ.80,827 కోట్లు..ఇవికాక ఈ 9నెలల్లోనే అమరావతిపేరు చెప్పి ఇప్పటికే తెచ్చిన.. తేబోతున్న అప్పులు మరో రూ.52 వేల కోట్లు. ప్రపంచబ్యాంకు, ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంకుల నుంచి రూ.15 వేల కోట్లు, కేఎఫ్ డబ్ల్యు (జర్మనీ) నుంచి రూ.5 వేల కోట్లు, హడ్కో నుంచి 11 వేల కోట్లు.. సీఆర్డీఏ కమిట్ అయిన అప్పులు మరో 21  వేల కోట్లు రెయిజ్ చేస్తామని.. ఇవి కాక  మార్క్ ఫెడ్, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ ద్వారా మరో రూ.8 వేల కోట్లు, ఏపీ ఎండీసీ నుంచి తేబోతున్న అప్పులు రూ.5 వేల కోట్లు.. అన్నీ కలిపితే ఏకంగా లక్షా 45 వేల కోట్ల పైమాటే.. ఇది ఇంకో రికార్డు. ఎవరూ బద్దలు కొట్టలేనంత పెద్ద రికార్డు..  ఎన్ని అప్పులు చేసినా.. సూపర్ సిక్స్..సూపర్ సెవెన్ ఇచ్చారా? పేదలకేమైనా బటన్ నొక్కారా? అందరూ ఆలోచన చేయాలి? 

పోనీ మా ప్రభుత్వంలో గతంలో అమలు చేసిన పథకాలైనా కొనసాగుతున్నాయా? సూపర్ సిక్స్ లేదు.. సూపర్ సెవెనూ లేదు. మా ప్రభుత్వం గతంలో అమలు చేస్తా ఉన్న పథకాలు..పిల్లల చదువుల కోసం.. తల్లలకు ఇస్తా ఉన్న అమ్మ ఒడి పాయె.. రైతన్నలకు తోడుగా నిలబడే రైతు భరోసా పథకం పాయే.. వసతి దీవెన పాయె.. విద్యా దీవెన అరకొరా..చేయూత లేదు..ఆసరా లేదు.. సున్నా వడ్డీ .. ఆరోగ్య శ్రీ పూర్తిగా కూడా ఎగనామమే..వాహన మిత్ర, నేతన్న నేస్తం.. మత్స్యకార బరోసా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, చేదోడు, తోడు, లా నేస్తం అన్నీ.. గతంలో ఉన్న పథకాలన్నీ పాయె.. పిల్లలకు ట్యాబ్ లిచ్చే పథకం కూడా పాయె.. నేను అడుగుతూ ఉన్నా.. రూ.1,50,000 కోట్ల అప్పులు .. చేసినవి..చేయబోతున్నవి.. ఎవరి జేబులోకి పోతున్నాయి.. పోనీ ఈ 9 నెలల కాలంలో ఉద్యోగాలు ఎంత మందికి ఇచ్చారు.. ఉద్యోగాల పరిస్థితి ఏంటని చూస్తే.. ఒక్క కొత్త ఉద్యోగమూ ఇవ్వలేదు..కానీ.. ఊడగొట్టిన ఉద్యోగాలుః మాత్రం 2,60,000 వాలంటీర్ల ఉద్యోగాలు..పూర్తిగా తీసేశాడు.. బెవరేజ్ కార్పొరేటషన్ లో మరో 18 వేల మంది ఉద్యోగాలూ పాయె.. 2,60,000 వాలంటీర్ల ఉద్యోగాలు పాయె..ఫైబర్ నెట్..ఏపీ ఎండీసీ, పీల్డ్ అసిస్టెంట్లు, వైద్య ఆరోగ్య శాఖ ఇలా.. ఆయా విభాగాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు తీసేశారు.. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను కూడా సచివాలయాల నుంచి డిస్ లొకేట్ చేసి వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు ఉంటే అక్కడ సర్దేసే కార్యక్రమం చేశాడు..

ఉద్యోగుల‌నూ బాబు మోసం చేశారు:  

గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ఉద్యోగుల‌ను మిగ‌తా విభాగాల్లో స‌ర్దుతున్నారు. ఆ ఉద్యోగాలు కూడా పూర్తిగా కుదించే కార్య‌క్ర‌మం. 
వాలంటీర్ల‌ను ఎలా మోసం చేశారో చూశాం. ఎన్నిక‌ల స‌మ‌యంలో వ‌లంటీర్ల‌కు  రూ.10 వేలు గౌర‌వ‌వేత‌నం అన్నారు. అధికారంలోకి వ‌చ్చాక జీతం పాయో, ఉద్యోగం పాయో
ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు ఇచ్చిన 143 హామీలు పాయో
ప్ర‌భుత్వం వ‌చ్చిన వెంట‌నే ఉద్యోగుల‌కు ఐఆర్ అన్నారు..ఇంత వ‌రకు ఒక్క రూపాయి కూడా ఇవ్వ‌లేదు
ఉద్యోగుల‌కు మెరుగైన పీఆర్‌సీ అన్నారు. ఉన్న పీఆర్‌సీని ర‌ద్దు చేశారు. ఐఆర్ ఇవ్వ‌లేదు
1వ తేదీనే జీత‌మ‌న్నారు. 9 నెల‌ల కాలంలో ఒక్క నెల మిగ‌తా ఏ నెల‌లో కూడా 1వ తేదీ జీతం ఇవ్వ‌లేదు.
మూడు డీఏలు పెండింగ్‌, మెడిక‌ల్ రీయింబ‌ర్స్‌మెంట్ పెండింగ్‌, జీపీఎప్‌లు కూడా వాడేసుకుంటున్నారు.
ఈ రోజు రాష్ట్రంలో ప‌రిస్థితి ఇదీ.
ఆర్థిక విధ్వంసం అంటే ఇదీ..
మ‌రోవైపు ఏపీని సుస్థీర రాష్ట్రంగా మార్చేందుకు ఒక విజ‌న్‌తో రాష్ట్రం మెరుగ్గా ఉండేందుకు..ఎప్పుడు చూడ‌ని విధంగా వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో ఏకంగా నాలుగు పోర్టులు క‌ట్ట‌డం జ‌రిగింది.
మూల‌పేట‌, మ‌చిలీప‌ట్నం, రామ‌య‌ప‌ట్నం పోర్టులు క‌ట్టడం మొదలుపెట్టాం. ఇప్ప‌టికే 80 శాతం ప‌నులు పూర్తి అయ్యాయి.
మిగ‌తా పోర్టులు కూడా వేగంగా ప‌నులు జ‌రుగుతున్నాయి.
10 ఫిషింగ్ హార్బ‌ర్ల నిర్మాణాలు వేగ‌వంతంగా జ‌రుగుతున్నాయి. మా హాయంలోనే ఒక‌టో రెండో ప్రారంభించాం. ఎన్నిక‌ల కోడ్ కార‌ణంగా మ‌నం ప్రారంభించ‌లేక‌పోయాం. మోదీతో ఇప్పుడు ప్రారంభించారు.
నాగార్జున సాగ‌ర్‌, శ్రీ‌శైలం లాంటి ప్రాజెక్టులు క‌ట్టాలంటే సాధ్య‌మ‌య్యే ప‌ని క‌ష్ట‌మే
పోల‌వ‌రానికి ఎన్ని వేల కోట్లు అవుతున్నాయో చూస్తున్నాం.
రాబోయే త‌రాల‌కు రాష్ట్రాల‌కు సొంత రాబ‌డి పెర‌గాలంటే ఇలాంటి ఆస్థులు చేతుల్లో ఉండాలి.
ఇలాంటి వాటిలో స్కామ్‌లు చేస్తూ అమ్మ‌కానికి పెట్టారు. ఎవ‌రూ దీని కోసం ఫైనాన్స్ కోసం వెత‌కాల్సిన అవ‌స‌రం లేదు.
అలెడ్రీ వీటిని బ్యాంకుల‌కు టైఅప్ చేశాం. డ‌బ్బులు వ‌చ్చాయి. 
17 మెడిక‌ల్ కాలేజీలు మేం క‌ట్ట‌డం మొద‌లుపెట్టాం. టెరిష‌రీ కేర్ అన్న‌ది మ‌న రాష్ట్రానికి ఒక వ‌రం
హైద‌రాబాద్‌, చెన్నై, బెంగ‌ళూరు లాంటి న‌గ‌రాలు మ‌న‌కు లేవు. 
ఆసుప‌త్రికి టీచింగ్ అనుసంధానం అయితే పీజీ సీట్లు వ‌స్తాయి, డాక్ట‌ర్లు, నర్సింగ్ చ‌దివే వారు అందుబాటులోకి వ‌స్తారు. 
ఈ దృక్ప‌థంతో రాష్ట్రంలో కొత్త‌గా 17 మెడిక‌ల్ కాలేజీలకు మేం శ్రీ‌కారం చూడితే అందులో ఐదు మెడిక‌ల్ కాలేజీలు అప్ప‌టికే ప్రారంభించాం.
మ‌రో ఐదు మెడిక‌ల్ కాలేజీల‌కు ఈ ఏడాది క్లాస్‌లు ప్రారంభించే కార్య‌క్ర‌మం చేప‌ట్టాం.
ఇప్పుడేం చేస్తున్నారు. ఈ కాలేజీల‌ను త‌మ బినామీల‌కు అమ్మేసేందుకు సిద్ధ‌మ‌య్యారు.
కేంద్ర బ‌డ్జెట్లో 75 వేల మెడిక‌ల్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయని చెబుతున్నారు. ఈ ఏడాది 10 వేల సీట్లు ఇస్తామంటున్నారు.
ఇలాంటి ప‌రిస్థితిలో చంద్ర‌బాబు మాకు మెడిక‌ల్ సీట్లు వ‌ద్ద‌ని లేఖ‌లు రాస్తున్నారు.

