Best Web Hosting Provider In India 2024
Tamil OTT: నిహారిక కొణిదెల లేటెస్ట్ కోలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చింది – స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే
Tamil OTT: నిహారిక కొణిదెల తమిళ మూవీ మద్రాస్‌కారణ్ థియేటర్లలో రిలీజై నెల రోజులు కూడా గడవకముందే ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం నుంచి ఆహా తమిళ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈగో క్లాష్ నేపథ్యంలో యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో షేన్ నిగమ్, కలైయరాసన్ హీరోలుగా నటించారు.
Tamil OTT: మెగా డాటర్ నిహారిక కొణిదెల తమిళ మూవీ మద్రాస్‌కారణ్ ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం (నేటి) నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో రిలీజై నెల రోజులు కూడా గడవకముందే మద్రాస్‌కారణ్ మూవీ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన మద్రాస్‌కారణ్ మూవీలో షేన్ నిగమ్, కలైయరాసన్, ఐశ్వర్య దత్తా కీలక పాత్రలు పోషించారు. రివేంజ్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ మూవీకి వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహించాడు.
ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్…
సంక్రాంతి కానుకగా జనవరి 10న మద్రాస్‌కారణ్ థియేటర్లలోకి వచ్చింది. ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్‌తో పాటు రొటీన్ స్క్రీన్‌ప్లే కారణంగా ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దాదాపు ఐదు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ కోటి లోపే వసూళ్లను రాబట్టింది. నిర్మాతలకు భారీగా నష్టాలను తెచ్చిపెట్టింది.
ఈ సినిమాతో హీరోయిన్‌గా హిట్టు కొట్టాలనే నిహారిక కల తీరలేదు. మద్రాస్‌కారణ్ మూవీలో మీరా అనే యువతిగా గ్లామర్ రోల్‌లో నిహారిక కొణిదెల కనిపించింది. మలయాళ నటుడు అయినా షేన్ నిగమ్ ఈ మూవీతోనే కోలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
యాక్సిడెంట్ కారణంగా…
సత్య(షేన్ నిగమ్)తో మీరా (నిహారిక కొణిదెల)పెళ్లి ఫిక్సవుతుంది. పెళ్లి పనుల్లో ఉండగా సత్య ఓ యాక్సిడెంట్ చేస్తాడు. ఈ ప్రమాదంలో కళ్యాణి గాయపడుతుంది. సత్యపై దురైసింగం పగను పెంచుకుంటాడు.
ఇద్దరి మధ్య మొదలైన గొడవ ఈగో కారణంగా పెద్దది అవుతుంది. సత్యతో పాటు అతడి కుటుంబంపై దురైసింగం ఎటాక్ చేస్తాడు? ఆ తర్వాత ఏమైంది? దురై సింగాన్ని ఎదురించి సత్య తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అనే అంశాలతో దర్శకుడు వాలిమోహన్‌దాస్ ఈ మూవీని రూపొందించాడు.
ఒకే రోజు థియేటర్‌లో…ఓటీటీ…
శుక్రవారం నిహారిక కొణిదెల మద్రాస్‌కారణ్‌తో పాటు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఓటీటీలో రిలీజయ్యాయి. థియేటర్లలో ఈ రెండు సినిమాలు జనవరి 10నే ప్రేక్షకుల ముందుకొచ్చాయి. థియేటర్లలో ఓటీటీలలో ఒకే రోజు రిలీజ్ కావడం ఆసక్తికరంగా మారింది. గేమ్ ఛేంజర్ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. మద్రాస్‌కారణ్…నిహారిక నటించిన రెండో తమిళ సినిమా .
గతంలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో 2018లో వచ్చిన ఒరు నల్ల నాల్ పాథు సొల్రెన్ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించింది నిహారిక. ఏడేళ్ల గ్యాప్ తర్వాత మద్రాస్‌కారణ్‌తో కోలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం తెలుగులో యాక్టర్‌గానే కాకుండా ప్రొడ్యూసర్‌గా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చేస్తోంది.