Best Web Hosting Provider In India 2024
కడప నగరంలో వాటర్ ప్లాంట్‌ను కూలగొట్టేందుకు కుట్ర
వైయస్ఆర్ జిల్లా: వైయస్ఆర్‌సీపీ కార్పోరేటర్లే లక్ష్యంగా కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవీరెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. అన్నీ అనుమతులతో వైయస్ఆర్‌సీపీ కార్పోరేటర్ నడుపుతున్న వాటర్‌ప్లాంట్‌ను కూలగొట్టేందుకు ఎమ్మెల్యే మాధవీరెడ్డి సిద్ధమయ్యారు. దీనిలో భాగంగా 26వ డివిజన్ కార్పోరేటర్ త్యాగరాజు వాటర్ ప్లాంట్‌ను కూలగొట్టాలని అధికారుల్ని ఎమ్మెల్యే పురమాయించారు. తాము వాటర్ ప్లాంట్ నడపడానికి అన్ని అనుమతులు ఉన్నాయని చూపినా అధికారులు మాత్రం కూలగొట్టేందుకే యత్నిస్తున్నారు. తమకు ఎమ్మెల్యే, కమిషనర్ ఆదేశాలున్నాయంటూ కూలగొట్టేందుకు యత్నిస్తున్నారు. ఇందుకు మున్సిపల్ సిబ్బంది సిద్ధమైన క్రమంలో ఆ డివిజన్‌లోని స్థానికులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే తీరుపై వైయస్ఆర్‌సీపీ నేతలు మండిపడుతున్నారు. అధికారం చేతిలో ఉంది కదా అని కక్షసాధింపునకు దిగితే సహించేది లేదని వైయస్ఆర్‌సీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. అన్నీ అనుమతులు ఉన్న వాటర్ ప్లాంట్‌ను ఎలా కూలగొడతారని కూటమి ప్రభుత్వం చర్యలను ప్రశ్నిస్తున్నారు.