చంద్ర‌బాబు గారి దృష్టిలో సంప‌ద సృష్టి అంటే దాని అర్థం త‌న ఆస్తులు పెంచుకోవ‌డం, త‌న‌వారి ఆస్తులు పెంచుకోవ‌డం మాత్ర‌మే సంప‌ద సృష్టి. రాష్ట్రంలో జ‌ర‌గ‌ని స్కామ్ లేదు. 

ఈరోజు రాష్ట్రంలో ఇసుక స్కామ్‌. గ‌తంలో రాష్ట్ర ప్ర‌భుత్వానికి సంవ‌త్స‌రానికి రూ.750 కోట్ల ఆదాయం వ‌చ్చేది. ఈ రోజు రూపాయి ఆదాయం రావ‌డం లేదు. ఇసుక చూస్తే మ‌నం గ‌తంలో అమ్మిన రేటు కంటే డ‌బుల్ రేట్‌కు అమ్ముతున్నారు. సంప‌ద సృష్టి ఎక్క‌డ జ‌రుగుతుంది..? చంద్ర‌బాబు జేబులో జ‌రుగుతుంది. రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఆదాయం ఆవిరైంది. 

గ‌వ‌ర్న‌మెంట్ రంగంలో న‌డిచే మ‌ద్యం షాపుల‌ను ప్రైవేటైజ్ చేశాడు. క‌రెక్ట్‌గా ఇదే ఆరోప‌ణ‌ల మీదనే అర‌వింద్ కేజ్రీవాల్ అనే వ్య‌క్తిని జైల్లో ప‌ట్టాడు. స‌క్సెస్ ఫుల్‌గా చేయ‌లేక మునుపే ఆయ‌న జైలుకు వెళ్లాడు. ఇక్క‌డ స‌క్సెస్ ఫుల్‌గా చేసి అర‌వింద్ కేజ్రీవాల్‌ను అక్క‌డ‌కు వెళ్లి తిట్టొస్తాడు. గ‌వ‌ర్న‌మెంట్ రంగంలో ఉన్న మ‌ద్యం షాపుల‌ను ప్రైవేటైజ్ చేశాడు. త‌న‌వాళ్ల‌కు షాపుల‌న్నీ ఇప్పించుకున్నాడు. ఆ షాపులు ఇప్పించే ప్ర‌క్రియ అంతా చూశారు. ఏర‌కంగా కిడ్నాప్‌లు జ‌రిగాయో.. ఏర‌కంగా ఎమ్మెల్యేలు, పోలీసులు అంద‌రూ కూడా వాళ్ల‌కు సంబంధించిన వాళ్ల‌ను మాత్ర‌మే టెండ‌ర్ల‌లో పాల్గొనేలా చేశారో అంద‌రూ చూశారు. అది ఆక్ష‌న్ కాదు.. అది లాట‌రీ. వీరికి కావాల్సిన వాళ్ల‌కు మాత్ర‌మే ఇప్పించుకునే ప్ర‌క్రియ‌. 

ఆ లాట‌రీలో కూడా మిగ‌తా వారు ఎవ‌రూ పాల్గొన‌కుండా, వీళ్లు మాత్ర‌మే పాల్గొనేలా పోలీసులు, గ‌వ‌ర్న‌మెంట్ న‌డ‌ప‌డం. మ‌ళ్లీ ఎమ్మెల్యేలు ప్ర‌తి గ్రామంలోనూ బెల్ట్ షాపుల‌కు ఆక్ష‌న్ పిలుపుస్తున్నారు. రెండు ల‌క్ష‌లు, మూడు ల‌క్ష‌ల‌కు ఆక్ష‌న్ పిలిచి వారికి ఇవ్వ‌డం, ఆ ఆక్ష‌న్ గెలుచుకున్న టీడీపీ కార్య‌క‌ర్త‌కు పోలీసులు స‌హాయ‌, స‌హకారాలు అందిస్తారు. మందు విచ్చ‌ల‌విడిగా అమ్ముకోవ‌చ్చు. బెల్ట్‌షాపు ఆక్ష‌న్ తీసుకున్న కార్య‌క‌ర్త ఎమ్మార్పీ రేట్ కంటే ఎక్కువ ధ‌ర‌కు మ‌న క‌ళ్ల ముందే అమ్ముకుంటున్నాడు. 

మ‌రి గ‌వ‌ర్న‌మెంట్ రంగంలోనే షాపులు ఉంటే ఆ ఆదాయం అంతా రాష్ట్ర ప్ర‌భుత్వానికి వ‌చ్చేదే క‌దా. రాష్ట్ర ప్ర‌భుత్వ ఆదాయం త‌గ్గుతుంది. చంద్ర‌బాబు నాయుడు జేబులో ఆదాయం పెరుగుతుంది. 

క‌ళ్ల ఎదుటే క‌నిపిస్తున్న స్కామ్‌లు ఇసుక‌, మ‌ద్యం మాఫియాలు, సిలికా, క్వార్జ్‌, ఫ్లైయాష్ ఏదైనా మాఫియా. కార్ట‌ల్ ఫామ్ చేయ‌డం. పెద్ద‌బాబు, చిన‌బాబు ఆధ్వ‌ర్యంలో న‌డిపిస్తున్నారు. పేకాట క్ల‌బ్‌లు.. ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గంలోనూ పేకాట క్ల‌బ్‌లు, చివ‌ర‌కు మండ‌ల స్థాయి, గ్రామ స్థాయిలో కూడా న‌డుపుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఏమి జ‌ర‌గాల‌న్నా.. మీకు ఫ్యాక్ట‌రీ న‌డ‌వాల‌న్నా, మైనింగ్ లీజ్ ఉంటే అది న‌డుపుకోవాల‌న్నా.. ఏ వ్యాపారం చేయాల‌న్నా.. ఎమ్మెల్యే ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి అంతోఇంతో ఇవ్వాలి. ఇస్తేనే ప‌నులు చేసుకోవ‌చ్చు. 

ఎమ్మెల్యే పెద్ద‌బాబుకు ఇంత‌, చిన‌బాబుకు ఇంత‌, ద‌త్త‌పుత్రుడికి ఇంత అని ఆయ‌న స‌ర్దితేనే.. నాకింత‌, నీకింత అని సాఫీగా జ‌రుగుతాయి. 

మొట్ట‌మొద‌టిసారిగా ఎంత దారుణ‌మైన క‌ర‌ప్ష‌న్ అంటే కాంట్రాక్ట‌ర్ల‌కు ప‌నులు ఇచ్చే కార్య‌క్ర‌మంలో మొబిలైజేష‌న్ అడ్వాన్ తీసుకువ‌చ్చారు. ఇంత‌కు ముందు ఇలాంటిది లేదు. ప‌నులు చేసిన‌ప్పుడు, చేసిన త‌రువాత బిల్లులు పెడితే ఆ బిల్లుల‌కు డ‌బ్బులు ఇచ్చే ప‌రిస్థితిని పూర్తిగా మార్చారు. అలాకాదు.. నువ్వు ప‌నులు చేయ‌క‌పోయినా ప‌ర్వాలేదు.. నీకు అలాట్‌మెంట్‌లోనే 10 శాతం మొబిలైజేష‌న్ అడ్వాన్స్ ఇచ్చేస్తాం.. అందులో 8 శాతం మాకు తిరిగి ఇచ్చేసెయ్‌.. 2 శాతం నీకు. ఇలా నీకింత‌.. నాకింత అని పంచుకుంటున్నారు. ఈరోజు ఇదే జ‌రుగుతంది. 

మా హ‌యాంలో టెండ‌ర్లు పిల‌వాలంటే జ్యుడీషియ‌ల్ ప్రివ్యూకు పంపించేవాళ్లం. అది ర‌ద్దు చేశారు. త‌రువాత టెండ‌ర్ల‌లో రివ‌ర్స్‌టెండ‌రింగ్ జ‌రిగేది. అంటే ఎవ‌రైనా టెండ‌ర్ల‌లో పాల్గొన్న త‌రువాత ఎల్‌1 వ‌చ్చిన వారు ఎవ‌రైతే ఉంటారో.. ఎల్‌2, ఎల్‌2, ఎల్‌4లు కూడా మ‌ళ్లీ ఆక్ష‌న్ ప‌ద్ధ‌తితో ఎల్‌1 కంటే త‌క్కువ కోడ్ చేసి మ‌ళ్లీ పాల్గొనేది రివ‌ర్స్‌టెండ‌రింగ్‌. ఆ ప్ర‌క్రియ తీసేశారు. మొబిలైజేష‌న్ అడ్వాన్స్ ఇస్తూ ప‌నులు అలాట్ చేయ‌డం, 10 శాతం మొబిలైజేష‌న్ అడ్వాన్స్ ఇవ్వ‌డం 8 శాతం వీళ్లు తీసుకోవ‌డం, 2 శాతం కాంట్రాక్ట‌ర్‌కు ఇవ్వ‌డం జరుగుతుంది. 

ఇవ‌న్నీ చేస్తావున్నారు కాబ‌ట్టే సంప‌ద సృష్టి అనేది జ‌ర‌గ‌డం లేదు. రాష్ట్ర ప్ర‌భుత్వ ఆదాయం ఆవిర‌వుతోంది.

