![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/IMG-20250206-WA0105_1738887668972_1738887679097.jpg)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497842_358_newTwitterIcon.png)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497843_996_facebook1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497844_122_wapp1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/IMG-20250206-WA0105_1738887668972_1738887679097.jpg)
Karimnagar Crime: వివాహేతర సంబంధంతో మహిళ సుపారీ హత్య… ఐదుగురిని అరెస్టు చేసిన కరీంనగర్ పోలీసులు
Karimnagar Crime: అక్రమ సంబంధం ఓ మహిళ ప్రాణాలు తీసింది. పసి బాలుడిని తల్లి లేని వాడిలా మార్చింది. సోదరుడితో మరో మహిళ వివాహేతర సంబంధానికి చెక్ పెట్టేందుకు సోదరి ఆడిన నాటకంతో ఐదుగురు కటకటాల పాలయ్యారు. మంచిర్యాల నర్సింగ్ విద్యార్ధిని మమత మర్డర్ కేసు మిస్టరీ వీడింది.
Karimnagar Crime: మంచిర్యాల జిల్లాకు చెందిన వివాహిత మమత హత్య థ్రిల్లర్ సినిమాను తలపిస్తుంది. జనవరి 25న 4 ఏళ్ళ కొడుకుతో కలిసి ఇంటినుంచి బయటకు వెళ్ళిన మమత దారుణ హత్యకు గురైంది. అమె వెంట ఉన్న బాలుడు అదృశ్యమై వారం రోజులకు చైన్నైలో దొరికాడు. బాలుడిని పోలీసులు చేరదీసి కరీంనగర్ కు తరలించి నాలుగు రోజుల క్రితం కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితుడు చాకచక్యంగా తప్పించుకుని పారిపోవడంతో పోలీస్ బృందాలు ప్రత్యేక నిఘా పెట్టి ఐదుగురిని పట్టుకున్నారు.
![yearly horoscope entry point](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
మమతది మామూలు హత్య కాదు, సుపారీ హత్యగా తేల్చారు. హత్యకు పాల్పడ్డ లక్సెట్టి పేటకు చెందిన వేల్పుల కళ్యాణ్‌తో పాటు సుపారీ హత్య ఒప్పందం చేసుకున్న మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ కు చెందిన కులుమల్ల నర్మదా, ఆమె తండ్రి రాజలింగు, కొత్తపేట కు చెందిన బావ బండ వెంకటేష్, కాబోయే భర్త మిట్టపల్లికి చెందిన గుంపుల రఘు లను అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు.
భర్తతో దూరంగా భాస్కర్ తో కలిసి….
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఖాసీంపేట కు చెందిన భరత్, కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన నర్సింగ్ స్టూడెంట్ మమత ప్రేమించుకున్నారు. ఆరేళ్ళ క్రితం ప్రేమ పెళ్ళి చేసుకున్నారు. వారికి ధ్రువ అనే బాబు జన్మించాడు. అన్యోన్యంగా సాగిన దాంపత్య జీవితంలో కలతలు మొదలై గత దసరా పండుగ నుంచి మమత భర్త భరత్ కు దూరంగా కొడుకుతో కలిసి మంచిర్యాలలో ఉంటుంది.
ఆమెకు సింగరేణి లో ఉద్యోగం చేసే రామకృష్ణా పూర్ కు చెందిన కులుమల్ల భాస్కర్ తో పరిచయం ఏర్పడింది. పెళ్ళి కాని భాస్కర్ మమతతో వివాహేతర సంబంధం పెట్టుకుని జీతం డబ్బులన్ని ఇంట్లో ఇవ్వకుండా మమతకే ఖర్చు పెట్టాడు. భాస్కర్ కు తల్లిదండ్రులు తోపాటు నలుగురు అక్కలు ఉన్నారు. ముగ్గురికి వివాహాలు అయ్యాయి. నర్మదా అనే అక్కకు ఇంకా పెళ్ళి కాలేదు. తమ్ముడు భాస్కర్ చేష్టలతో విసిగిపోయిన నర్మదా, మమతను లేపేస్తే ఫీడ వదులుతుందని భావించింది.
ప్రియుడి ప్రెండ్ తో సుపారీ హత్య ఒప్పందం…
మమతతో భాస్కర్ చనువుగా ఉంటు కుటుంబాన్ని నిర్లక్ష్యానికి గురి చేయడంతో మమతను హత్య చేయాలని నర్మదా పథకం రచించింది. నర్మదా తండ్రి రాజలింగు, బావ వెంకటేష్, కాబోయే భర్త బాయ్ ఫ్రెండ్ రఘుతో కలిసి హత్యకు ప్లాన్ వేసింది. మమతను చంపితే ఐదు లక్షలు ఇస్తామని రఘు ఫ్రెండ్ లక్షెట్ పేటకు చెందిన వేల్పుల కళ్యాణ్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఒప్పందం ప్రకారం కళ్యాణ్ ముందుగా 60 వేలు తీసుకుని మమతతో చాటింగ్ తో పరిచయం పెంచుకున్నాడు. మమత అవసరాలకు డబ్బులు ఇచ్చాడు. మమత 50 వేలు కావాలని కళ్యాణ్ ను అడగడంతో 30 వేలు ఇచ్చి, మమతను మచ్చిక చేసుకున్నాడు. ఇంకా 20 వేలు కావాలని మమత అడగడంతో జనవరి 25న కారులో కొడుకుతో సహా మమతను ఎక్కించుకుని పక్కా ప్లాన్ తో మంచిర్యాలలో అటు ఇటు తిప్పాడు.
