Red Hulk: ఇదెక్కడి ట్విస్ట్ మావా.. అమెరికా అధ్యక్షుడే రెడ్ హల్క్.. విలన్‌గా స్టార్ హీరో.. ఇంట్రెస్ట్ పెంచేశారుగా!

Best Web Hosting Provider In India 2024

Red Hulk: ఇదెక్కడి ట్విస్ట్ మావా.. అమెరికా అధ్యక్షుడే రెడ్ హల్క్.. విలన్‌గా స్టార్ హీరో.. ఇంట్రెస్ట్ పెంచేశారుగా!

Sanjiv Kumar HT Telugu
Feb 06, 2025 04:27 PM IST

Marvel Captain America A Brave New World Twist Red Hulk: మార్వెల్ నుంచి వస్తోన్న మరో సూపర్ హీరో మూవీ కెప్టెన్ అమెరికా ఏ బ్రేవ్ న్యూ వరల్డ్. ఈ సినిమా నుంచి తాజాగా ఓ ట్విస్ట్ రివీల్ చేశారు మేకర్స్. ఇందులో కెప్టెనా అమెరికాతో తలపడనున్న రెడ్ హల్క్ ఎవరో చెప్పేశారు.

ఇదెక్కడి ట్విస్ట్ మావా.. అమెరికా అధ్యక్షుడే రెడ్ హల్క్.. విలన్‌గా స్టార్ హీరో.. ఇంట్రెస్ట్ పెంచేశారుగా!
ఇదెక్కడి ట్విస్ట్ మావా.. అమెరికా అధ్యక్షుడే రెడ్ హల్క్.. విలన్‌గా స్టార్ హీరో.. ఇంట్రెస్ట్ పెంచేశారుగా!

Captain America A Brave New World Twist Revealed: సూపర్ హీరో సినిమాలకు పెట్టింది పేరు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్. ఎమ్‌సీయూ నుంచి వచ్చే సినిమాలకు, వెబ్ సిరీస్‌లకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అందుకే, ఒక్కో సూపర్ హీరోతో ప్రేక్షకులను అలరిస్తోంటోంది మార్వెల్.

yearly horoscope entry point

న్యూ కెప్టెన్ అమెరికా

ఇప్పుడు మార్వెల్ నుంచి వస్తోన్న నయా సూపర్ హీరో మూవీ కెప్టెన్ అమెరికా ఏ బ్రేవ్ న్యూ వరల్డ్. ఇదివరకు కెప్టెన్ అమెరికాగా స్టీవ్ రోజర్స్ పాత్రలో క్రిస్ ఇవాన్స్ అదిరిపోయే క్రేజ్ తెచ్చుకున్నాడు. మార్వెల్‌లో ఆ కెప్టెన్ అమెరికా రిటైర్ అయిపోయినట్లుగా చూపించిన విషయం తెలిసిందే. దాంతో కొత్త కెప్టెన్ అమెరికా ఎవరు అనేదానిపై అమితాసాక్తి నెలకొంది.

ఈ క్రమంలోనే కొన్ని నెలల క్రితం న్యూ కెప్టెన్ అమెరికాగా ఫాల్కన్ పాత్ర ఉండనుంది. ఈ ఫాల్కన్ పాత్రలో సామ్ విల్సన్ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు సరికొత్త కెప్టెన్ అమెరికాగా సామ్ విల్సన్ పెద్ద పరీక్ష ఎదుర్కోనున్నాడు. ఎందుకుంటే కెప్టెన్ అమెరికా పాత్రకు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. మరి ఆ పాత్రకు క్రిస్ ఇవాన్స్ క్రియేట్ చేసిన బెంచ్ మార్క్‌ను సామ్ విల్సన్ బ్రేక్ చేస్తాడో లేదో చూడాలి.

80 ఏళ్లు దాటిన హీరో

ఇదిలా ఉంటే, కెప్టెన్ అమెరికా ఏ బ్రేవ్ న్యూ వరల్డ్ సినిమాతో మార్వెల్ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు హాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో హారిసన్ ఫోర్డ్. 80 ఏళ్లు దాటిన ఈ హీరో ఇండియానా జోన్స్ సిరీస్, స్టార్ వార్స్, బ్లేడ్ రన్నర్ వంటి యాక్షన్, అడ్వెంచర్ చిత్రాలతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.

ఇప్పుడు ఎమ్‌సీయూలోకి అడుగుపెట్టిన హారిసన్ ఫోర్ట్ విలన్‌గా ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీగా ఉన్నాడు. అది కూడా కెప్టెన్ అమెరికాతో తలపడే రెడ్ హల్క్‌గా. అవును, కెప్టెన్ అమెరికా ఏ బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీలో విలన్‌గా రెడ్ హల్క్ రోల్ ఉండనుంది. ఈ పాత్రను చేసింది హరిసన్ ఫోర్డ్. ఈ విషయాన్ని ఇటీవలే మేకర్స్ రివీల్ చేశారు.

అమెరికా అధ్యక్షుడే విలన్

అయితే, హారిసన్ పోర్డ్ ఈ మూవీలో యూఎస్ ప్రెసిడెంట్‌ రాస్ వంటి కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. అయితే, అమెరికా అధ్యక్షుడే రెడ్ హల్క్‌గా రూపాంతరం చెందుతాడు. దీంతో అతన్ని అడ్డుకునేందుకు కెప్టెన్ అమెరికా తన దగ్గరున్న ఆయుధాలతో పోటీ పడుతాడు.

కొత్త కెప్టెన్ అమెరికా ఫాల్కన్ వద్ద మాజీ కెప్టెన్ అమెరికా పవర్‌ఫుల్ వైబ్రేనియం షీల్డ్‌తోపాటు బ్లాక్ పాంథర్ సూట్లలో ఉండే నీలిరంగు రక్షణ కవచం కూడా ఉంటుంది. అలాగే, తనకు ఎప్పటిలా ఉండే రెక్కలతో స్వైర విహారం చేయనున్నాడు ఫాల్కన్. మరి ఈ ఆయుధాలతో మరింత కోపిష్టి అయిన రెడ్ హల్క్‌తో న్యూ కెప్టెన్ అమెరికా ఎలా యుద్ధం చేస్తాడనే ఇంట్రెస్ట్‌ను ఒక్కసారిగా పెంచేశారు మేకర్స్.

కెప్టెన్ అమెరికా ఏ బ్రేవ్ న్యూ వరల్డ్ రిలీజ్ డేట్

ఇక కెప్టెన్ అమెరికా: ఏ బ్రేవ్ న్యూ వరల్డ్ సినిమా వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఎంతగానో ఎదురుచూస్తున్న మార్వెల్ ఫ్యాన్స్‌కు ఈ మూవీ ఎలాంటి ట్రీట్ ఇస్తుందో చూడాలి.

Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024