చంద్ర‌బాబును ప్ర‌శ్నిస్తే తీవ్ర ప‌రిణామాలు ఉంటాయంటూ రెడ్‌బుక్ రాజ్యాంగం అమ‌లు చేస్తున్నారు
ప్ర‌జ‌లంటే చంద్ర‌బాబుకు వెట‌కారం అయిపోయింది
రాయ‌చోటిలో మీ హామీలేవి అని ప్ర‌శ్నిస్తే…సంపాదించే మార్గాలు చెప్పండి అంటూ వెట‌కారంగా మాట్లాడుతున్నాడు. మాటిచ్చిన వ్య‌క్తిని ప్ర‌శ్నిస్తే సంప‌ద ఎలా సృష్టించాలో చెవిలో చెప్ప‌మంటున్నాడు.
చీటింగ్లో పీహెచ్‌డీ తీసుకున్న ఈ వ్య‌క్తి..ఆయ‌న న‌ట‌న అన్న‌ది ఏ స్థాయిలో ఉంటుందంటే..తానిచ్చిన హామీలు తానే ఎగుర‌గొడ‌తాడు. ఆ త‌రువాత చాలా బాధ‌గా ఉంది..ఆవేద‌న‌గా ఉందంటాడు. రాష్ట్రం క్లిష్ట‌ప‌రిస్థితిలో ఉందంటాడు.భ‌యం వేస్తుందంటాడు. ఇవ‌న్నీ కాకుండా మాట్లాడేట‌ప్పుడు దాన వీర శూర క‌ర్ణ సినిమాలో ఎన్టీఆర్‌ను మించి చంద్ర‌బాబు న‌టిస్తున్నాడు.
చంద్ర‌బాబును న‌మ్మ‌డం అంటే చంద్ర‌ముఖిని నిద్ర‌లేప‌డ‌మే. చంద్ర‌బాబును న‌మ్మ‌డం అంటే పులి నోట్లో త‌ల పెట్టిన‌ట్లే అని చెప్పాను. ప్ర‌జ‌లు పొర‌పాటుప‌డ్డారు.

ఈ చంద్ర‌ముఖిని నిద్ర‌లేపి రాష్ట్ర ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు
చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌ను వంచించే కార్య‌క్రమం, మోసం చేసే కార్య‌క్ర‌మం ఏదైతే ఉందో దాన్ని ప‌ద్ధతి ప్ర‌కారం స్లోగా పాయిజ‌న్ ఎక్కిస్తారు.
త‌న అబ‌ద్ధాల ఫ్యాక్ట‌రీ నుంచి స్లోగా తీస్తే..దాన్ని ఎల్లో మీడియా ప‌ద్ధ‌తి ప్ర‌కారం రాస్తారు. అవి అబ‌ద్ధాలు అని తెలిసీ కూడా అవే నిజాలు అన్న‌ట్లుగా ఈనాడు, ఆంధ్ర‌జ్యోత‌, టీవీ5 అలా బుల్డోజ్ చేస్తుంటాయి 

మొన్నీమద్య నీతి ఆయోగ్ రిపోర్టు పేరుతో కొత్త డ్రామాకు తెరతీశాడు. ఈ మధ్య కాలంలో.. నా ఆబ్సెసెన్స్ లో నీతి ఆయోగ్ ప్రజెంటేషన్ అని చెప్పి చంద్రబాబుగారు కొత్త డ్రామా చేశాడు.. చంద్రబాబు ప్రజెంట్ చేసిన రిపోర్టులు ఏంటి.. వాస్తవాలు ఏంటనేది కూడా నేను చెబుతా.. 
ఎవరైనా కంపేర్ చేసేటప్పుడు.. తన ఐదేళ్లు.. మన ఐదేళ్లు మొత్తంగా కంపేర్ చేసి ఇవి వాస్తవాలు అని చెప్పాలా? లేదా? చిత్తశుద్ధి ఉన్నవాళ్లు అయితే.. ఈ పెద్ద మనిషి చంద్రబాబు ఏంచేశాడు.. ఆయన పాలనలో బెస్ట్ ఇయర్ తీసుకున్నాడు.. ఒకటే ఒక సంవత్సరం..2018-19.. మన పాలనలో వరస్ట్ ఇయర్ తీసుకున్నాడు..ఒకే ఒక సంవత్సరం 2022-23 సంవత్సరం.. సెలక్టివ్ గా పోలిక చూపిస్తూ.. చాలా అన్యాయమైన పరిస్థితులు ఉన్నట్లు చూపించాడు..నేను మీకు మన పాలనలో ఐదేళ్ల డేటా.. చంద్రబాబు పాలనలో ఐదేళ్ల డేటా చూపిస్తా..అందులో చంద్రబాబుగారు చెప్పిన సంవత్సరం డేటా కూడా కలిపి ఇస్తా..దాని తర్వాత మీరే చెప్పండి.. ఎవరు ఆర్థిక విధ్వంసం చేశారో.. మీరే చెప్పండి.. మా హయాంలో చాలా చాలా గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఉంది.. మా హయాంలో రెండున్నరేళ్లు కోవిడ్.. చంద్రబాబు గారి హయాంలో కోవిడ్ లేదు..పాండమిక్ పరిస్థితులు లేవు..
క్యాపిటల్ ఎక్స్ పెండిచర్ ఒకసారి గమనించండి.. ఎవరు ఆర్థిక విధ్వంసం చేశారో అన్నది గమనిద్దాం.. 

2014-19 మధ్య చంద్రబాబుగారి హయాంలో ఐదేళ్లో మూలధన వ్యయం.. ఆస్తుల కల్పనలో భాగంగా చంద్రబాబు హయాంలో ఏ మేరకు క్యాపిటల్ ఎక్స్ పెండిచర్ చేశారు అంటే.. యావరేజ్ గా రూ.13,860 కోట్లు వ్యయం చేస్తే.. మా హయాంలో కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో ఒక వైపు ప్రజలకు తోడుగా ఉంటూ.. ఆదుకుంటూ.. మరోవైపు క్యాపిటల్ ఎక్స్ పెండిచర్ కింద మా యావరేజ్ ఎక్స్ పెండించర్ 15,632 కోట్లు ముము ఖర్చు చేశాం.. ఇది కాగ్ రిపోర్టు.. ఎవరి హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని నేను అడుగుతున్నా? 

ఇదే చంద్రబాబుగారు సోషల్ సర్వీసెస్ కింద కేవలం ఒకే ఒక సంవత్సరం చూపెట్టి.. తాను దానికింద ఎంత ఖర్చు చేశాడో చూపించాడు.. మూలధన వ్యయంలో సోషల్ సర్వీసెస్ కింద 2018-19లో రూ.2,866.11 కోట్లంట.. 2023-24లో 447.78 కోట్లు అంట..ఆయన హయాంలో ఎంతో ఖర్చు చేసినట్లు చెప్పుకొచ్చాడు. కానీ వాస్తవానికి ఆ ఐదేళ్ల పిరియడ్ ను ఒకసారి గమనిస్తే.. చంద్రబాబు గారు రూ. రూ.2,437.43 కోట్ల్లు ఖర్చు చేస్తే.. వైయస్సార్ సీపీ హయాంలో దానికి రెట్టింపు రూ.5,224.83 కోట్లు సోషల్ సర్వీసెస్ పై ఖర్చు చేయడం జరిగింది. ఇదికూడా  కాగ్ రిపోర్టు ప్రకారం. ఈ రకంగా వక్రీకరించడం.. కేవలం ఆయన బెస్ట్ ఇయర్.. మన వరస్ట్ ఇయర్ తీసుకుని.. రాష్ట్రం విచ్చిన్నమైనట్లుగా ప్రొజెక్ట్ ఇవ్వడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా? చంద్రబాబగారి  మనస్థత్వానికి, వక్రీకరణకు ఇది అద్దం. ఏ రకంగా చూసుకున్నా కూడా మా ప్రభుత్వం అన్ని రకాలుగా రాష్ట్రాన్ని ముందడుగులో పెట్టాం.. 
2014-19 మధ్య కాలంలో దేశ జీడీపీలో రాష్ట్ర వాటా ఎంత..? ఇది వేరీ వెరీ సిగ్నిఫికెంట్ పాయింట్.. రాష్ట్రంలో ఎవరి హయాంలో అడుగులు ముందుకు పడ్డాయి. ఎవరి హయాంలో వెనక్కి పడ్డాయి. అనేది గమనిద్దాం..

చంద్రబాబా హయాంలో ఐదేళ్లలో దేశ జీడీపీలో రాష్ట్ర వాటా 4.47 శాతం     అయితే.. వైయస్సార్ సీపీ ఆ హయాంలో ఆ వాటా 4.80 శాతానికి పెరిగింది. ఎవరి హయాంలో రాష్ట్రం విధ్వంసమైంది.. ఎవరి హయాంలో ముందుకు పరిగెట్టింది అనేది దీని ద్వారా తెలుస్తోంది. దీని సోర్స్ ఎంవోఎస్పీ.. నేను చెప్పేది ఎవిడెన్స్, సోర్స్ తో చెబుతున్నాను.. 
చంద్రబాబుగారు దిగిపోయే నాటికి ఆయన హయాంలో తలసరి ఆదాయం దేశంలో మనం 18వ స్థానంలో ఉంటే..అదే వైయస్సార్ సీపీ ఐదేళ్ల పాలన పూర్తయ్యే నాటికి తలసరి ఆదాయం విషయంలో 15 వ స్థానానికి పెరిగాము. మన హయాంలో దేశంతోనే పోటీ పడ్డాం.. దేశం కంటే మెరుగైన ఫలితాలు ఇచ్చాం.. దేశ జీడీపీలో ఏ రంగంలో తీసుకున్నా ఏపీ దేశంకన్నా బెటర్ ఫెర్ ఫాం చేసింది. 2019-24 మధ్య  ఐదేళ్లలో దేశ జీడీపీ 9.34 అయితే.. రాష్ట్రం 10.23 శాతంతో దేశం కంటే మెరుగైన ఫనితీరు కనబరిచింది.

