![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497842_358_newTwitterIcon.png)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497843_996_facebook1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497844_122_wapp1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
Best Web Hosting Provider In India 2024
కొండలు దాటాం.. నడిసంద్రంలో మునిగిపోతాం అనుకున్నాం : అమెరికా నుంచి వచ్చిన భారతీయులు
Indian Migrants In US : అమెరికాలో ఉన్న అక్రమవలసదారుల విమానం బుధవారం అమృత్‌సర్‌కు వచ్చిన విషయం తెలిసిందే. అక్కడ భారతీయులు ఎదుర్కొన్న సమస్యలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
అమెరికా అనగానే భారతీయులకు అక్కడకు వెళ్లాలి అనే ఆశ. ఎలాగైనా డాలర్లు సంపాదించి.. స్వదేశం తిరికి రావాలని చాలా మంది కలలు కంటారు. అందుకే యూఎస్ ఎగిరిపోవాలనుకుంటారు. కొంతమంది సరైన విధానంలో వెళ్తే.. మరికొందరు మోసం చేసే ఏజెంట్లను నమ్మి వెళ్తారు. అక్కడకు వెళ్లిన తర్వాత వారి పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఎన్నెన్నో ఆశలతోటి దేశం దాటి వెళ్లి.. అడుగడుగున బాధలతో బతుకుతో పోరాడుతారు. తాజాగా అమెరికా నుంచి వచ్చిన భారతీయ వలసదారులకు చెందిన కథలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
![yearly horoscope entry point](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
104 మందితో వచ్చిన విమానం
వివిధ రాష్ట్రాలకు చెందిన 104 మంది అక్రమ వలసదారులతో అమెరికా సైనిక విమానం బుధవారం ఇక్కడ అమృత్‌సర్‌లో ల్యాండ్ అయింది. అక్రమ వలసదారులపై అణచివేతలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వెనక్కి పంపిన తొలి బ్యాచ్. హర్యానా, గుజరాత్ నుంచి 33 మంది చొప్పున, పంజాబ్ నుంచి 30 మంది, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ నుంచి ముగ్గురు చొప్పున, చండీగఢ్ నుంచి ఇద్దరు ఉన్నారు. శరణార్థుల్లో 19 మంది మహిళలు, 13 మంది మైనర్లు ఉన్నారని, వీరిలో నాలుగేళ్ల బాలుడు, ఐదు, ఏడేళ్ల వయసున్న ఇద్దరు బాలికలు ఉన్నారని తెలుస్తోంది.
చేతులు, కాళ్లకు సంకళ్లు!
గురుదాస్ పూర్ జిల్లాలోని హర్దోర్వాల్ గ్రామానికి చెందిన 36 ఏళ్ల జస్పాల్ సింగ్ జనవరి 24న అమెరికాకు వెళ్లే ప్రయత్నం చేశాడు. అమెరికా బోర్డర్ పెట్రోలింగ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఓ ట్రావెల్ ఏజెంట్ చట్టపరమైన మార్గాల ద్వారా అమెరికాకు పంపిస్తానని చెప్పి మోసం చేశాడని సింగ్ చెప్పాడు. రూ. 30 లక్షలకు డీల్ కుదుర్చుకుని డబ్బులు కాజేశాడు.
గత ఏడాది జూలైలో విమానంలో బ్రెజిల్ చేరుకున్నట్లు జస్పాల్ పేర్కొన్నాడు. తదుపరి అమెరికా పర్యటన కూడా విమానంలోనే ఉంటుందని హామీ ఇచ్చారు. అయితే ఏజెంట్ మోసం చేసి అక్రమంగా సరిహద్దులు దాటేలా చేశాడు. దీంతో అధికారులు అరెస్టు చేశారు. తాజాగా జస్పాల్ సింగ్ వలసదారుల విమానంలో ఇండియా వచ్చాడు. తనను భారత్‌కు పంపుతున్న విషయం తెలియదని జస్పాల్ చెప్పాడు. కాళ్లకు సంకెళ్లు వేసి మరి తీసుకొచ్చారని పేర్కొన్నాడు.
తిండి ఉండేది కాదు..
బుధవారం రాత్రి పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో తమ స్వగ్రామానికి చేరుకున్న మరో ఇద్దరు ప్రవాసీయులు కూడా అమెరికాకు చేరుకునే సమయంలో తాము ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మాట్లాడారు. హోషియార్పూర్‌లోని తహ్లీ గ్రామానికి చెందిన హర్వీందర్ సింగ్ గత ఏడాది ఆగస్టులో అమెరికా వెళ్లాడు. వీరిని ఖతార్, బ్రెజిల్, పెరూ, కొలంబియా, పనామా, నికరాగ్వా, ఆ తర్వాత మెక్సికోకు తరలించారు. మెక్సికో నుంచి అమెరికాకు పంపించారు.
తాము కొండలు దాటామని హర్వీందర్ సింగ్ విలేకరులతో చెప్పారు. వీరిని తీసుకెళ్తున్న పడవ సముద్రంలో బోల్తా పడింది. పనామా అడవిలో ఒకరు చనిపోవడం, మరొకరు సముద్రంలో మునిగిపోవడం తాను చూశానని హర్వీందర్ సింగ్ చెప్పారు. యూరప్‌కు, ఆ తర్వాత మెక్సికోకు తీసుకెళ్తామని తన ట్రావెల్ ఏజెంట్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. అమెరికా పర్యటనకు రూ.42 లక్షలు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ‘కొన్నిసార్లు మాకు ఆహారం దొరికేది. కొన్నిసార్లు తినడానికి ఏమీ దొరకలేదు. బిస్కెట్లు వచ్చేవి.’ అని ఆవేదనతో చెప్పారు హర్వీందర్ సింగ్.
కొండలు దాటాం
అమెరికా నుంచి వలసదారుల విమానంలో వచ్చిన పంజాబ్‌కు చెందిన మరో వ్యక్తి తన బాధను పంచుకున్నాడు. అమెరికా వెళ్లే ‘డంకీ రూట్’ గురించి చెప్పాడు. మార్గమధ్యంలో రూ.30 వేల నుంచి రూ.35 వేల విలువైన దుస్తులు చోరీకి గురయ్యాయని తెలిపాడు. తొలుత ఇటలీకి, ఆ తర్వాత లాటిన్ అమెరికాకు తీసుకెళ్లారని వెల్లడించాడు. బోటులో 15 గంటల పాటు సాగిన ప్రయాణం తర్వాత 40 నుంచి 45 కిలోమీటర్ల పర్వత ప్రయాణించాల్సి వచ్చింది. ‘మేం 17-18 కొండలు దాటాం. ఎవరైనా జారిపడితే బతికే అవకాశం లేదు. ఎవరికైనా గాయాలు అయితే చావాల్సిందే. మృతదేహాలు చూశాం.’ అని ఆ వ్యక్తి తెలిపాడు.
Best Web Hosting Provider In India 2024
Source link