![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/9_1738841214915_1738841224361.jpg)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497842_358_newTwitterIcon.png)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497843_996_facebook1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497844_122_wapp1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/9_1738841214915_1738841224361.jpg)
Sangareddy : ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్‌లో దోపిడీ.. అధికారులకు సీఐటీయూ ఫిర్యాదు!
Sangareddy : సంగారెడ్డిలోని జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్ ఓపెన్ చేశారు. దీంట్లో అన్నింటినీ అధిక ధరలకు అమ్ముతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో సీఐటీయూ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ కుమార్‌ని కలిసి ఫిర్యాదు చేశారు.
జిల్లా కేంద్రం సంగారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కొత్తగా ఇందిరమ్మ మహిళ శక్తి క్యాంటీన్‌ను ప్రారంభించారు. ఈ క్యాంటీన్ యజమాన్యం టీ, టిఫిన్‌లను అధిక ధరలకు విక్రయిస్తోందని.. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి యాదగిరి ఆరోపించారు. ఫలితంగా ఇక్కడికి వచ్చిన ప్రజలు, కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ హాస్పిటల్ అంటేనే పేదలు, కార్మికులు వస్తుంటారని.. ఇక్కడ రేట్లు ఎక్కువగా పెంచడంతో ఇబ్బందులు పడుతున్నారని యాదగిరి వివరించారు.
![yearly horoscope entry point](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
సీఐటీయూ ఆగ్రహం..
హాస్పిటల్‌లో క్యాంటీన్ నడుపుతున్న యాజమాన్యానికి రూమ్ రెంటు లేదు.. కరెంట్ బిల్లు లేదు.. కానీ పేద ప్రజల నుండి టిఫిన్‌కి 40 రూపాయలు, టీకి 15 రూపాయలు తీసుకుంటున్నారని.. యాదగిరి ఆరోపించారు. ప్రజలను, కార్మికులను దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి బయట ఉన్న హోటల్స్.. బిల్డింగ్ కిరాయి, కరెంటు బిల్.. అన్ని కడుతూ కూడా టిఫిన్ రూ.40కి, టీ రూ.15కే ఇస్తున్నారని వివరించారు. ప్రభుత్వం నుంచి అన్నీ ఉచితంగా పొందుతున్న ఇందిరమ్మ మహిళా శక్తి కాంటీన్ యాజమాన్యం మాత్రం.. అదే రేట్లు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతోందని ఆరోపించారు.
పేదలకు ఇబ్బందులు..
క్యాంటీన్ యాజమాన్యం ఇష్టానుసారంగా రేట్లు పెంచుతుంటే.. ఇక్కడికి వస్తున్న ప్రజలు పేద ప్రజలు కొనలేని పరిస్థితిలో ఉన్నారని.. యాదగిరి వ్యాఖ్యానించారు. అధిక రేట్లు వసూలు చేస్తున్న క్యాంటీన్ యజమానిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో తాము పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు రాజు, కార్యదర్శి, ఇమ్రాన్ యూనియన్ నాయకులు వేణు, రాజు తదితరులు పాల్గొన్నారు.
టాపిక్