ఎవ‌రిది ఆర్థిక విధ్వ‌సం

పారిశ్రామిక‌రంగం విష‌యంలో ఎవ‌రి హ‌యాంలో రాష్ట్రం ప‌రిగెత్తింది ? ఎవ‌రి హ‌యాంలో పురోగ‌తి క‌నిపించింది అంటే 2018-2019లో పారిశ్రామిక‌రంగంలో ఏపీ 11వ స్థానంలో ఉంటే వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో 2023-2024 నాటికి  ఏకంగా 9వ స్థానానికి పెరిగాం. రెండున్న‌రేళ్లు కోవిడ్ ఉన్నా కూడా ఫ‌ర్మామెన్స్ ఇది. మ‌రి ఎవ‌రిది ఆర్థిక విధ్వ‌సం. అంద‌రూ ఆలోచ‌న చేయాలి..ఆర్‌బీఐ సోర్స్ ప్ర‌కార‌మే ఈ లెక్క‌ల‌న్నీ..
చంద్ర‌బాబు ప్ర‌తి అడుగులోనూ వ‌క్రీక‌ర‌ణే. అబ‌ద్ధ‌మే..
చంద్ర‌బాబు దిగిపోయే నాటికి క‌ట్టాల్సిన వ‌డ్డీల వృద్ధి రేటు ఎక్కువ‌గా ఉంది
రాష్ట్ర ఆదాయం వృద్ధి రేటు క‌న్నా చెల్లించాల్సిన వృద్ధి రేటు ఎక్కువగా ఉంటే డెట్ ప‌రంగా స‌స్టేయిన‌బుల్ కాద‌ని చంద్ర‌బాబు ఒక నిర్వ‌చ‌నం చెప్పారు. ఈ మాదిరిగా క్యాలికిలేష‌న్ చేయ‌క‌పోయినా ఆయ‌న చెప్పిన థియ‌రీ ప్ర‌కారం ఏపీలో మ‌న పాల‌న‌లో ఏం జ‌రిగిందో చూపిస్తారు త‌ప్ప‌..ఆయ‌న హ‌యాంలో ఏం జ‌రిగిందో చెప్ప‌డు.

ఇదే డెత్ సస్టేయిన‌బులిటీ 2014-2019 మ‌ధ్య చూస్తే..అప్ప‌ట్లో ఎలాంటి కోవిడ్ లేక‌పోయినా స‌రే చంద్ర‌బాబు పాల‌న‌ను గ‌మ‌నిస్తే కేంద్ర ప్ర‌భుత్వ గుణంకాలు ప‌రిశీలిస్తే క‌ట్టిన వ‌డ్డీల వృద్ధిరేటు 9.26 శాతం ఉంటే జీడీపీలో 10.97 శాతం . ఇది చంద్ర‌బాబు చెప్పిన ధియ‌రీ ప్ర‌కారం బాగానే ఉంద‌నే ఒక డేటా
చంద్ర‌బాబు నిర్వ‌చ‌నం ప్ర‌కారం ఆయ‌న హ‌యాంలో ఎలా ఉందో గ‌మ‌నిస్తే..ఆయ‌న దిగిపోయే నాటికి రాష్ట్రం ప‌రిస్థితి ఏంటంటే కట్టాల్సిన వ‌డ్డీల వృద్ధి రేటు 15.43 శాతం ఉంటే రాష్ట్రం జీఎస్‌డీపీ 13.26 శాతం. ఈ ధీయ‌రీ ప్ర‌కారం డెట్ స‌స్టేయిన‌బులిటీ చంద్రబాబు దిగిపోయే నాటికి రాష్ట్ర ప‌రిస్థితి ఇది. ఆయ‌న దిగిపోయే నాటికి క‌ట్టాల్సిన వ‌డ్డీరేటు ఎక్కువ‌గా ఉంది. దీన్ని ఆయ‌న తెలివిగా ప‌క్క‌న‌పెట్టారు.
మ‌న ప్ర‌భుత్వంలో కోవిడ్ వ‌చ్చింది. రెండున్న‌రేళ్లు అత‌లాకుల‌మైన ప‌రిస్థితి. రాష్ట్రంలో ఆదాయ వ‌న‌రులు త‌గ్గాయి. 2019-2024లో దేశానికి సంబంధించి ప‌రిస్థితి గ‌మ‌నిస్తే వ‌డ్డీల‌కు సంబంధించిన వృద్ధిరేటు 12.8 శాతం అయితే దేశానికి సంబంధించి గ్రోత్‌రేటు 9.6 శాత‌మే. రాష్ట్రం ప‌రిస్థితి చూస్తే వ‌డ్డీ ల వృద్ధి రేటు 13.9 శాతానికి త‌గ్గించ‌గ‌లిగాం.  రాష్ట్రానికి సంబంధించి జీఎస్‌డీపీ 10.23 శాతం న‌మోదు చేయించి చూపించాం. ఇక్క‌డ కూడా మా ప్ర‌భుత్వ హ‌యాంలోనే ప్ల‌స్సే.  ఇందుకు విరుద్ధంగా చంద్ర‌బాబు ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌సం. 

2019-24 మ‌ధ్య ప‌రిస్థితి ఏంట‌ని గ‌మ‌నించిన‌ట్లు అయితే.. మ‌న రాష్ట్రంలోనే కాదు, కేంద్రంలోనే కాదు, ప్ర‌పంచంలో తీసుకున్నా ఇదే ప‌రిస్థితి. 

వాస్త‌వాలు ఇవి అయితే.. (టేబుల్‌-7) ఎవ‌రి హ‌యాంలో రాష్ట్రం విచ్ఛిన్నం అయింది. ఎవ‌రి హ‌యాంలో అప్పులు ఎలా ఉన్నాయ‌ని ఒక‌సారి గ‌మ‌నించిన‌ట్ల‌యితే.. చంద్ర‌బాబు అన్నీ అబ‌ద్ధాలు, మోసాలే చేస్తాడు. చంద్ర‌బాబు ఎన్నిక‌ల స‌మ‌యంలో రాష్ట్రం అప్పులు రూ.14 ల‌క్ష‌ల కోట్లు అని ఊద‌ర‌గొట్టాడు. రాష్ట్రం శ్రీ‌లంక అయిపోతుంద‌ని, మ‌న్ను, పాడు, ప‌ర‌దేశీ అని చెప్పి బండ‌లు వేశాడు. గ‌వ‌ర్న‌ర్ గారి ప్ర‌సంగానికి వ‌చ్చేస‌రికి త‌గ్గిపోయాడు. రాష్ట్రం అప్పులు రూ.10 ల‌క్ష‌లు అన్నాడు. అప్పుడ‌ప్పుడు శ్వేత‌ప‌త్రాలు రిలీజ్ చేస్తాడు. అప్పుడు రాష్ట్ర అప్పులు రూ.12.93 ల‌క్ష‌ల కోట్లు అంటాడు. చివ‌ర‌కు బ‌డ్జెట్ ప్రవేశ‌పెడితే అప్పులు రాష్ట్రానికి ఎంత ఉన్నాయో చెప్ప‌క త‌ప్ప‌దు అని చెప్పి.. బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌డం కూడా పోస్ట్‌పోన్ చేశాడు. ఇక చివ‌ర‌కు బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌క త‌ప్ప‌ద‌ని.. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో న‌వంబ‌ర్‌లో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌క త‌ప్ప‌లా. 

ఎవ‌రైనా, ఎప్పుడైనా గ‌మ‌నించారా..? ఏ రాష్ట్ర ప్ర‌భుత్వ‌మైనా న‌వంబ‌ర్‌లో ప్ర‌వేశ‌పెట్ట‌డం. బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌డంలో మూడు నెల‌లు ఆల‌స్యం. ఒక్క చంద్ర‌బాబు నాయుడు హ‌యాంలోనే ఆ జిమ్మిక్కుల‌న్నీ చూస్తాం. ఎందుకంటే బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడితే ఆ డాక్యుమెంట్ల‌లో రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఉన్న అప్పులెన్ని ఉన్నాయో రాయాలి. అప్పులు చూపిస్తే ఆ త‌రువాత చంద్ర‌బాబు మొస‌లి క‌న్నీరు కార్చ‌లేడు.. డ్రామాలు ఆడ‌లేడు.. జ‌గ‌న్ మీద చెప్పిన‌వ‌న్నీ త‌ప్పులే అని తేలిపోతాయి. కాబ‌ట్టి బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌డం న‌వంబ‌ర్ వ‌ర‌కు పోస్టుపోన్ చేశాడు. 

న‌వంబ‌ర్‌లో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టేస‌రికే.. త‌నంత‌ట తానే బ‌డ్జెట్ డాక్యుమెంట్లు ప్ర‌వేశ‌పెట్టేట‌ప్పుడు ఏపీ అప్పులు రూ.6,46,531 కోట్లు అని చెప్పి తాను ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌లో తానే ఒప్పుకోక చంద్ర‌బాబుకు త‌ప్ప‌లేదు. ఇంత‌కంటే దారుణ‌మైన మ‌నిషి, ప‌రిస్థితి బ‌హుశా ఎక్క‌డా ఉండ‌దు. చంద్ర‌బాబు నాయుడు ఎప్పుడూ ఇలాంటి మోసాలు చేస్తా ఉంటాడు. 

ఏర‌కంగా బ‌డ్జెట్ డాక్యుమెంట్ల‌లో రాష్ట్ర అప్పు రూ.6.46 ల‌క్ష‌ల కోట్లు అని చూపిస్తూ.. మ‌రి ఏర‌కంగా రూ.14 ల‌క్ష‌ల కోట్లు, రూ.12 ల‌క్ష‌ల కోట్లు, రూ.10 ల‌క్ష‌ల కోట్లు అని ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్ట‌డం ఎంత వ‌ర‌కు ధ‌ర్మం అని అంద‌రూ క్వ‌శ్చ‌న్ చేయాలి. మీడియా కూడా ఈ డాక్యుమెంట్ల‌ను చూపించాలి. 