అదే రోజు రాత్రి వరకు వెయిట్ చేసి చీకటి పడగానే మంచిర్యాలలో కారులోనే పదునైన కత్తితో మెడ వెనుక భాగంలో పొడిచి హత్య చేశాడు. మృతదేహాన్ని కారులోనే ఉంచి సుపారీ ఒప్పందం చేసుకున్న నర్మదా కుటుంబ సభ్యులకు చూపించి నాలుగు లక్షల వసూలు చేసుకున్నాడు కళ్యాణ్. రక్తపు మరకలున్న డ్రెస్ ను నర్మదా కుటుంబ సభ్యులకు అప్పగించగా ఆ డ్రెస్ ను కాల్చివేశారు.
మంచిర్యాలలో హత్యా… కరీంనగర్ జిల్లాలో డెడ్ బాడీ…
మంచిర్యాలలో మమతను హత్య చేసిన కళ్యాణ్, నర్మదా సోదరుడు భాస్కర్ డ్రెస్ వేసుకుని కారులోనే మృతదేహాన్ని రోజంతా తిప్పాడు. రిపబ్లిక్ డే రోజున లక్షట్ పెట మీదుగా రాయపట్నం, ధర్మపురి జగిత్యాల కొండగట్టు మీదుగా కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లి శివారు కు తరలించాడు. 26న అర్థరాత్రి సమయంలో కొండన్నపల్లి వద్ద ఎస్సారెస్పీ వరద కాలువ సమీపంలో పడేసి, మమత వెంట ఉన్న ఆమె నాలుగేళ్ళ కుమారుడిని తీసుకొని హైదరాబాద్ కు చేరాడు.
అక్కడ కారును వదిలేసి, సెల్ఫ్ డ్రైవింగ్ కు కారు ఇచ్చిన వ్యక్తికి పోన్ చేసి కారును తీసుకుపొమ్మని చెన్నైకి బాబుతో పాటు కళ్యాణ్ పారిపోయాడు. సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు కళ్యాణ్ చెన్నైలో ఉన్నట్లు గుర్తించి అక్కడికి చేరగా బాబును ఓ హోటల్ లో వదిలేసి కళ్యాణ్ చాకచక్యంగా తప్పించుకుని పారిపోయాడు.
బాబును చేరదీసి కుటుంబ సభ్యులకు అప్పగింత…
చైన్నైలో ఓ హోటల్ నుంచి బాబును పోలీసులు చేరదీసి నాలుగు రోజుల క్రితం కరీంనగర్ ఏసిపి శుభం ప్రకాష్ సమక్షంలో నానమ్మ తాతయ్య లకు అప్పగించారు. బాబు అదృశ్యం మిస్టరీని ఛేదించిన పోలీసులు హంతకున్ని పట్టుకొనేందుకు ప్రత్యేక బృందాలు గాలించగా ప్రధాన నిందితుడు కళ్యాణ్ తో పాటు సుఫారి హత్య ఒప్పందం చేసుకున్న నర్మదా ఆమె తండ్రి రాజలింగు బావ వెంకటేష్ కాబోయే భర్త రఘు పట్టుబడ్డారు.
ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు కటకటాల వెనక్కి పంపించారు. వివాహేతర సంబంధం మమత సుఫారి హత్యకు దారి తీసిందని చొప్పదండి సిఐ ప్రకాష్ గౌడ్ స్పష్టం చేశారు. హత్య ఉపయోగించిన కత్తి, నైలాన్ దారం కొండన్నపల్లి శివారులో పడేయగా వాటిని స్వాధీనం చేసుకున్నట్లు సిఐ తెలిపారు.
అదృశ్యం…హత్య.. మిస్టరీని ఛేదించిన పోలీసులు.
ముందుగా గుర్తు తెలియని మహిళ శవంగా భావించి కేసు నమోదు చేసిన పోలీసులు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేశారు. దీంతో మంచిర్యాలకు చెందిన మమతగా గుర్తించారు. హత్యకు గురైనట్టు భావించిన పోలీసులు ఆమె వెంట ఉన్న నాలుగేళ్ల కుమారుడు ఏమయ్యాడని ఆరా తీశారు.
భర్తకు దూరంగా కుటుంబ సభ్యులు అందుబాటులో లేకుండా ఉన్న మమత ను ఎవరు చంపారు?…బాబు ఏమయ్యాడోనని అటు కుటుంబ సభ్యులు ఇటు పోలీసులు హైరానా పడ్డారు. చివరకు పోలీసులు మమత హత్య, బాబు అదృశ్య మిస్టరీని చాకచక్యంగా 12 రోజుల్లో ఛేదించి ఐదుగురిని కటకటాల వెనక్కి పంపించడంతో పలువురు పోలీసులను అభినందించారు.
(రిపోర్టింగ్: కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)
సంబంధిత కథనం
టాపిక్