![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/devaki_nandana_1738857426603_1738857435332.jpg)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497842_358_newTwitterIcon.png)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497843_996_facebook1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497844_122_wapp1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/devaki_nandana_1738857426603_1738857435332.jpg)
OTT Mythological Action Movie: ఓటీటీలోకి తెలుగు కంటే ముందు హిందీలో.. హనుమాన్ డైరెక్టర్ కథ అందించిన మూవీ ఇది
OTT Mythological Action Movie: ఓటీటీలోకి ఇప్పుడో తెలుగు మూవీ మొదట హిందీలో స్ట్రీమింగ్ కానుండటం విశేషం. ఇది హనుమాన్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించిన సినిమా దేవకి నందన వాసుదేవ.
OTT Mythological Action Movie: తెలుగులో రెండు నెలల కిందట థియేటర్లలో రిలీజైన మైథలాజికల్ యాక్షన్ మూవీ దేవకి నందన వాసుదేవ. ఈ సినిమా ఇప్పటి వరకూ ఓటీటీ రిలీజ్ కు నోచుకోలేదు. అయితే మొత్తానికి డిజిటల్ ప్రీమియర్ పై ఇప్పుడో వార్త ఆసక్తి రేపుతోంది. అదేంటంటే.. ఈ సినిమా హిందీ వెర్షన్ మొదట ఓటీటీలోకి రానుంది. అదే సమయంలో టీవీ ప్రీమియర్ కూడా కానుండటం విశేషం.
![yearly horoscope entry point](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
దేవకి నందన వాసుదేవ ఓటీటీ రిలీజ్
హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించిన సినిమా దేవకి నందన వాసుదేవ. అశోక్ గల్లా లీడ్ రోల్లో నటించాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఇందులో నటించాడన్న వార్తతో ఈ మూవీకి చాలా హైప్ వచ్చింది.
అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం ప్రభావం చూపలేదు. గతేడాది నవంబర్ 22నే రిలీజ్ కాగా.. ఇప్పటి వరకూ ఓటీటీలోకి రాలేదు. అయితే ఈ మూవీ హిందీ వెర్షన్ మాత్రం శనివారం (ఫిబ్రవరి 8) నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
అదే సమయంలో కలర్స్ సినీప్లెక్స్ ఛానెల్లోనూ టీవీ ప్రీమియర్ కానుండటం విశేషం. ఇదో తెలుగు మూవీ అయినా.. ఓటీటీ, టీవీలోకి మొదట హిందీలో వస్తోంది. అయితే ఇప్పటి వరకూ తెలుగు వెర్షన్ పై మాత్రం ఎలాంటి అప్డేట్ లేదు.
దేవకి నందన వాసుదేవ గురించి..
దేవకి నందన వాసుదేవ మూవీ గతేడాది నవంబర్ 22న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాను అర్జున్ జంధ్యాల డైరెక్ట్ చేశాడు. సోమినేని బాలకృష్ణ లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మించాడు. మానస వారణాసి ఫిమేల్ లీడ్ గా నటించింది. భీమ్స్ సీసిరోలియో మ్యూజిక్ అందించాడు.
తన సోదరి కూతురు వల్ల తన కుటుంబానికి ముప్పు ఉందన్న జాతకాన్ని నమ్మి ఆమె కుటుంబాన్ని నాశనం చేసే ఓ సోదరుడు, అతని నుంచి ఆ కుటుంబాన్ని కాపాడే కృష్ణ అనే యువకుడి చుట్టూ తిరిగే కథే ఈ దేవకి నందన వాసుదేవ. మూవీ స్టోరీ, అందులో వచ్చే ట్విస్టులు బాగానే ఉన్నా.. దానిని స్క్రీన్ పై ప్రజెంట్ చేసే విధానం అస్సలు బాగాలేదన్న రివ్యూలు వచ్చాయి.
దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. అయితే థియేటర్లలో రిలీజై రెండు నెలల దాటినా ఓటీటీ రిలీజ్ పై ఎలాంటి స్పష్టత రాలేదు. అనూహ్యంగా హిందీ వెర్షన్ మాత్రం శనివారం (ఫిబ్రవరి 8) నుంచి హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కానుండటం విశేషం.
సంబంధిత కథనం