చంద్ర‌బాబు నాయుడు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే.. ప్ర‌జ‌లంద‌రికీ తెలియాల్సిన అంశం ఏమిటంటే.. ఏ ప్ర‌భుత్వం అయినా కూడా ఎఫ్ఆర్బీఎం ప్ర‌కారం రాష్ట్ర జీఎస్‌డీపీలో 3 శాతం, 3.5 శాతం సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ డిసైడ్ చేస్తుంది. కేంద్రం డిసైడ్ చేసిన ప్ర‌కార‌మే ఎవ‌రైనా అప్పులు చేయ‌గ‌లుగుతారు. అంత‌కంటే ఎక్కువ చేసే అవ‌కాశం చాలా త‌క్కువ‌గా ఉంటుంది. ఒక్క చంద్ర‌బాబు నాయుడు పాల‌న‌లో మాత్రం.. అప్ప‌ట్లో కేంద్ర ప్ర‌భుత్వంలో ఆయ‌నే చ‌క్రం తిప్పుతున్నాడు కాబ‌ట్టి.. ఆయ‌న హ‌యాంలో (టేబుల్‌-7) ఎక్సెస్ బారోయింగ్ చంద్ర‌బాబు హ‌యాంలో 31,082 వేల కోట్ల రూపాయ‌లు (అడిషిన‌ల్ బారోయింగ్‌) అద‌నంగా చేశాడు.  

టేబుల్‌-7లో క్లియ‌ర్‌గా చంద్ర‌బాబు 5 సంవ‌త్స‌రాలు, వైఎస్సార్ సీపీ 5 సంవ‌త్స‌రాల‌కు సంబంధించిన డేటా.. 
చంద్ర‌బాబు హ‌యాంలో చేయాల్సిన బారోయింగ్ కంటే రూ.31,082 కోట్ల ఓవ‌ర్ బారోయింగ్ జ‌రిగింది. మ‌న ఖ‌ర్మ ఏంటంటే.. ఆయ‌న ఓవ‌ర్ బారోయింగ్ మ‌న హ‌యాంలో రూ.17 వేల కోట్లు ఖ‌ర్చు చేశాం.

టేబుల్ 9 పరిశీలిస్తే…  చంద్రబాబుగారు వచ్చాక.. రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం కూడా తగ్గింది. చంద్రబాబుగారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి  జూన్ నుంచి డిసెంబర్ వరకు ఈ ఏడు నెలలకు సంబంధించిన స్టేట్ ఓన్డ్ రెవెన్యూస్ తీసుకున్నారు. చంద్రబాబు గారి హయాంలో గత ఐదేళ్ల పాలన, మన వైయస్సార్ సీపీ పాలనలో స్టేట్ ఓన్డ్ రెవెన్యూస్ తీసుకున్నారు..

వైయస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో జూన్ నుంచి డిసెంబర్ వరకు వచ్చిన ఆదాయం స్టేట్ ఓన్డ్ రెవెన్యూ ఎంత అని చూస్తే…50,804 కోట్లు..చంద్రబాబుగారి పాలనలో చూస్తే..జూన్ నుంచి డిసెంబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం తగ్గింది..50,544 కోట్లు. మామూలుగా 10 శాతమైనా ఆదాయాలు పెరుగుతాయి.. కానీ చంద్రబాబు గారి హయాంలో ఈ ఆరునెలల్లో ఆదాయం .5 శాతం నెగెటివ్ గ్రోత్.. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఆయన జేబుల్లోకి పోతోంది. .5 శాతం నెగెటివ్ గ్రోత్.. 2023 జూన్ నుంచి 2023 డిసెంబర్ వరకు మన హయాంలో రూ. 50,804 కోట్లు వస్తే.. ఆయన హయాంలో .5 శాతం తగ్గింది. అంటే. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు కూడా తగ్గుతాయి.. ఇది అందరికీ తెలిసిన థియరీ.. మరి రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాల్లో .5 శాతం నెగెటివ్ గ్రోత్ రేట్ చూపిస్తుంటే.. రాష్ట్రానికి సంబంధించిన జీఎస్ డీపీ తగ్గాలి కదా? లేదు..

 చంద్రబాబుగారు 13  శాతంగా జీఎస్ డీపీ  పెరిగిందని రిపోర్టు ఇచ్చాడు.. ఏ స్థాయిలో వాళ్లు అబద్ధాలు ఆడుతున్నా.. నెంబర్స్ తో ఏస్థాయిలో ప్లే చేస్తున్నారో…ఇంతకన్నా ఏదన్నా నిదర్శనం ఉందా ? ఇలాంటి తప్పుడు ప్రచారాలు చంద్రబాబుగారికి కొత్తేమీ కాదు.. ఇలా రొటీన్ గా అబద్ధాలు, రొటీన్ గా తప్పుడు ప్రచారాలు చేయడం అలవాటే.. మీకు గుర్తుండే ఉంటుంది. 
చంద్రబాబుగారు అబద్ధాలు ఏస్థాయిలో ఉంటాయంటే.. 2016లో దావోస్ కు వెళ్లినప్పుడు రక్షణ పరికరాల ప్లాంట్ లాక్ హీడ్ వచ్చేస్తుందన్నాడు.. ఈనాడులో ఏ రకంగా బిల్డప్ ఇచ్చారంటే.. అంతా ఈనాడే… వీరంతా ఒక దొంగల ముఠా.. దోచుకో.. పంచుకో.. తినుకో…వీరంతా సభ్యులు.. మభ్య పెట్టడం.. మోసం చేయడం..అబద్ధాలు ఆడటం వీరికి పరిపాటి.. అందరికీ తెలియాలి.. 2017లో దావోస్ కు వెళ్లినప్పుడు విశాఖలో హై స్పీడ్ రైళ్ల కర్మాగారం అన్నాడు..హైబ్రీడ్ క్లౌడ్ వచ్చేస్తుందన్నాడు..సౌదీ ఆరామ్ కో వచ్చేస్తుందన్నాడు..2018లో దావోస్ వెళ్లినప్పుడు  రాష్టానికి 150 సంస్థలు వస్తాయన్నాడు.. కనీసం క్వశ్చన్ మార్క్ లు కూడా ఉండవు. అన్నీ కన్ఫర్మ్ న్యూస్ లు.. రాష్ట్రానికి ఎయిర్ బస్ ? ఇదొక్కదానికి క్వశ్చన్ మార్క్.పెట్టాడు.. 2019 జనవరిలో కూడా దావోస్ వెళ్లాడు.. హ్యాపీగా ఏపీకి జెన్ ప్యాక్.. ఈ మాదిరిగా బిల్డప్ ఇవ్వడం చంద్రబాబుకు ఏమాత్రం కొత్త కాదు.. మనందరికీ పిల్లలున్నారు. వాళ్లకేం చెబుతాం.. అబద్ధాలు చెప్పకూడదు.. మోసం చేయకూడదు.. మన స్వార్థం కాదు ముఖ్యం.. ఎదుటి వారికి మంచి చేయడం ముఖ్యం.. మాట తప్పకూడదు.. విలువలుండాలి. విశ్వసనీయత పెంచుకోవాలి..అలాగే బతకాలి అని మన పిల్లలకు చెబుతాం.. బడుల్లో టీచర్లు కూడా ఇదేగా చెప్పేది. ఒక్క చంద్రబాబు మాత్రం..తన కొడుకు దగ్గర నుంచి పార్టీలో ఉన్న ఎవరికైనా కూడా.. చిన్న నాయకుల దగ్గర నుంచి పెద్ద నాయకుల దాకా … చెప్పే థియరీ.. అబద్ధాలు చెప్పు.. మోసం చేయి.. మన స్వార్థమే ముఖ్యం.. మన అవసరమే ముఖ్యం. అందుకోసం ఏం చేసినా తప్పులేదు.. ఏం మోసం చేసినా తప్పులేదు.. అది కూడా ఒక ఘన కార్యం.. అని చెప్పి నేర్పించే వ్యక్తి ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నారంటే అది చంద్రబాబు మాత్రమే..వెన్నుపోటు పొడిచినా తప్పులేదు.. సొంత మామను పొడిచినా తప్పులేదు.. ఏ విషయంపైనైనా, ఎప్పుడైనా మాట మార్చొచ్చు..ఇవన్నీ చంద్రబాబు నేర్పిస్తాడు.. 

ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు కనిపిస్తున్నాయి.. 
మొట్టమొదటిసారిగా రాష్ట్రానికి ప్రజలకు చంద్రబాబుపై నమ్మకం ఎంతగా సన్నగిల్లిందంటే..చంద్రబాబుగారు దావోస్ లో కనీసం ఒక ఎంవోయూ కూడా చేసుకోలేకపోయాడంటే.. రాష్ట్రానికి సంబంధించిన పలుకుబడి, చంద్రబాబుపై ఉన్న అభిప్రాయం ఎలాంటిది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. పెట్టుబడి పెడతామని జిందాల్ లాంటి సంస్థ వస్తే.. ఎవరైనా రెడ్ కార్పెట్ వేసి వెల్ కమ్ చేస్తారు. ఈయనేం చేశాడు..వాళ్లపై కేసులు పెట్టి.. వాళ్ల రెప్యుటేషన్ చెడగొట్టి..వాళ్లను వెళ్లగొట్టాడు.. ఇదే చంద్రబాబు సమక్షంలో జిందాల్ వాళ్లు మహారాష్ట్ర వాళ్లతో ఎంవోయులు చేసుకున్నారు.. దావోస్ లోనే.. మన హయాంలో.. మన మోడీ గారి చేత చంద్రబాబుగారు మీటింగ్ పెట్టించాడు.. ఆ ఎన్టీపీసీ, బీపీసీఎల్ అన్ని మన హయాంలో పెట్టినటువంటివే.. మళ్లీ ప్రారంభించాడు.. మోడీగారిని తీసుకువచ్చి..మళ్లా ఏదో ఆయన కొత్తగా సాధించినట్లు బిల్డప్.. పోనీ అవకాశం ఉన్న చోట.. చంద్రబాబు ఏదైనా ప్రభావం చూపుతున్నాడా? అదైనా ఆలోచన చేద్దాం.

అవ‌కాశం ఉన్న చోట చంద్ర‌బాబు ఏమైనా ప్ర‌భావం చూపుతున్నారా? ఇటీవ‌ల కేంద్ర బ‌డ్జెట్‌లో రాష్ట్రానికి వ‌చ్చింది ఏమీ లేదు. 12 మంది ఎంపీలు ఉన్న బిహార్ రాష్ట్రానికి జేడీయూ పార్టీ  మఖానా బోర్డు, వెస్ట్రన్ కోసి కెనాల్ ప్రాజెక్ట్ ,  పుడ్ టెక్నాల‌జీ ప్రాజెక్టు,  గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్ పోర్టు, మ‌రో నాలుగు కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణం, పాట్నా ఐఐటీ ఆధునీకీక‌ర‌ణ వంటి ప్ర‌త్యేక‌త‌లు ఆ రాష్ట్రాకి వ‌చ్చాయి.

 

ఇది విధ్వంసం కాదా?

కేంద్రం నుంచి చంద్ర‌బాబు ఏమీ సాధించ‌క‌పోగా, ఉన్న పోల‌వ‌రం ప్రాజెక్టును నాశ‌నం చేశారు. పోల‌వ‌రం ప్రాజెక్టు  విష‌యంలో చంద్ర‌బాబు ఏ గ‌డ్డి తింటున్నారు. మ‌రి ఇది విధ్వంసం కాదా?

దేశ‌వ్యాప్తంగా ఐదేళ్ల‌లో 75 వేల మెడిక‌ల్ సీట్లు పెంచుతాం. ఇందులో 10 వేల మెడిక‌ల్ సీట్లు ఈ ఏడాది  ఇస్తామ‌ని కేంద్రం చెబుతుంటే..చంద్ర‌బాబు మాత్రం కేంద్రం మెడిక‌ల్ సీట్లు వ‌ద్ద‌ని వెన‌క్కి తిప్పుతున్నారు. ఇలా చెప్పిన రాష్ట్రం ఒక్క ఆంధ్రప్ర‌దేశ్ మాత్ర‌మే. భావి త‌రాల‌కు మేలు చేసే మెడిక‌ల్ కాలేజీ సీట్లు వ‌ద్దంటున్నారు. ఇది విధ్వంసం కాదా?. 

9నెల‌ల్లో చంద్ర‌బాబు చేసిన విధ్వంసాలు అన్నీ ఇన్నీ కాదు.  పిల్ల‌ల‌ను బ‌డుల‌కు పంపేలా త‌ల్లుల‌ను  మోటివేట్ చేస్తూ తీసుకువ‌చ్చిన అమ్మ ఒడి ప‌థ‌కాన్ని తీసేశారు. ఇది విధ్వంసం కాదా?
స్కూళ్ల‌లో నాడు-నేడు ప‌నులు నిలిపివేశారు
ఇంగ్లీష్ మీడియం, ఐబీ వ‌ర‌కు ప్ర‌యాణాన్ని ఆపేశారు. పిల్ల‌ల‌కు ప్ర‌పంచ స్థాయి ప్ర‌మాణాల‌తో అందిస్తున్న విద్య‌ను దూరం చేశారు.
8వ త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు ప్ర‌తి ఏటా ట్యాబ్‌ల పంపిణీ ఆపేశారు.
స‌బ్జెక్ట్ టీచ‌ర్ల కాన్సెప్ట్‌కు గ్ర‌హ‌ణం ప‌ట్టించారు.
పిల్ల‌లు గొప్ప‌గా చ‌దివించేందుకు వ‌స‌తి దీవెన ప‌థ‌కాన్ని అమలుచేశాం. దీన్ని అర‌కొర‌గా అమ‌లు చేయ‌డం వారి జీవితాల‌తో చెల‌గాట‌మాడ‌టం విధ్వంసం కాదా?
ఉన్న ప‌థ‌కాల‌న్నీ నిలిపివేశారు. ఇది ప్ర‌జ‌ల జీవితాల‌తో చెల‌గాటం కాదా?  ఇది విధ్వంసం కాదా? 
ఆరోగ్య‌శ్రీ ఊపిరి తీసేశారు. ఆరోగ్య ఆస‌రా క‌నిపించ‌కుండా చేశారు. ఈ రోజు పేద‌లు వైద్యం చేయించుకోలేని ప‌రిస్థితికి నెట్టేశాడు.
రైతుల‌కు రైతు భ‌రోసా ఇవ్వ‌కుండా నిలిపివేశాడు. సున్నా వ‌డ్డీ తీసేశాడు. ఉచిత పంట‌ల బీమా ర‌ద్దు చేశాడు. రైతుల‌ను నాశ‌నం చేస్తూ ఆర్‌బీకే వ్య‌వ‌స్థ‌ను నిర్వీర్యం చేశాడు. ఈ-క్రాప్ విధానం ర‌ద్దు చేశాడు.
అక్క‌చెల్లెమ్మ‌ల‌కు అందే వైయ‌స్ఆర్ చేయూత‌, సున్నా వ‌డ్డీ, ఆస‌రా, అమూల్ వంటి ప‌థ‌కాల‌ను ర‌ద్దు చేయ‌డం వారి జీవితాల్లో విధ్వంసం కాదా?
పేద‌వాడికి తోడుగా ఉంటూ నేత‌న్న నేస్తం, మ‌త్స్య‌కార‌భ‌రోసా, చేదోడు, తోడు, వాహ‌న‌మిత్ర‌..ఇవ‌న్నీ నిలిపివేయ‌డం బ‌ల‌హీన వ‌ర్గాల‌కు తీర‌ని ద్రోహం చేయ‌డం విధ్వంసం కాదా? 
ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వ‌క‌పోగా, ఉన్న ఉద్యోగాల‌ను ఊడ‌గొట్ట‌డం, వాలంటీర్ల జీవితాల‌తో ఆడుకోవ‌డం, ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను వాడుకొని వ‌దిలివేయ‌డం విధ్వంసం కాదా?
రాష్ట్రానికి సంబంధించిన వ‌న‌రులు రాకుండా చేయ‌డం, రాష్ట్రం ఆదాయం పెంచ‌కుండా త‌న సొంత జేబు ఆదాయం పెంచుకునేందుకు ఇసుక‌, మ‌ద్యం, మ‌ట్టి, క్వార్డ్జ్ దోచేయ‌డం విధ్వంసం కాదా?
అధికారంలోకి రాగానే ప్ర‌శ్నించే స్వ‌రం ఉండ‌కూడ‌ద‌ని, రెడ్‌బుక్ రాజ్యాంగం అమ‌లు చేయ‌డం విధ్వంసం కాదా?

నిన్న తిరుప‌తి సంఘ‌ట‌న చూస్తే ఇది అన్నింటి కంటే విధ్వంసం.
తిరుప‌తి కార్పొరేష‌న్‌లో వైయ‌స్ఆర్‌సీపీకి 48 స్థానాలు ప్ర‌జ‌లు ఇచ్చారు. టీడీపీకి ఒక్క స్థానం ప్ర‌జ‌లు ఇచ్చారు. ఇవాళ మీరు చేసింది ఏంటి?  డిప్యూటీ మేయ‌ర్ ఉప ఎన్నిక‌లో వైయ‌స్ఆర్‌సీపీ కార్పొరేట‌ర్ల‌ను బెదిరించి, ప్ర‌లోభ‌పెట్టి, పోలీసుల ఎదుటే కిడ్నాప్ చేసి ఓటు హ‌క్కు ఉన్న ఎమ్మెల్సీని సైతం కిడ్నాప్ చేశారు. చివ‌ర‌కు వాళ్లే డిప్యూటీ మేయ‌ర్ గెలిచినట్లు డిక్లైర్ చేసుకున్నారు. సంఖ్యాబ‌లం లేకుండా ఎలా గెలుస్తారు.

ఏలూరు కార్పొరేష‌న్‌లో వైయ‌స్ఆర్‌సీపీ 47 స్థానాలు ఉన్నాయి, హిందూపురం మున్సిపాలిటీలో చంద్ర‌బాబు బావ‌మ‌రిది ఎమ్మెల్యేగా ఉన్న చోట చైర్మ‌న్‌గా టీడీపీ గెలిచిన‌ట్లు డిక్లైర్ చేసుకుంటున్నారు. ప్ర‌తి చోట ఉప ఎన్నిక‌లో ప్ర‌లోభాలు, బెదిరింపులు, కిడ్నాప్‌లు చేశారు. ఒక్క స్థానంలో కూడా గెలువ‌క‌పోయినా కోరం లేదంటూ వాయిదా వేస్తున్నారు.నందిగామాలో మంత్రి కార్పోరేట‌ర్ ఇంటికి వెళ్లి బెదిరిస్తున్నారు. అస‌లు ఎందుకు ఎన్నిక‌లు జ‌ర‌పాలి. మీరే చైర్మ‌న్లు అంటూ డిక్లైర్ చేసుకోండి. 
మేం అధికారంలో ఉన్న‌ప్పుడు ఓ చిన్న ఘ‌ట‌న చెబుతా..

వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు మొత్తం వైఎస్సార్ సీపీ స్వీప్ చేసేసింది. రెండు చోట్ల మాత్రం టీడీపీ గెలిచింది. తాడిప‌త్రి, ద‌ర్శిలో మున్సిపాలిటీల్లో గెలిచింది. 

తాడిప‌త్రిలో 38 స్థానాల‌కు వైఎస్సార్ సీపీ 18, టీడీపీ 20 స్థానాలు గెలిచాయి. వైఎస్సార్ సీపీ కంటే రెండు స్థానాలు టీడీపీకి ఎక్కువ ఉన్నాయి. మేము త‌లుచుకొని ఉండుంటే ఆ రోజు ఆ రెండును మావైపున‌కు తిప్పుకొని ఆ స్థానాన్ని సొంతం చేసుకునేవాళ్లం. కానీ, ఆరోజున జ‌గ‌న్ ఏం చేశాడో చూద్దాం.. (టీడీపీ ఇన్‌చార్జ్ జేసీ ఏం మాట్లాడాడో వీడియో ప్ర‌ద‌ర్శ‌న‌)

హ్యాట్సాఫ్ టు జ‌గ‌న్ అని టీడీపీ ఇన్‌చార్జ్ జ‌గ‌న్‌ను ఉద్దేశించి అన్నాడు. ద‌ట్ ఈజ్ కాల్డ్ గ‌వ‌ర్నెన్స్. ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ‌గా ఉండాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వానిది. అలాంటి ప్ర‌భుత్వం ఎలా ప్ర‌వ‌ర్తిస్తుంద‌న్న‌ది చాలా ముఖ్య‌మైన అంశం. అధికార బ‌లం ఉంద‌ని ఇష్ట‌మొచ్చిన‌ట్లుగా ప్ర‌తీది నాకే కావాల‌ని దోచేయ‌డం.. మ‌న‌ది కాని ప‌ద‌వులు కూడా మ‌న‌కు రావాల‌ని ఆశ‌ప‌డ‌డం త‌ప్పు. ఈ పెద్ద మ‌నిషి చంద్ర‌బాబుకు బుద్ధి, జ్ఞానం రెండూ లేవు కాబ‌ట్టి.. రాష్ట్రంలో ఈ మాదిరిగా ప‌రిపాల‌న చేస్తున్నాడు కాబ‌ట్టే.. అధ్వాన్న‌మైన ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయి. 

ఇప్ప‌టికైనా త్వ‌ర‌గా ఎన్నిక‌లు రావాలి. జ‌మిలి అంటున్నారు.. ఎంత తొంద‌ర‌గా ఎన్నిక‌లు మంచిది.. వ‌స్తే అంతే తొంద‌ర‌గా చంద్ర‌బాబును పంపించేయాల‌ని  ప్ర‌జ‌లంతా ఎదురుచూస్తున్నారు. చంద్ర‌బాబును ప్ర‌శ్నించే స్వ‌రాలు ఇప్ప‌టికే పెరిగాయి. రాబోయే రోజుల్లో చంద్ర‌బాబు నాయుడు చొక్కా ప‌ట్టుకునే రోజులు కూడా ద‌గ్గ‌ర‌లోనే వ‌స్తాయి.  త‌రువాత రాబోయే రోజుల్లో వీళ్ల‌ను తరిమికొట్టే రోజులు కూడా ద‌గ్గ‌ర‌లోనే ఉన్నాయి. వీళ్లు చేసే ప‌రిపాల‌న చూసి ప్ర‌జ‌లు ఆ లెవ‌ల్‌లో విసిగిపోయిన ప‌రిస్థితులు రాష్ట్రంలో క‌నిపిస్తున్నాయి. అంత దారుణంగా ఈ రోజు రాష్ట్రంలో ప‌రిపాల‌న సాగిస్తున్నారు.

మీడియా ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు..

  రాష్ట్రానికి పెట్టుబ‌డులు రావాలంటే రాష్ట్రం గురించి గొప్ప‌గా చెప్ప‌డం మొద‌లుపెట్టాలి. చంద్ర‌బాబు తనంత‌ట తానే ఎక్క‌డంటే అక్క‌డ రాష్ట్రంలో లేని ప‌రిస్థితుల‌ను ఉన్న‌ట్లుగా, రాష్ట్రం గురించి నెగిటివ్‌గా చెప్ప‌డం మొద‌లుపెడితే ఏ ర‌కంగా పారిశ్రామిక వేత్త‌ల‌కు కాన్ఫిడెంట్ ఇవ్వ‌గ‌ల‌డు. 
దావోస్ నుంచి నీతి ఆయోగ్ వ‌ర‌కు.. చంద్ర‌బాబు స్టేట్‌మెంట్స్ గ‌మ‌నిస్తే, రాష్ట్రంలో లేని ప‌రిస్థితులు ఉన్న‌ట్లుగా సీఎం హోదాలో చంద్ర‌బాబు అభూత క‌ల్ప‌న‌లు సృష్టిస్తున్నాడు. ఇది కాకుండా పారిశ్రామిక వేత్త‌ల‌ను ఆక‌ర్శించేలా ఏ చ‌ర్య అయినా తీసుకున్నాడా..? 
జిందాల్ వాళ్లు వ‌స్తే వాళ్ల మీద కేసులు పెట్టి భ‌య‌పెడుతున్నాడు. చంద్ర‌బాబు చ‌ర్య‌ల‌కు జిందాల్ వాళ్లు భ‌య‌భ్రాంతుల‌కు గురై రాష్ట్రం నుంచి వెళ్లిపోయారు. వారు రాష్ట్రంలో చంద్ర‌బాబు ప‌రిపాల‌న ఏర‌కంగా చేస్తున్నాడో మ‌రో 10 మందికి చెప్ప‌రా..? అలాంటి భ‌యాన‌క వాతావ‌ర‌ణం ఉన్న‌ప్పుడు ప‌రిశ్ర‌మ‌లు ఎందుకు వ‌స్తాయి. 

  మీడియా ద్వారా ప్ర‌జ‌ల‌కు జ‌రుగుతున్న సంగ‌తుల‌ను క్లుప్తంగా వివ‌రించ‌గ‌లిగాను. ఈ అంశాల‌న్నింటిపై మాట్లాడేందుకు స‌మ‌యం ప‌డుతుంది. ప్రెస్‌మీట్ మ‌ధ్య చంద్ర‌బాబు గురించి అన‌వ‌స‌రంగా మాట్లాడింది లేదు. రాజ‌కీయ స్టేట్‌మెంట్లు మ‌ధ్య చేసింది కూడా లేదు. ఈ మేర‌కు మినిమం టైమ్ కావాలి. ఆ టైమ్ ఇవ్వ‌గ‌లిగితే.. ఈ మేర‌కు ప్ర‌జెంటేష‌న్ చేయ‌గ‌లిగితే ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యేలా చెప్ప‌గ‌లం. స‌భ‌లో ఉండేది రెండే పక్షాలు.. ఒక‌టి అధికార ప‌క్షం, రెండోది ప్ర‌తిప‌క్షం. 

ప్ర‌తిప‌క్ష పార్టీని ప్ర‌తిప‌క్షంగా యాక్సెప్ట్ చేయ‌డం లేదు. ఎందుకంటే యాక్సెప్ట్ చేస్తే ప్ర‌తిప‌క్ష పార్టీ నాయ‌కుడినీ యాక్సెప్ట్ చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. చంద్ర‌బాబుకు ఎంత మైక్ టైమ్ ఇస్తావో.. అపోజిష‌న్ లీడ‌ర్‌కు కూడా అంతే మైక్ టైమ్ ఇవ్వాల్సి వ‌స్తుంది. అది ఇవ్వ‌డం చంద్ర‌బాబుకు ఇష్టం లేదు.. అందుకే యాక్సెప్ట్ చేయ‌డం లేదు. ప్ర‌జ‌లు ఇవ‌న్నీ చెప్పాలంటే చేసే ప‌రిస్థితి వాళ్లు క్రియేట్ చేయ‌గ‌ల‌గాలి. అలా చేయ‌డం వారికి ఇష్టం లేదు. కాబ‌ట్టి మీడియా ద్వారా ప్ర‌జ‌ల‌కు రాష్ట్రంలో జ‌రుగుతున్న వాస్త‌వ ప‌రిస్థితుల‌ను వివ‌రించ‌గ‌లుగుతున్నాం. 

 తెలుగుదేశం పార్టీ రాద‌ని చెప్పి రాష్ట్రంలోని ప్ర‌తీ ఒక్క‌రూ అంటున్నారు. ఒక‌సారి గ్రౌండ్ లెవ‌ల్‌కి వెళ్లి చూసుకోమ‌ను. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు రావు. ఆయ‌న ప‌రిస్థితి, ఆయ‌న పాల‌న ఇలా ఉంది. నేను చెప్పిన మాటల్లో ఏదీ అవాస్త‌వం లేదు. సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాలు నీ ఇంటికైనా అందుతున్నాయా..? సూప‌ర్ సిక్స్‌, సూప‌ర్ సెవెన్లు లేవు.. చెప్పేవ‌న్నీ అబ‌ద్ధాలు, చేసేవ‌న్నీ మోసాలు అయిన‌ప్పుడు చంద్ర‌బాబుకు ఎవ‌రైనా ఎందుకు ఓటు వేస్తారు.

2.0 అయినా కాని ఒకటే గుర్తు పెట్టుకోవాలి.. పాలనలో విశ్వసనీయత ఉండాలి..
రాజకీయ నాయకుడు  ఒక మాట చెబితే చేస్తాడన్న నమ్మకం ఉండాలి.  దటీజ్ కాల్డ్ .. రిజెనెన్స్.. విలువలు, విశ్వసనీయత. ఆ రెండు ఉన్నప్పుడు పాలన కూడా బాగా ఉంటుంది.  నిన్న సమావేశంలో కార్యకర్తల గురించే ఎక్కువ మాట్లాడాను. లాస్ట్ టైం అధికారంలోకి వచ్చిన వెంటనే.. మార్చిలో కోవిడ్ వచ్చింది. వనరుల సమకూర్చుకోవడం, ప్రజల సేఫ్టీ మీదే ఫోకస్ పెట్టాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కార్యకర్తలకు ఒక నాయకుడిగా.. తండ్రిగా, నా దృష్టిలో నేను తక్కువ చేసినట్లు అనిపించింది. ఎందుకంటే.. చంద్రబాబు పాలనలో వారిని పెడుతున్న కష్టాలు.. హెరాస్ మెంట్ చూసి..  తర్వాత వారికి మంచి చేయాల… వారిమీద జులుం ప్రదర్శించిన వారికి బుద్ధి రావాలి. పోలీస్ డ్రెస్ ఉంది అని చెప్పి నిన్ను ఇల్లీగల్ గా అరెస్ట్ చేయకూడదు.  అకౌంటబులిటీ, రెస్పాన్స్ బులిటీ ఉండాలి. అన్యాయం చేసినవారితో.. అన్యాయం గురైన వారికి సెల్యూట్ చేయిస్తా.. క్షమాపణ చెప్పిస్తా.. అలా చేయకపోతే.. చట్టం ముందు నిలబెట్టే ప్రయత్నం చేస్తా.. ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అంటే.. మీకు తోడుగా ఉంటుంది అని నమ్మకం కలిగించేవిధంగా ప్రతి అడుగు వేస్తా.. వైయస్సార్ సీపీ 2.0 పాలన కార్యకర్తలకు భరోసాగా ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెబుతా..

ఈనాడులో వార్తను చూస్తే.. ఆశ్చర్యం కలిగించింది.. ఈనాడు ఏమని రాశాడంటే.. పెద్దారెడ్డి కొడుకు మిధున్ రెడ్డి అని రాశారు. ఆయనకేం సంబంధం. ఆయన పార్లెమెంట్ ఫ్లోర్ లీడర్.. ఆయన నాయనదేం పోర్ట్ ఫోలియో.. మరి ఆయన నాయనతో ఏం సంబంధం.. ఇష్టమొచ్చినట్లుగా ఇరికీయడం..రాశారు.. ఇంకెవరో పేరు రాశారు..  కసిరెడ్డి..ఎవరాయన? ఆయనకు మద్యానికి ఏం సంబంధం.. ఎవరో ఒకరిని పట్టుకుని రావడం.. ఎవరి పేరో చెప్పించడం.. ఇలా ఇరికించడం.. ఈ కేసులు నిలబడతాయా? ఎవరైనా డబ్బులు ఎందుకిస్తాడు.. ఫండమెంటల్ క్వశ్చన్.. అవే రేట్లు కదా చంద్రబాబు హయాంలో.. అవే కదా మనం పెట్టింది. ఈనాడు రాస్తాడా చంద్రబాబు తీసుకున్నాడని.. మన హయాంలో వాల్యూమ్స్ తగ్గాయి.. రేట్లు షాక్ కొట్టేలా పెట్టాం.. ట్యాక్స్ లు పెంచి.. 
బేసిక్ రేట్ అలాగే ఉంచి.. వాల్యూమ్స్  తగ్గేటట్టు చేసినవారికి ఇస్తారా? లేక  చంద్రబాబు హయాం మాదిరిగా వాల్యూమ్స్ పెంచి.. బేసిక్ రేట్లు  పెంచేవారికి ఇస్తారా?  బేసిక్ ఫండమెంటల్ క్వశ్చన్.. రూ.2,73,000 కోట్లు బటన్ నొక్కి లంచాలు లేకుండా.. వివక్ష లేకుండా డిస్ బర్స్ చేసిన ప్రభుత్వం మాది.  చంద్రబాబు ఎందుకు బటన్ నొక్కలేకపోతున్నాడు. ఎందుకంటే.. బటన్ నొక్కితే ఆయనకు ఏమీ డబ్బులు రావు కాబట్టి.. అందుకే బటన్ నొక్కలేకపోతున్నాడు.. డబ్బు మీద వ్యామోహం లేదు కాబట్టి..పేరు మీద కాంక్ష ఉంది కాబట్టి.. చరిత్రలో నిలిచిపోవాలన్న తపన ఉంది కాబట్టి..ప్రతి ఇంట్లో నా ఫొటో ఉండాలని ఆరాటం ఉంది కాబట్టి..2,70 ,000 కోట్లు బటన్ నొక్కినా డీబీటీ… లంచం లేని పాలన ఎక్కడన్నాజరిగిందంటే.. అది వైయస్సార్ సీపీ పాలనలోనే అని గర్వంగా చెబుతా…
బేసికల్లీ.. పోయే ప్రతి ఒక్కరికీ ఒకటే మాట చెబుతా.. రాజకీయాల్లో ఉన్నప్పుడు క్యారెక్టర్ ఉండాలి.. రాజకీయాల్లో ఉన్నప్పుడు క్రెడిబులిటీ అనే పదానికి అర్థం తెలిసి ఉండాలి. కాలర్ ఎగరేసి చెప్పాలి..పలానా వారు మా నాయకుడు అని..సీఎం అయినా సరే.. ఎమ్మెల్యే.. మంత్రి అయినా సరే ..ఎవరి గురించైనా గొప్పగా చెప్పుకోవాలి. మనంతట మనమే ప్రలోభాలకో.. భయపడో .. లొంగితే..అటువైపునకు మనం పోతే మన గౌరవం .. వ్యాల్యూ, క్యారెక్టర్ ఏంటి.. రాజకీయాల్లో ఉన్న ప్రతిఒక్కరూ ఆలోచన చేసుకోవాలి. కష్టకాలం ఎల్లకాలం ఉండదు.. ఐదేళ్లు.. మళ్లీ మన టైం వస్తుంది..క్యారెక్టర్, తిరిగి నిలబడటానికి మనకు క్రెడిబులిటీ ఉండాలి. సాయిరెడ్డి కైనా..అంతే.. పోయినా ముగ్గురు ఎంపీలకైనా అంతే.. ఒకరో .. అరో పోయేవారికైనా సరే.. వైయస్సార్ సీపీ ఈ రోజు ఉందంటే..వారందరి వల్లా లేదు.. ప్రజల ఆశీస్సులు,దేవుని దయ వల్ల ఉంది. ఒక లీడర్ గా మనం ప్రవర్తించే తీరు తల ఎత్తుకునే విధంగా ఎప్పటికీ ఉంటే ప్రజలు ఎప్పుడూ ఆశీర్వదిస్తారు..

ప్ర‌శ్న‌: అసెంబ్లీ స‌మావేశాలు ఈసారి కూడా బ‌హిష్క‌రిస్తున్నారా?

వైయ‌స్ జ‌గ‌న్ స‌మాధానం: అసెంబ్లీ స‌మావేశాలు మ‌నం బ‌హిష్క‌రిస్తున్నామ‌నే దానిక‌న్నా స్పీక‌ర్‌ను ఈ ప్ర‌శ్న అడిగితే బాగుంటుంది. ఈ విష‌యంలో స్పీక‌ర్ రెస్పాండ్ కావాల‌ని కోర్టు ఆదేశించింది. ఆయ‌న రెస్పాండ్ అయి స‌మాధానం చెప్పాలి. స్పీక‌ర్ స‌మాధానం చెప్ప‌డం లేదు. 

ప్ర‌శ్న‌: క‌నీసం మీ ఎమ్మెల్యేలైనా స్పీకర్‌ను అడ‌గాలి క‌దా?

వైయ‌స్ జ‌గ‌న్‌: ఒక్క‌టి మ‌నం గుర్తు పెట్టుకోవాలి. మ‌నం ప్ర‌తిప‌క్షంలో ఉన్నాం..మ‌న డ్యూటీ ప్ర‌జ‌ల‌కు మెసేజ్ క‌మ్యూనికేట్ చేయ‌డం..ఈ మాదిరిగా మీడియా ద్వారా క‌మ్యూనికేట్ చేసినా, సిన్సియ‌ర్‌గా ఈ మాదిరిగా ఫ్యాక్ట్స్ అన్ని చెబుతూ ప్ర‌జ‌ల‌కు స‌త్యాలు చెప్ప‌డ‌మే. ఇప్పుడు ఇవ‌న్నీ లైవ్ టెలీకాస్ట్ జ‌రుగుతున్నాయి. వాళ్ల‌ను స‌మాధానం చెప్ప‌మ‌ని చెప్పండి. నువ్వు, నేను ఎదురెదురుగా కొట్టుకోవాల్సిన ప‌ని లేదు. గుద్దుకోవాల్సిన అవ‌స‌రం లేదు. ఎదురెదురుగా కుస్తీ ప‌డాల్సిన ప‌ని లేదు. వాళ్ల‌కు హామీలు అమ‌లు చేయాల‌నే ఉద్దేశం లేదు. సాధ్యం కాద‌ని తెలిసీ ఆ రోజు హామీలు ఇచ్చారు. ఇవాళ చేయ‌లేమ‌ని స్వారీ కూడా చెప్పే చిత్త‌శుద్ధి కూడా వాళ్ల‌కు లేదు. దాని అర్థం ఏంటి?  వాళ్ల‌కు సోల్ లేదు. రాజ‌కీయ నాయ‌కుడికి మంచి మ‌న‌సు ఉండాలి. అప్పుడే ప్ర‌జ‌లు బాగుప‌డ‌తారు. అసెంబ్లీకి రాక‌పోతే వాళ్లు ఏమైనా చేసుకోమ‌నండి. భ‌య‌ప‌డేది లేదు. 

ప్ర‌శ్న‌: స‌ర్‌.. ప్ర‌జ‌ల్లోకి వెళ్తారా?

వైయ‌స్ జ‌గ‌న్‌: ప్ర‌జ‌ల‌కు తోడుగా ఉండే కార్య‌క్ర‌మాలు ప్ర‌తిప‌క్ష పార్టీగా మేం చేస్తాం. టైం గ‌డిచేకొద్ది ఇవ‌న్నీ జ‌రుగుతాయి. జిల్లాల పర్య‌ట‌న‌కు ఇంకా స‌మ‌యం ఉంది. ఆ టైమ్ వ‌చ్చిన‌ప్పుడు జ‌రుగుతుంది అంటూ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మీడియా ప్ర‌తినిధుల ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇచ్చారు.

 

Best Web Hosting Provider In India 2024